నవంబరు నెల ఈ 6 రాశులవారికి ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్యం భంగం



నవంబరు నెల ఈ ఆరు రాశులవారికి అంత అనుకూలంగా లేదు... ఇందులో మీ రాశిఉందా చెక్ చేసుకోండి...



మేష రాశి
ఈ రాశివారికి ఈ నెల అష్టమంలో గ్రహసంచారం వల్ల అన్నింటా ప్రతికూలతలే ఎదురవుతాయి. నమ్మినవారి వల్ల మోసపోతారు. జీవిత భాగస్వామి, పిల్లలకు అనారోగ్య సూచనలున్నాయి. వ్యాపారులకు ఉత్సాహం ఉండదు. ఉద్యోగులు పై అధికారుల వలన భయపడతారు. అనవసర వివాదాలున్నాయి జాగ్రత్త...



కర్కాటక రాశి
ఈ నెలలో మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బావుంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో కలహ వాతావరణం, భార్యభర్త మధ్య అన్యోన్యత లోపించడం జరుగుతుంది



వృశ్చిక రాశి
ఈ నెలలో కొన్నింటిలో జయం, మరికొన్నింట అపజయం ఉంటాయి. అనుకోని ఖర్చులు పెరుగుతాయి, ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఆదాయానికి లోటుండదు కానీ ఖర్చులు కూడా అలాగే పెరుగుతాయి. ఈ రాశివారు ఎవ్వరిచేతిలో అయినా తొందరగా మోసపోతారు.



ధనస్సు రాశి
గృహంలో వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ధనం సరైన సమయానికి చేతికందుతుంది. పాతబాకీలు వసూలవుతాయి. శుభవార్త వింటారు. వ్యసనాల కారణంగా ధనం ఖర్చు చేసే అవకాశం ఉంది. ఊహించని ఖర్చులుంటాయి. ప్రతివిషయంలో ఆటంకాలు ఎదురవుతాయి.



కుంభ రాశి
కుంభ రాశివారికి ఈ నెల గ్రహసంచారం మిశ్రమంగా ఉంది. ఈ రాశికి చెందిన అన్నిరంగాల వారికి బాగానే ఉంది. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఆర్థిక పరిస్థితి పర్వాలేదు. తలపెట్టిన పనుల్లో అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగుతారు.అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త.



మీన రాశి
నవంబరు నెల ఆరంభం అస్సలు బాలేదు. ఆర్థిక సమస్యలు వెంటాడతాయి. అశుభవార్తలు వింటారు..అన్నదమ్ములతో వివాదాలుంటాయి. ఇతరుల వలన మాటలు పడడం, అపనిందలు తప్పవు. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు ఉంటాయి. ద్వితీయార్థంలో పరిస్థితి కొంత ఆశాజనకంగా ఉంటుంది.



నోట్: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు