అక్టోబరు 17 నుంచి 23 వారఫలాలు



మేష రాశి
ఈ వారం మేషరాశివారికి శుభసమయం. అనుకున్న పనులు పూర్తవుతాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేయాలి అనుకుంటే ఇదే మంచి సమయం. వ్యాపారులకు,ఉద్యోగులకు శుభఫలితాలున్నాయి. దుబారా ఖర్చు తగ్గించండి.



వృషభ రాశి
ఈ వారం కష్టానికి తగిన ఫలితం అందుతుంది. అదృష్టం కలిసొస్తుంది. అనుకున్న పనులు శ్రద్ధగా పూర్తిచేస్తారు. సన్నిహితుల సలహాలు,సూచనలు పాటించండి. అవసరానికి డబ్బు చేతికందుతుంది. వారసత్వ ఆస్తుల తగాదాలు సాగుతూనే ఉంటాయి.



మిథున రాశి
ఈ రాశివారు ఈ వారం ప్రతి పనిని పట్టుదలగా చేస్తారు. ఆర్థికపరంగా ఎలాంటి లోటు ఉండదు. స్థిరాస్తి విషయంలో సోదరులతో అంగీకారానికి వస్తారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు.



కర్కాటక రాశి
ఈ వారం కర్కాటక రాశివారికి ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహన్నిస్తాయి. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. ఎప్పటి నుంచో అనుకున్న ఓ పని ఈ రోజు పూర్తికావడం సంతోషాన్నిస్తుంది. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు పెడతారు. వారం ప్రారంభంలో ఖర్చులు పెరుగుతాయి.



సింహ రాశి
ఈ వారం మీరు ఆత్మవిశ్వాసంతో పనిచేయండి అంచనాలకు తగిన ఫలితాలు అందుకుంటారు. ఎప్పటి నుంచో సాగుతున్న స్థిరాస్తి వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. నూతన వాహనాల కొనుగోలు చేస్తారు. వ్యాపారం బాగా సాగుతుంది. ఉద్యోగులకు పదోన్నతికి అవకాశాలున్నాయి.



కన్యా రాశి
ఈ వారం కన్యారాశివారి ఆర్థిక పరిస్థితి మునుపటి కన్నా మెరుగ్గా ఉంటుంది. అనుకున్న సమయంలో పనులు పూర్తిచేస్తేనే లాభం పొందుతారు.మీకు డైలమా వచ్చిన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు,సూచనలు తీసుకోవడం మంచిది. తెలియని విషయాల్లో అనవసరంగా తలదూర్చవద్దు..



తులా రాశి (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)
ఈ వారం తులారాశివారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఏకాగ్రతతో పనిచేస్తే సక్సెస్ అవుతారు. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలుంటాయి. స్తిరాస్తులు కొనుగోలు చేసేందుకు ఇదే మంచిసమయం. ఉద్యోగులకు ఇబ్బందులు తొలగిపోతాయి



వృశ్చిక రాశి
వృశ్చిక రాశివారికి ఈ వారం అద్భుతంగా ఉంటుంది. సకాలంలో తీసుకునే నిర్ణయాలవల్ల సక్సెస్ అవుతారు. మీరు ఎలా ఉండాలి అనుకుంటే అలాగే ఉంటారు. ఈ వారం అదృష్టం మీ వెంటే ఉంది. ఉద్యోగులకు మంచి సమయం. విలువైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తారు.



ధనుస్సు రాశి
ఈ వారం ఈ రాశివారికి కూడా అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. స్తిరాస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు, ఉద్యోగులు,విద్యార్థులు అందరూ సక్సెస్ అవుతారు. వారం మధ్యలో అనారోగ్య సూచనలున్నాయి ఆరోగ్యం జాగ్రత్త.



మకర రాశి
ఈ వారం ఈ రాశివారు ఆత్మవిశ్వాసం, పట్టుదలతో అనుకున్నపనులు పూర్తిచేస్తారు.నిరుద్యోగుల శ్రమకు ఫలితం లభిస్తుంది. మనోబలం ఉంటేనే సక్సెస్ అవుతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు..అనుభవజ్ఞులను సంప్రదించాకే నిర్ణయం తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.



కుంభ రాశి
ఈ వారం కుంభరాశివారు అత్యంత ఉత్సాహంగా పనిచేస్తారు. అవాంతరాలు ఎదురైనా పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకుంటారు. విద్యార్థులు సక్సెస్ అవుతారు. కళారంగంలో ఉన్నవారికి అనుకూల సమయం ఇది. ఆరోగ్యం జాగ్రత్త. ఆస్తివివాదాలు పరిష్కారమవుతాయి.



మీన రాశి
ఈ వారం మీనరాశివారికి ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. వారం ప్రారంభంలో ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఉద్యోగులు, వ్యాపారులకు సహనం అవసరం. ధైర్యంగా ముందడుగు వేయండియ. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెంచుకుంటే ప్రశాంతత పెరుగుతుంది.