ABP Desam


నవంబరు 12 రాశిఫలాలు


ABP Desam


మేష రాశి
అవసరమైన పనులను సకాలంలో పూర్తి చేయండి. మతపరమైన ప్రయాణాలు చేస్తారు. రాజకీయాల్లో ఉన్నవారికి ఎదురైన అడ్డంకులు తొలగిపోతాయి. వ్యాపారులకు నూతన పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి. ఏదైనా మాట్లాడేముందు ఓసారి ఆలోచించండి


ABP Desam


వృషభ రాశి
అందర్నీ త్వరగా నమ్మేయవద్దు. మీ రహస్యాలను ఇతరులకు చెబితే ఇబ్బందుల్లో పడతారు. దీర్ఘకాలిక వ్యాధి బయటపడే అవకాశం ఉంది జాగ్రత్త. అనవసర ప్రసంగాన్ని నియంత్రించండి. రిస్క్ తీసుకోవద్దు..గాయపడే అవకాశం ఉంది.


ABP Desam


మిధున రాశి
చాలా కాలంగా ఉన్న కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. బయటి వ్యక్తుల సహకారంతో విజయాన్ని అందుకుంటారు.మిమ్మల్ని ఏదో తెలియని భయం వెంటాడుతుంది. వ్యాపారులకు, ఉద్యోగులకు అనుకూల సమయం.


ABP Desam


కర్కాటక రాశి
పని విషయంలో కాంప్రమైజ్ అవొద్దు. మీ ఒత్తిడి, ఆందోళన పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలు కలిసొస్తాయి. సక్సెస్ దిశగా అడుగేస్తారు. ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఇల్లు మారాలి అనుకునేవారికి ఇదే మంచి సమయం.


ABP Desam


సింహ రాశి
మీ పనిలో అడ్డంకులు సృష్టించే వ్యక్తులు...ఇప్పుడు మీ పనిని ప్రశంసిస్తారు. రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. మేథోపరమైన పెట్టుబడులు మంచి ఫలితాలనిస్తాయి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.


ABP Desam


కన్యా రాశి
ఆగిపోయిన పనిని పూర్తిచేసేందుకు ఇదే మంచి సమయం. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. శారీరక నొప్పితో ఇబ్బంది పడతారు. ఏదో తెలియని ఆందోళన వెంటాడుతుంది. విచారకరమైన వార్త వినే అవకాశం ఉంది..ధైర్యంగా ఉండాలి.


ABP Desam


తులా రాశి
పోటీ పరీక్షలు రాసేవారు సక్సెస్ అవుతారు. ఇంటా బయటా కొన్ని పంచాయతీలుంటాయి. పెట్టుబడులు బాగానే ఉంటాయి. డబ్బు సంపాదన మీకు సులభం అవుతుంది. రిస్క్ తీసుకోవద్దు . వైవాహిక జీవితంలోని సమస్యల నుంచి బయటపడేందుకు ఇదే సరైన సమయం.


ABP Desam


వృశ్చిక రాశి
మీ పనిని సమయానికి చేయడం నేర్చుకోండి. మీ కారణంగా మీ జీవిత భాగస్వామి ఆందోళన చెందుతారు. ఓ శుభవార్త వినే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. పెట్టుబడులు కలిసొస్తాయి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి.


ABP Desam


ధనుస్సు రాశి
వ్యాపారంలో పురోగతికి అవకాశాలు ఉంటాయి. ఆకస్మికంగా లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగులకు శుభసమయం. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. అనవసర విషయాల్లో ఆందోళన చెందకండి. న్యాయపరమైన వ్యవహారాలు మీకు కలిసొస్తాయి.


ABP Desam


మకర రాశి
ఇష్టం లేకపోయినా ఇతరుల కోసం పని చేయాలి. వివాదాల్లో చిక్కుకుని ఇబ్బంది పడతారు. మీ గౌరవం దెబ్బతినకుండా చూసుకోండి. దూబరా ఖర్చులు పెరుగుతాయి.


ABP Desam


కుంభ రాశి
ఈ రోజు మీరు అనుకున్న పనులు..అనుకున్న విధంగా పూర్తిచేసేందుకు ప్రయత్నించండి. ఇతరుల మాటలపైనే పూర్తిగా ఆధారం పడడం లాంటివి చేయొద్దు. ఎప్పటినుంచో రావాల్సిన బాకీలు వసూలవుతాయి. ఏదో అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది.


ABP Desam


మీన రాశి
వ్యాపారంలో కొత్త ఒప్పందాలు లాభిస్తాయి. పిల్లల విషయంలో ఆందోళన ఉంటుంది. కొత్త ప్రణాళిక రూపొందించేందుకు ఇదే మంచి సమయం. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. డబ్బు సంపాదించడం సులువుగా ఉంటుంది. ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తారు.