ABP Desam


ధంతేరాస్ 2022: ధన త్రయోదశికి ఏ రాశివారు ఏం కొనాలంటే!


ABP Desam


మేష రాశి
ఈ రాశివారు పసుపు రంగు వస్తువులను కొనడం మంచిది. తాబేలు బొమ్మ (కుబేర) వంటి ఇంటి అలంకరణ సామాగ్రి మీద పెట్టుబడి పెట్టండి. అలంకరణ సామాగ్రి కొనండి...చెక్క సామాగ్రి అస్సలు కొనొద్దు.


ABP Desam


వృషభం
మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే వస్తువులు కొనడం మీకు మేలు చేస్తుంది. బంగారం, రాగి, ఎర్రని దారం , గాజు వస్తువులు, ఇంటికి అవసరమైన సామాగ్రీ ఈ వారంలో కొనుగోలు చేయండి


ABP Desam


మిధునం
మిథున రాశివారు బంగారం కొనుగోలు చేయడం మంచిది. మీ పరిసరాలలో మార్పులు తెచ్చే అలంకరణ సామాగ్రీ, కొత్త బట్టలు కొనడం శ్రేయస్కరం. ఈ సమయంలో మీరు ఏవైనా డీల్స్ సైన్ చేస్తే అవి మీకు మంచి భవిష్యత్తును ఇస్తాయి.


ABP Desam


కర్కాటకం
వజ్రాలు, ప్రిషియస్ స్టోన్స్, నగలు కొనడం ఈ రాశి వారికి మేలు చేస్తుంది. అయితే నమ్మకమైన చోట మాత్రమే కొనుక్కోండి. ఈ రాశిలో కొంత మంది ఈ వారంలో కొత్త పెట్ లేదా మొక్కను కొనే అవకాశం ఉంది.


ABP Desam


సింహం
వెండి లేదా బంగారంలో లక్ష్మీ దేవి మూర్తి కొనుక్కోవడం చాలా మంచిది. లేదా ఏదైనా దైవ సంబంధ వస్తువు కొని తెచ్చుకోవచ్చు. ఇంట్లో అవసరం లేని వస్తువులను తప్పకుండా తీసి పారెయ్యాలి. పువ్వులు, ధాన్యం, కొత్త బట్టలు ఈ వారం కొనుగోలు చేస్తే మంచిది.


ABP Desam


కన్య
ఈ రాశి వారు మల్టీ కలర్ లో ఏదైనా వస్తులవు కొనుగోలు చేయండి. గ్రీన్ కలర్ లో ఏదైనా విలువైన వస్తువు కొనుక్కోవడం వల్ల మేలు జరుగుతుంది. స్తోమతకు మించిన ఖర్చులు చేయరాదు. పువ్వులు లేదా పువ్వులతో ఉన్న ఫ్రేమ్ కొనడం వల్ల లాభం ఉంటుంది.


ABP Desam


తుల
ఈ రాశివారు వజ్రాలు, ప్లాటినం, బంగారం, వెండి వంటి విలువైన వస్తువులు కొంటే మంచిది. డిజైనర్ దుస్తులు కొనుగోలు చేసినా శుభం జరుగుతుంది.


ABP Desam


వృశ్చిక
మీ మనసుకు నచ్చిన మీ స్తోమతకు తగిన వస్తువులు ఏవైనా ఈ రాశి వారు కొనవచ్చు. బంగారం, వజ్రాలు, పుస్తకాలు, ఏవైనా నీటికి సంబంధించిన వస్తువులు కొనడం కూడా మంచిదే. కొంచెం తెలివిగా షాపింగ్ చేయండి


ABP Desam


ధనస్సు
ఇతరులకు గిప్ట్ చెయ్యగలిగే వస్తువు ఏదైనా మీరు కొనుగోలు చేయవచ్చు. మీకోసం కన్నా ఇతరులకోసం షాపింగ్ చేయండి. మీ కోసమైతే వెండి కొనుగోలు చేయండి. ప్రకృతిలో సహజంగా దొరికే రాళ్లు, క్రిస్టల్స్ వంటివి కొంటే మేలు జరుగుతుంది.


ABP Desam


మకరం
ఈ రాశివారు బంగారం లేదా వెండి మీద పెట్టుబడి పెట్టండి. కొత్త బట్టలు కొనుక్కోవడం వల్ల మీలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఈ వారం కొత్త శక్తి సంతరించుకుంటుంది.


ABP Desam


కుంభం
దేనిలోనైనా పెట్టుబడి పెట్టడం ఈ సమయంలో చాలా శుభకరం. బంగారం, కెంపులు లేదా పసుపు పచ్చని వస్తువులు కొనడం శుభప్రదం.


ABP Desam


మీనం
లక్ష్మీ, గణేష వెండి నాణేలు లేదా విగ్రహాలు వంటి ఇంటికి సంబంధించిన వస్తువులు కొనడం మంచిది. ఈ వారం మీరు వెండి కొనడం లాభదాయకం.


ABP Desam


నోట్: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు