హోమం చేస్తే నిజంగా అరోగ్యం బాగవుతుందా!



శారీరక,మానసిక లోపాలకు శాంతిగా ఔషధాలు తీసుకోవడం, దానాలు-జపాలు-హోమాలు చేయడం హిందువుల సంప్రదాయం. ఒక్కో గ్రహానికి వేరు వేరు వృక్షాల సమిధలతో హోమం చేస్తే జాతకంలో ఆ గ్రహాల ప్రభావం తగ్గడం మాత్రమే కాదు సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు.



రవి
తెల్లజిల్లేడు సమిధలతో రవికి హోమం చేస్తే..వాత,కఫ వ్యాధులు తగ్గుతాయి. కళ్ళకి సంబంధించిన అనారోగ్యం నయమవుతుంది. కోప స్వభావం తగ్గుతుంది. ఆయుర్వేదం ప్రకారం తెల్లజిల్లేడుకి కుష్టు వ్యాధిని నివారించే శక్తి ఉంది



చంద్రుడు
మోదుగ సమిధలతో చంద్రుడికి హోమం చేస్తే ఆలోచనా విధానంలో మార్పులుంటాయి. సుఖవ్యాధులు దరిచేరవు. మోదుగాకును మెత్తగా నూరి పాలలో వేసుకుని తాగితే.. స్త్రీలకు ఋతుసంబంధ సమస్యలు,గర్భ సంబంధ సమస్యలు ఉండవు.



కుజుడు
కుజుడికి చండ్ర సమిధలతో హోమం చేస్తారు. ఈ పొగ పీల్చడం వల్ల ఎర్రరక్త కణాల ఇబ్బందులు,ఎముకల బలహీనత తగ్గుతుంది. పచ్చి పోక చెక్కలు కషాయం పెట్టి సేవిస్తే మదుమేహం, కోపస్వభావం తగ్గుతుంది.



బుధుడు
ఉత్తరేణి సమిధతో హోమం చేస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయి. జీర్ణ సంభంధ సమస్యలు ఉండవు. ఉత్తరేణి ఆకులు,గింజలు పొగ వేసి పీలిస్తే దీర్ఘ కాలంగా ఉన్న దగ్గు,జలుబు,ఆయాసం తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతారు



గురువు
రావి సమిధలతో హోమంచేస్తే సంతాన దోషాలు తొలగిపోతాయి. రావి చెక్క కషాయాన్ని తేనెలో కలిపి తీసుకుంటే రక్తంలో దోషాలు తొలగిపోతాయి, కాలేయ సమస్యలు ఉండవు, వివిధ కఫ దోషాలు పోతాయి



శుక్రుడు
మేడి చెట్టు సమిధలతో శుక్రుడికి హోమంచేస్తే వివాహ సమస్యలు,వైవాహిక సంబంధ సమస్యలు ఉండవు. మోడిపండులో విత్తనాలు పొడిచేసి తేనెతో కలపి తీసుకుంటే మధుమేహం దరిచేరదు.



శని
జమ్మి సమిధలతో హోమంచేస్తే అప మృత్యు భయం తొలగి పోతుంది.దీర్ఘకాల అనారోగ్యాలుండవు. శమీ వృక్ష గాలి శరీరానికి తగిలితే శారీరక ఇబ్బందలు తొలగిపోతాయి. అందుకే నిత్యం శమీవృక్షానికి ప్రదిక్షిణలు చేస్తే అనారోగ్య సమస్యలుండవంటారు.



రాహువు
గరికలతో హోమంచేస్తే ఇంటిలో నరదృష్టి తొలగిపోయి సర్ప సంభంద దోషాలు తొలగిపోతాయి. గరిక రసాన్ని గజ్జి,చర్మంపైన ఉన్న కురుపులపై రాస్తే చర్మరోగాలుండవు. దెబ్బతగిలి రక్తం కారుతున్నప్పుడు గరిక రసాన్ని పిండితే రక్తం ఆగి పోతుంది.



కేతువు
దర్భలతో హోమం చేస్తే కాలసర్పదోషం తొలగిపోతుంది. దర్భలు మూర్ఛ రోగాన్ని తగ్గిస్తాయి



వాస్తవానికి జాతకంలో, ఇంట్లో సమస్యలకు చాలామంది దేవాలయంలో హోమాలు చేయిస్తారు...కానీ.. ఆహోమాలు ఇంట్లో చేసినప్పుడే అధిక ఫలం ఉంటుంది.



నోట్: ఇది కొన్ని పుస్తకాల నుంచి, పండితుల నుంచి సేకరించి రాసిన సమాచారం..దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం....