మేష రాశి వివాదాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యం వద్దు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
వృషభ రాశి ఈ రాశివారి వారిపై గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వివాహితుల మధ్య పరస్పర అవగాహన కొరవడుతుంది. మీ జీవిత భాగస్వామి అహంకార పూరిత ధోరణి మిమ్మల్ని బాధపెడుతుంది. పారదర్శకత ఉంటేనే మీ బంధం బలంగా ఉంటుంది.
మిథున రాశి గ్రహణం ప్రభావం మిథున రాశివారి ఆరోగ్యంపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. మీలో కొందరు పొట్టకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు. వ్యాయామం చేయడం ఉత్తమం. .
కర్కాటక రాశి కార్తీక పౌర్ణమి రోజు వచ్చే చంద్ర గ్రహణం కర్కాటక రాశివారికి అనుకూల ఫలితమే ఇస్తోంది. మీరు తలపెట్టిన పనులకు మీ ప్రియమైన వారినుంచి మద్దతు ఉంటుంది. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ముఖ్యమైన నిర్ణయాలేవీ తీసుకునేందుకు ఇది మంచి సమయం కాదు
సింహ రాశి ఈ గ్రహణం మీ జీవితంలో మీ సంతోషం నింపుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తుల్ని చేస్తుంది. నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇది సరైన సమయం మాత్రం కాదు. ఇంటి బాధ్యతలు నిర్వర్తించడంలో వెనక్కు తగ్గొద్దు.
కన్యా రాశి అత్యవసరం అయినా గ్రహణంతో ఈ రాశివారు ప్రయాణం చేయకపోవడం మంచిది. మీ మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుంది. మీ సోదరులు,సోదరీమణుల ఆరోగ్యంపై కూడా ప్రభావం ఉండొచ్చు. మనసు చంచలంగా ఉంటుంది.
తులా రాశి తులారాశివారికి ఆర్థిక విషయాలపై గ్రహణ ప్రభావం ఉంటుంది. నగదు, ఆస్తుల విషయంలోజాగ్రత్త అవసరం. నూతన పెట్టుబడులు అస్సలు పెట్టొద్దు. స్తిరాస్తుల కొనుగోలు వ్యవహారాలు ఏమైనా కొన్నాళ్లు ఆగడం మంచిది. కంటికి సంబంధించిన ఇబ్బందులు ఉండొచ్చు.
వృశ్చిక రాశి మీ జీవితంలో ముఖ్యమైన విషయాలపై ఈ గ్రహణం ప్రభావం చూపించవచ్చు మీ చర్యలకు మీరే పూర్తి బాధ్యత వహించే సమయం ఇది. కోపం తగ్గించుకోండి. ఆరోగ్యం జాగ్రత్త.
ధనుస్సు రాశి ఈ సమయంలో ఏవైనా ఉహించని ఖర్చులు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. రిస్క్ తో కూడిన వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. దీర్ఘ కాలిక పెట్టుబడులు అస్సలు పెట్టొద్దు. కొందరు ఉద్యోగులకు స్థానచలనం ఉండే అవకాశం ఉంది.
మకర రాశి గ్రహణం ఈ రాశివారికి అనుకూల ఫలితాలనిస్తుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది..కుటుంబం నుంచి సహకారం ఉంటుంది. కొత్త ఆదాయ వనరులను చూపిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలుండేలా జాగ్రత్తలు తీసుకోండి
కుంభ రాశి మీ వృత్తి, సామాజిక స్థితిగతులపై గ్రహణ ప్రభావం ఉంటుంది. మీ కీర్తి మరింతపెరుగుతుంది. నిరుద్యోగుల తిప్పలు సాగుతాయి.. ఉద్యోగులు కూడా కొత్త ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారులు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మీన రాశి కార్తీక పౌర్ణమి రోజు వచ్చే చంద్రగ్రహణ ప్రభావం..మీలో ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలిగేలా చేస్తుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ నైతికంగా వ్యవహరించండి. తండ్రి మార్గదర్శకత్వం మీకు మంచి జరుగుతుంది. పర్యటన చేయాలి అనుకున్న వారికి ఇదే మంచిసమయం.