ఈ నెల ఈ 6 రాశులవారికి అదిరిందినవంబరు నెల ఈ ఆరు రాశులవారికి అద్భుతంగా ఉంది. ఈ అదృష్టవంతుల్లో మీరున్నారా...ఇక్కడ చెక్ చేసుకోండివృషభ రాశి
వృషభ రాశివారికి నవంబరు నెల అదిరింది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తైపోతాయి. వృత్తి వ్యాపారాల్లో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. తలచిన పనులు నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులవుతారు. ఆరోగ్యం బావుంటుంది.మిథున రాశి
మిథున రాశివారికి ఈ నెల కొంతవరకూ శుభఫలితాలే ఉన్నాయి. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు, విందు-వినోదాల్లో సంతోషంగా ఉంటారు. సమయానికి ధనం చేతికందుతుంది. జీవిత భాగస్వామితో మాటలు పడడం తప్పదు. స్నేహితుల వల్ల కష్టాలుంటాయి.సింహ రాశి
ఈ నెలలో చేసే వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. మనస్సంతా ఆనందంగా ఉంటుంది. తండ్రి నుంచి ఆస్తి కలిసొచ్చే అవకాశం ఉంది. బంధువులు, స్నేహితులతో కలసి సంతోషంగా ఉంటారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తకన్యా రాశి
ఈ నెలలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. మీ రంగంలో మీరు స్ట్రాంగ్ గా నిలబడతారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. అయితే ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి.తులా రాశి
ఈ నెలలో గ్రహసంచారం బావుంటుంది. అన్నిరంగాలవారికి చేయూత ఉంటుంది. వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులకు శుభసమయం. ఆదాయానికి లోటుండదు. ఆరోగ్యం బావుంటుంది. తలపెట్టిన కార్యాల్లో చిన్న చిన్న అడ్డంకులు ఉన్నప్పటికీ ధైర్యంగా ముందుకు సాగడం వల్ల నెరవేరుతాయి.మకర రాశి
ఈ నెల మకరరాశివారి ఉత్సాహం రెట్టింపవుతుంది. ఆరోగ్యం బావుంటుంది. వాహనసౌఖ్యం ఉంది.ఉద్యోగుల పరిస్థితి గతంలో కన్నా బావుంటుంది. రాజకీయ వ్యవహారాలు కలిసొస్తాయి. నూతన వస్తు, వస్త్రాభరణ ప్రాప్తి.తలచిన పనులు నెరవేరుతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభం ఉంటుంది.నోట్: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు


Thanks for Reading. UP NEXT

నవంబరు నెల ఈ 6 రాశులవారికి ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్యం భంగం

View next story