ABP Desam


అక్టోబరు 21 రాశిఫలాలు


ABP Desam


మేష రాశి
ఈ రోజు మీ ధైర్యసాహసాలు, శక్తి పెరుగుతుంది. అవివాహితుల జీవితంలోకి ఒక కొత్త అతిథి ప్రవేశించే అవకాశం ఉంది. మీ ఆలోచనలో సానుకూలతను కొనసాగించాలి. కుటుంబ విషయాలు బయటకు మాట్లాడొద్దు. పిల్లల నుంచి శభవార్త వింటారు.


ABP Desam


వృషభ రాశి
ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యుల సహాయంతో మీరు ఒక కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఏ పనీ చేయాలని అనిపించదు..ఆ పని కోసం పట్టుబట్టి చేయాల్సిన అవసరమూ లేదు.


ABP Desam


మిథున రాశి
ఈ రోజు మీకు ముఖ్యమైన రోజు అవుతుంది. సౌకర్యాలు పొందడంలో సంతోషంగా ఉంటారు. మీ స్నేహితుడు ఒక రకమైన సహాయం కోసం మిమ్మల్ని అడగవచ్చు. తొందరపాటు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. కుటుంబంలో సభ్యుల గురించి చెడుగా భావించవద్దు.


ABP Desam


కర్కాటకరాశి
ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అంతగా కలసిరాదు. ప్రణాళిక లేకుండా ముందడుగు వేస్తే నష్టపోతారు. మీ పూర్వీకుల ఆస్తికి సంబంధించిన ఏవైనా కేసులు కోర్టులో జరుగుతున్నట్లయితే వాటి నిర్ణయం మీకు అనుకూలంగా రావచ్చు. ఇంటి నిర్వహణ, పరిశుభ్రతపై పూర్తి శ్రద్ధ వహిస్తారు.


ABP Desam


సింహ రాశి
ఈ రోజు మీరు సృజనాత్మక పనులతో కనెక్ట్ అయ్యే రోజు. మీ జీవితభాగస్వామి కోసం మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం మంచిది. పిల్లల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. దీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు కొన్నింటిని పూర్తిచేయకపోతే మరింత ఇరుక్కుపోతారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది


ABP Desam


కన్యా రాశి
ఈ రోజు మీరు దాతృత్వ పనిలో గడుపుతారు..మంచి పేరుసంపాదిస్తారు. ఏదైనా చట్టపరమైన పని చేసేటప్పుడు దాని పాలసీ నియమాలను పూర్తిగా పాటించాలి లేదంటే శిక్ష అనుభవించకతప్పదు. ఉద్యోగులకు మంచి రోజు. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి.


ABP Desam


తులా రాశి
ఈ రోజు మీకు సంతోషకరమైన రోజు అవుతుంది. వ్యాపారంలో విజయాలు సాధిస్తారు. కుటుంబంలోసమస్యలు పరిష్కరించుకుంటారు. మీ మునుపటి పొరపాట్లలో ఏవైనా మీకు ఒక సమస్యగా మారవచ్చు. సంపాదనపై పూర్తిగా దృష్టి సారించాలి. ఎవ్వరికీ ఎలాంటి వాగ్ధానం చేయొద్దు.


ABP Desam


వృశ్చిక రాశి
ఈ రోజు మీ ప్రభావం, కీర్తి పెరుగుతుంది. పనిప్రాంతంలో మీ స్థానం పెరుగుతుంది. వ్యాపార కార్యకలాపాలు చాలా వ్యత్యాసాన్ని కలిగిస్తాయి.కుటుంబ సభ్యులనుంచి సంతోషకరమైన వార్త వింటారు. ఉద్యోగులకు మంచిరోజు.తల్లిదండ్రులు మీపై కొన్ని బాధ్యతలను ఉంచవచ్చు.


ABP Desam


ధనుస్సు రాశి
ఈ రోజు మీరు కుటుంబ సభ్యుల నుంచి శుభవార్త వింటారు. ఏ పని చేసినా అదృష్టం మీ వెంటే ఉంటుంది..సక్సెస్ అవుతారు. మీ ప్రణాళికలు ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యుల సహకారంతో వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నవారికి శుభసమయం.


ABP Desam


మకర రాశి
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. ఆహారాన్ని నియంత్రిస్తూనే సాత్విక ఆహారాన్ని తీసుకుంటే మీ జీర్ణవ్యవస్థ కూడా బాగుంటుంది. కుటుంబంలో ఓ శుభకార్యం నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితిలో పెద్దగా మార్పులుండవు. భవిష్యత్ కోసం ప్రణాళికలు వేసుకోండి.


ABP Desam


కుంభ రాశి
వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. మునుపటి కన్నా ఎక్కువ వనరుల నుంచి ఆదాయాన్ని పొందితే మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోవడానికి మీరు పార్ట్ టైమ్ ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు శుభసమయం.


ABP Desam


మీన రాశి
ఈ రోజు మీరు జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. అనుభవజ్ఞుడైన వ్యక్తిని అడగడం ద్వారా మాత్రమే మీరు డబ్బును పెట్టుబడి పెట్టడం మంచిది. ఉద్యోగం చేసే వ్యక్తులు మంచి గుర్తింపు పొందుతారు. మీ సహోద్యోగుల నమ్మకాన్ని గెలుచుకోండి. సంపాదన చూసుకుని ఖర్చు చేయడం మంచిది.