అక్టోబరు 25 రాశిఫలాలు



మేష రాశి
మేష రాశివారు కొన్ని ముఖ్యమైన విషయాలను తండ్రితో చర్చిస్తారు. నిలిచిపోయిన డబ్బు చేతికందుతుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. పిల్లల వివాహానికి సంబంధించి కొన్ని సమస్యలుంటాయి. వ్యాపారులు బిజీబిజీగా ఉంటారు.



వృషభ రాశి
చిన్న చిన్న పొరపాట్లను పెద్దవిగా భావించి ఎక్కువ అలోచించొద్దు. వ్యాపారం బావుంటుంది. ఉద్యోగులు పనితీరులో మార్పువల్ల భారీ లాభాలొస్తాయి. మీ జీవిత భాగస్వామి పట్ల మీ ప్రవర్తనను సరిదిద్దుకోండి. స్థిరత్వాన్ని కోల్పోవద్దు.



మిథున రాశి
ఈ రాశివ్యాపారులకు సమయం అంతగా కలసిరాదు. వ్యాపారంలో మాంద్యం కారణంగా ఇబ్బంది పడతారు. శత్రువులు చురుకుగా ఉంటారు మీరు అప్రమత్తంగా ఉండాలి. తొందరగా అలసిపోతారు..మత విశ్వాసం పెరుగుతుంది. ఆందోళన ఒత్తిడి ఉంటుంది.



కర్కాటక రాశి
కుటుంబంలో ఆందోళన, ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో వివాదాలకు దూరంగా ఉండాలి. వాహనాలు, మెషినరీ ఉపయోగించడంలో జాగ్రత్తగా ఉండండి. కొత్త స్నేహితులు వచ్చి చేరుతారు.



సింహ రాశి
మీ మాటతీరుకి అందరూ ఆకర్షితులవుతారు. తల్లి నుంచి అనవసరమైన ఒత్తిడి ఉంటుంది.మీ ప్రయాణం విజయవంతమవుతుంది. ప్రేమ వ్యవహారంలో అనుకూలత ఉంటుంది. తలపెట్టిన పనుల్లో చిన్న చిన్న అడ్డంకులు ఉన్నా తొలగిపోతాయి.



కన్యా రాశి
ఈ రాశివారు ఏదో విషయంలో భయపడతారు. ఒత్తిడికి లోనపుతారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. పిల్లల కారణంగా మీరు సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు శుభసమయం.



తులా రాశి
ఎవ్వరి మాటలను పట్టించుకోవద్దు..పరిగణలోకి తీసుకోవద్దు.పోటీపరీక్షలు రాసే విద్యార్థులు విజయం సాధిస్తారు. ఆగిపోయిన పనులు వేగవంతం అవుతాయి. ఉద్యోగులు పనిపై శ్రద్ధ పెట్టండి. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి.



వృశ్చిక రాశి
మీ మాటతీరుని మార్చుకోవాల్సి ఉంది. ఉద్యోగులు కార్యాలయంలో పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడాదు. అశుభ వార్త వినే అవకాశం ఉంది. అధిక పని వల్ల వ్యక్తిగత జీవితం ప్రభావితం అవుతుంది.



ధనుస్సు రాశి
అధిక తెలివితేటలు వల్ల కొన్నిసార్లు హాని కలుగుతుంది. సహోద్యోగులతో ఉద్యోగుల బంధాలు బలోపేతం అవుతాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు.



మకర రాశి
కుటుంబ సభ్యుల నుంచి శుభవార్త వింటారు. మీ ఆత్మగౌరవం పెరుగుతుంది. శత్రువులు మీ ముందు ఓడిపోతారు. మీ చుట్టూ ఉండేవారి వల్లే మీకు హాని పొంచిఉంది జాగ్రత్తగా ఉండాలి. పిల్లల వివాహం గురించి మీరు ఆందోళన చెందుతారు.



కుంభ రాశి
మీ ప్రవర్తనతో అందరి మెప్పు పొందుతారు. మీ కారణంగా జీవిత భాగస్వామి మాత్రం ఆందోళన చెందుతారు. వ్యాపార ప్రయాణాలు విజయవంతమవుతాయి. నిరుద్యోగులకు ఇదే శుభసమయం. మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి.



మీన రాశి
ఖర్చులు భారీగా పెరుగుతాయి. వ్యాపారం పుంజుకుంటుంద. మీ తొందరపాటు వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది. ఎవ్వరితోనూ వాదనలు పెట్టుకోవద్దు. కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు.