సహనం, ఓపికకి ఈ రాశులవారు కేరాఫ్ అడ్రస్!



కొంతమంది కోపంగా ఉంటారు..ఇంకొందరు ఆవేశపడిపోతుంటారు..మరికొందరు మాత్రం సహనంగా సంయమనంతో వ్యవహరిస్తారు..ఇది కూడా మీ రాశిని బట్టే ఉంటుందట..మరి సంయమనంతో వ్యవహరించే రాశులేంటో చూద్దాం...



వృషభ రాశి
ఈ రాశివారు ఓపికకు చిరునామాగా వ్యవహరిస్తారు. ఏదైనా ఆకస్మిక సంఘటన జరిగినా వెంటనే ఏదో ఆలోచనలో పడి ఉండిపోయినా కష్టానికి తగిన ఫలితం వస్తుందని నమ్ముతారు. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోరు.



కర్కాటక రాశి
చంద్రునికి చెందిన కర్కాటక రాశి వారు చాలా సున్నితమైన భావోద్వేగాలు కలిగిఉంటారు. వీరు ఎదుటివారి భావాలను అర్థం చేసుకుంటారు, వారి భావోద్వేగాలను పరిగణలోకి తీసుకుంటారు...అందుకే ఏదైనా జరిగిన వెంటనే ఆవేశం ప్రదర్శించకుండా సంయమనంతో వ్యవహరిస్తారు.



కన్యా రాశి
ఈ రాశివారికి యాజమాన్య లక్షణాలుంటాయి. ఎంత కష్టాన్నైనా ఎదుర్కొనేందుకు ఈ రాశివారు సిద్ధంగా ఉంటారు. ఏం జరిగినా కారణాలు అన్వేషించి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తారు కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోరు.



వృశ్చిక రాశి
ప్రతీకార జాబితాలో ఈ రాశిదే అగ్రస్థానం. ఎవ్వరినైనా టార్గెట్ చేస్తే ఎదుటివారు తప్పించుకోలేనంత ఊబిలోకి నెట్టేయగలరు. అయినప్పటికీ వీరు చాలా ఓపికతో ఉంటారు. సంఘటన జరిగిన వెంటనే రియాక్టవకుండా...సమయం కోసం పొంచి ఉంటారు...



కుంభ రాశి
శని ఆధీనంలో ఉన్న కుంభరాశి వారికి స్వతంత్ర్య భావాలెక్కువ. అందుకే ఎంత నచ్చని సంఘటన జరిగినా మళ్లీ తమ మనసుకి నచ్చినట్టు జరిగేవరకూ సహనంగా వేచి చూస్తారు. ఎవ్వరి విషయాల్లోనూ జోక్యం చేసుకోవడం వీరికి ఇష్టం ఉండదు.



వ్వరికైనా జీవితంలో ఓపిక, సహనం చాలా అవసరం. సహనం ఓ సద్గుణం. కానీ ఇది చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది.



ఉరకల పరుగుల జీవితంలో ఒత్తిడి గురై సహనం అనే మాటే దూరమైపోతోంది. ఈ ఒత్తిడిని జయించడానికే యోగా, ధ్యానం చేయాలంటారు నిపుణులు.



నోట్: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు