అక్టోబరు 22 రాశిఫలాలుమేష రాశి
ఈ రోజు స్టాక్, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టేందుకు మంచి రోజు. ఈ రోజు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుంచి సహకారం ఉంటుంది.వృషభ రాశి
ఈ రోజు మీరు కుటుంబంతో సయోధ్య పెరుగుతుంది. మీరు తలపెట్టిన పనులకు జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ రోజున మీరు ఇంట్లో ఏదైనా ముఖ్యమైన వస్తువును కొనుగోలు చేస్తారు.పిల్లలకు బహుమతులు ఇస్తారు. ఉద్యోగులు,వ్యాపారులకు మంచి ఫలితాలున్నాయి.మిథున రాశి
ఈ రాశి ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ఎదుర్కోలేరు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబం పట్ల భక్తి భావన ఉంటుంది. కార్యాలయంలో సంపూర్ణ సమతుల్యతతో ఉండండి.కర్కాటక రాశి
పనికిరాని విషయాల గురించి వాదిస్తూ మీ శక్తిని వృధా చేసుకోకండి. అనవసర వాదనలు, చర్చల ద్వారా ఏమీ పొందలేమని గుర్తుంచుకోండి. ఈ రోజు మీరు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు, ప్రయోజనాలు మరియు అప్రయోజనాలను జాగ్రత్తగా పరిశీలించండి.సింహరాశి
ఈ రోజు మీరు ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఏ పని మొదలుపెట్టినా మీకు శుభప్రదమైన ఫలితాలనిస్తుంది. ఈ రోజు మీరు ఇంట్లో రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. పిల్లలతో మంచి సమయం గడుపుతారు.కన్యారాశి
ఈ రోజు ఈ రాశివారికి ఆర్థిక ప్రయోజనాలుంటాయి. కళాత్మక రచనలతో సంబంధం ఉన్న వ్యక్తులు కీర్తిని పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వాదనలకు దూరంగా ఉండండి. అత్సుత్సాహం ప్రదర్శించవద్దు.తులారాశి
మీ సంతోషమే మీకు పెద్ద ఆస్తి అని గుర్తించుకోండి. మానసికంగా బలంగా ఉంటే శారీరక అనారోగ్యం కూడా నయం అవుతుంది. ఆదాయానికి మించిఖర్చులు చేయవద్దు..అప్పులు అస్సలే తీసుకోవద్దు. వివాదాలు, విభేదాల కారణంగా కుటుంబంలో కొంత గందరగోళంగా ఉంటుంది.వృశ్చిక రాశి
ఈ రోజు మీకు మంచిరోజు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాన్ని సందర్శిస్తారు. స్నేహితులను కలసి మాట్లాడటం వల్ల మనస్పర్థలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.ధనుస్సు రాశి
ఈ రోజు మీరు కుటుంబ బాధ్యతలను పూర్తి చేయగలుగుతారు. తోబుట్టువులతో సత్సంబంధాలలో మధురానుభూతి ఉంటుంది. సామాజిక గౌరవం పెరుగుతుంది. రాజకీయ రంగంలో పురోగమించే అవకాశాలు ఉంటాయి. పిల్లలకు సంబంధించిన ఆందోళన కలవరపెడుతుంది.మకర రాశి
జీవిత భాగస్వామితో పరస్పర సంభాషణ, సహకారం మీ బంధాన్ని బలోపేతం చేస్తుంది. అధిక పని కారణంగా తొందరగా అలసిపోతారు. ఎవ్వరు చెప్పిన మాటలు వినొద్దు..మీకు మీరుగా ఓ నిర్ణయానికి రండి..కుంభ రాశి
ఈ రోజు కుంభరాశివారు ఓ శుభవార్త వింటారు. అకస్మాత్తుగా మీరు ఆర్థిక ప్రయోజనం పొందుతారు. కొన్ని ప్రత్యేక పనుల కోసం ఇతరుల అభిప్రాయాన్ని తీసుకోవాల్సి రావొచ్చు. ఇది మీ పనిని సులభతరం చేస్తుంది.మీన రాశి
మీ ఆలోచనలకు దగ్గరగా ఉండేవారిని ఈరోజు కలుస్తారు. ఎక్కడికైనా ప్రయాణించే ప్లాన్ ఉంటే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ప్రతిచోటా ప్రశంసలు అందుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది.


Follow for more Web Stories: ABP LIVE Visual Stories