ఒకే రాశిలో శుక్రుడు -బుధుడు , ఈ రాశులవారికి యోగం



జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల కదలికకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతి నెలా ఏదో ఒక గ్రహం తన స్థానాన్ని మారుతూ ఉంటుంది. వీటి మార్పు వల్ల మన జీవితాలపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది.



ఈ గ్రహాల గమనం వల్ల, ఇతర గ్రహాలతో సంచారం వల్ల ప్రత్యేక యోగాలు ఏర్పడతాయి. శుభమైనా, అశుభమైనా దాని ప్రభావం మనిషి జీవితంపై ఏదో ఒక రూపంలో కనిపిస్తుంది.



జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్టోబర్ 26 బుధవారం ప్రత్యేక యోగం ఉంటుంది.అదే లక్ష్మీనారాయణ యోగం. ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. దీని ప్రభావం అన్ని రాశులపైనా ఉంటుంది.



శుక్రుడు -బుధుడు కలయికతో లక్ష్మీణారాయణ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల కొన్ని రాశుల వారికి అన్నీ అనుకూల ఫలితాలే ఉన్నాయి.



కన్యా రాశి
లక్ష్మీ నారాయణ యోగం వల్ల కన్యా రాశి వారికి అప్పుల బాధలు తీరుతాయి. నిలిచిపోయిన డబ్బు కూడా తిరిగి వస్తుంది. వ్యాపార రంగానికి సంబంధించిన వ్యక్తులు లాభపడతారు. ఉద్యోగస్తులు ఆర్థికంగా మరో మెట్టెక్కుతారు. గౌరవం కూడా పెరుగుతుంది. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.



ధనుస్సు రాశి
లక్ష్మీ-నారాయణ యోగం ధనుస్సు రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఓ శుభవార్త వింటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. రానిబాకీలు వసూలవుతాయి, పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు శుభసమయం



మకరరాశి
లక్ష్మీ-నారాయణ యోగం మకరరాశివారికి అనుకూల ఫలితాలనిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం అవకాశాలున్నాయి. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వినే అవకాశం ఉంది. వ్యాపారం పుంజుకుంటుంది. కుటుంబంలో పూర్తిస్థాయిలో సహకారం ఉంటుంది.



జ్యోతిషశాస్త్రంలో బుధుడు తెలివితేటలు, వాణిజ్యానికి శుక్రుడు విలాసవంతమైన జీవితానికి కారకంగా పరిగణిస్తారు.
ఈ యోగం ఏర్పడినప్పుడు ఒక వ్యక్తి తన తెలివితేటలు, ప్రతిభతో జీవితంలో అన్ని రకాల ఆనందాలను పొందుతాడు.



వారి జీవితంలో డబ్బుకు లోటుండదు. ఆదాయవనరులు పెరుగుతాయి.
బుధుడు, శుక్రుడు ఏర్పడిన ఈ యోగం వల్ల మనిషి జీవితాన్ని సంపూర్ణంగా ఆనందిస్తాడు.



నోట్: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు