అక్టోబరు 24 రాశిఫలాలుమేష రాశి
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. ఆదాయం-వ్యయానికి సంబంధించి బడ్జెట్ తయారు చేసుకోవడం మంచిది. ఎవరికైనా అప్పిచ్చిన వ్యాపారులు తిరిగి పొందుతారు. వేరేవారి విషయంలో అస్సలు ఇన్వాల్వ్ కావొద్దు. నిరుద్యోగులకు ఇది మంచి సమయం. ఓ శుభవార్త వింటారువృషభ రాశి
ఈ రోజు మీకు శక్తివంతమైన రోజు. మీ స్నేహితుల సహాయంతో ఓ సమస్యను పరిష్కరిస్తారు. మీ ప్రణాళికలు వేగవంతం అవుతాయి. పనికిరాని విషయం గురించి ఆందోళన చెందుతారు. మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు.మిథున రాశి
ఈ రోజు మీకు ఆర్థికంగా కలిసొచ్చే రోజు. పెద్దల నుంచి ఆస్తి కలిసొస్తుంది. బెట్టింగ్ లో డబ్బు పెట్టుబడి పెట్టేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణం చేయాల్సిన అవసరం రావొచ్చు..మీ విలువైన వస్తువులను సంరక్షించుకోండి. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందుతారు.కర్కాటక రాశి
ఈ రోజు మీకు కలిసొచ్చే రోజు. మీ కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది. ఏదైనా కొత్త పన చేయడానికి ఇంటి నుంచి బయటకు వెళితే తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదం తీసుకోండి. దినచర్యలో మార్పుల కారణంగా మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించలేరు.సింహ రాశి
ఈ రోజు మీకు సంతోషకరమైన రోజు అవుతుంది. కుటుంబ సభ్యుల నుంచి ఓ శుభవార్త వింటారు. మీ తెలివితేటలతో శత్రువులపై పై చేయి సాధిస్తారు. రాజకీయాల్లో పనిచేసే వారు ఏ వైపు అడుగేయాలో తెలుసుకుంటారు. విద్యార్థుల ఉన్నత విద్యకు మార్గం సుగమం అవుతుంది.కన్యా రాశి
ఈ రోజు ఆర్థిక పరంగా మీకు బలమైన రోజు..కొత్తగా వ్యాపారం చేసేవారికి అనుకూల సమయం. మీ మాటలతో కుటు౦బ సభ్యులు స౦తోష౦గా ఉ౦టారు...వారికి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాల్సి ఉ౦టు౦ది. చిన్న పిల్లల కోసం బహుమతిని తీసుకొస్తారు.తులా
ఈ రోజు మీకు ఖర్చులతో నిండి ఉంటుంది. విదేశాలలో నివసిస్తున్న కుటుంబ సభ్యుల నుంచి కొంత మంచి సమాచారాన్ని వింటారు. పిల్లల చదువుకు సంబంధించి దూర ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ రోజు మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవలసి వస్తే, చాలా జాగ్రత్తగా ఆలోచించండి..వృశ్చిక రాశి
ఈ రోజు మీరు చాలా ఆలోచనాత్మకంగా పని చేయాల్సిన రోజు. ఈ రోజు కుటుంబ సభ్యుల భవిష్యత్తుకు సంబంధించి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే చాలా ఆలోచిస్తారు. ఈ రాశి వ్యాపారులు ప్లానింగ్ బిజినెస్ లో చురుకుగా ఉంటారు. ఈ రోజు మీరు ముఖ్యమైన పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు.ధనుస్సు రాశి
ఈ రోజు మీ స్థానం, ప్రతిష్ట పెరుగుతుంది. మీరు పనిలో ఎవరినీ నమ్మాల్సిన అవసరం లేదు లేదంటే మోసపోతారు. మీరు ఎదుర్కొనే సమస్యను కుటుంబ సభ్యుల సహకారంతో పరిష్కరించుకుంటారు. మీ బాధ్యతలను నెరవేర్చడంలో మీరు ముందుంటారు.మకర రాశి
మకర రాశివారికి ఉన్నత శిఖరాలను అధిరోహించే రోజిది. మీరు వినోద కార్యక్రమాల్లో కొంత సమయం గడుపుతారు. కుటుంబంలోని సీనియర్ సభ్యులతో కూరుచొని కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చించవచ్చు. సోదరభావాన్ని పెంపొందించడం పరస్పర సంఘర్షణకు ముగింపు పలుకుతుంది.కుంభ రాశి
ఈ రోజు మీరు ఒక విషయాన్ని ఓపికగా పరిష్కరించుకునే రోజు. కుటుంబ సభ్యుల దగ్గర సహనాన్ని కొనసాగించాలి. మీ మాటతీరుపై సంయమనం పాటిస్తేనే సంబంధాలు నిలుపుకోగలుగుతారు. స్నేహితుల మద్దతుతో ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.మీన రాశి
ఈ రోజు ఈ రాశి ఉద్యోగులు ఉత్తమ పని కనబరుస్తారు. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు మంచి లాభం పొందుతారు. ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి మీరు కొన్ని కొత్త ప్రయత్నాలను ఫాలో అవొచ్చు. సామాజిక సేవ ద్వారా మీరు గౌరవం పొందుతుంది. మీ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది.


Thanks for Reading. UP NEXT

శుక్రుడు -బుధుడు కలయికతో ఈ రాశులవారికి యోగం

View next story