మేష రాశి ఆకస్మికంగా ఖర్చులు జరిగే అవకాశం ఉంది. పనిలో బిజీగా ఉంటారు. వ్యాపారం, నూతన పెట్టుబడుల సహా ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.వివాదాలకు దూరంగా ఉండాలి. కుటుంబంలో కలహవాతావరణం ఉంటుంది మీరు సరిచేయాల్సి ఉంటుంది.
వృషభ రాశి తండ్రితో కొన్ని ముఖ్యమైన అంశాలపై చర్చిస్తారు. ఎప్పటినుంచో చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. పిల్లల వివాహానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి. ధాన్యం నూనె గింజల వ్యాపారులకు మంచి సమయం.
మిథున రాశి మీ తప్పులను విస్మరించవద్దు. కొత్త వ్యాపార ప్రణాళికలు చేసుకునేందుకు శుభసమయం. వ్యాపారులు కరెక్టుగా ప్లాన్ చేసుకుంటే లాభాలు పెరుగుతాయి. ఇంటా బయటా కొంత విచారకర వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి ప్రవర్తనతో ఉండండి. ఆలోచనల్లో స్థిరత్వాన్ని ఏర్పరుచుకోవడం మంచిది.
కర్కాటక రాశి ఈ రాశి వ్యాపారులు వ్యాపారంలో మందగమనం కారణంగా ఇబ్బంది పడతారు.మీ శత్రువులు చురుకుగా ఉంటారు..మీరు అప్రమత్తంగా ఉండాలి. మతవిశ్వాసాలు పెరుగుతాయి. ఏదో ఆందోళన వెంటాడినప్పటికీ తలపెట్టినలో విజయం ఉంటుంది.
సింహ రాశి తొందరపాటు వల్ల నష్టపోతారు..జాగ్రత్తపడండి. కుటుంబంలో ఆందోళన, ఒత్తిడి ఉంటుంది. కార్యాలయంలో వివాదాలకు దూరంగా ఉండండి. వాహనాలు, యంత్రాలు, అగ్నిమాపక వస్తువులు ఉపయోగించినప్పుడు జాగ్రత్త వహించండి. కొత్త స్నేహితులు ఏర్పడతారు.
కన్యా రాశి మీ మాటతీరుతో అందర్నీ ఆకట్టుకుంటారు. కారణం లేకుండా తల్లితో వాగ్వాదం జరగవచ్చు. అనుకున్న ప్రయాణం విజయవంతమవుతుంది. ప్రేమ వ్యవహారంలో అనుకూలత ఉంటుంది. రాజకీయ అడ్డంకులు తొలగిపోతాయి. విలువైన వస్తువులను మీ దగ్గర ఉంచుకోండి.
తులా రాశి పనిలో మీ సామర్థ్యం పెరుగుతుంది. ఏదో తెలియని భయం, ఆందోళన ఉంటుంది.ఆస్తి వ్యవహారాలు మీకు అనకూలంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. మీ పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు.
వృశ్చిక రాశి ఒకరి మాటలు విని ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. మిత్రులతో మనస్పర్థలు ఏర్పడవచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఔటింగ్ వెళ్లడాన్ని ఆస్వాదించండి. నిలిచిపోయిన పనుల్లో వేగం పుంజుకుంటుంది.
ధనుస్సు రాశి గతంలో పెట్టిన పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. అనవసర ప్రసంగాలు పెట్టుకోపోవడం మంచిది..లేదంటే ఆ ప్రభావం మీ పనిపై పడుతుంది. విచారకరమైన వార్త వినే అవకాశం ఉంది. ఈ రోజు మీకు పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది.
మకర రాశి ఈ రాశివారు అతితెలివి తేటలు ప్రదర్శిస్తే అనవసరంగా నష్టోతారు..అందుకే కొన్నిసార్లు అతి తెలివితేటలు హానికరం అని తెలుసుకోవడం మంచిది. కార్యాలయంలో ఉన్నతాధికారులతో సంబంధాలు బలపడతాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
కుంభ రాశి ఈ రోజు ఈ రాశివారు ఓ శుభవార్త వింటారు. మీ ఆత్మగౌరవం ముందు శత్రువులు ఓడిపోతారు. మీపై కుట్రలు జరుగుతున్నాయి అప్రమత్తంగా వ్యవహరించండి.వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. పిల్లల వివాహాల గురించి ఆందోళన ఉంటుంది.
మీన రాశి ఈ రాశి ఉద్యోగులకు కార్యాలయంలో అధికారులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని సుఖాలు,సౌకర్యాల కోసం డబ్బులు వెచ్చిస్తారు. మీరు తలపెట్టిన పనులకు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. పరస్పర సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. కొన్ని విషయాల్లో మీకు న్యాయం జరుగుతుంది.