ABP Desam


నవంబరు 10 రాశిఫలాలు


ABP Desam


మేష రాశి
క్లిష్టపరిస్థితులను మీరు సమర్ధవంతంగా ఎదుర్కోగలుగుతారు..సమస్యలు పరిష్కరించగలరు. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఆదాయం బాగానే ఉంటుంది కానీ కొన్ని అనవసర ఖర్చులు ఉండొచ్చు. ఇంట్లో శాంతి, సామరస్య వాతావరణం నెలకొనే అవకాశం ఉంది.


ABP Desam


వృషభ రాశి
ఈ రోజు ఈ రాశివారు తలపెట్టిన పనులు నెమ్మదిగా కదులుతాయి. ఆర్థిక లావాదేవీలు బాగా సాగుతాయి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో-సహోద్యోగులతో పరస్పర అవగాహన మీ ఉన్నతికి తోడ్పడుతుంది. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచి సమయం.


ABP Desam


మిథున రాశి
మీ జీవితంలో ముందుకు అడుగేసే ఉత్తమమైన విషయాలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఎవ్వరికీ అప్పులు ఇవ్వొద్దు... ఒకవేళ ఇచ్చినా వాటిని తిరిగి పొందడం చాలా కష్టమవుతుంది. మీ శక్తి సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నించండి...ఇది మీ ఉన్నతికి తోడ్పడుతుంది.


ABP Desam


కర్కాటక రాశి
కష్టమైన పరిస్థితులను ఎదిరైనప్పటికీ మీ తెలివితేటలతో సమస్యలు పరిష్కరించుకుంటారు. నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి సమయం. ఇంట్లో కొన్ని సమస్యలు పరిష్కరించుకునేందుకు ప్రయత్నించండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.


ABP Desam


సింహ రాశి
ఈ రోజు మీ జీవితంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి. ఆస్తి కొనుగోలుకి లేదా అమ్మకానికి ఈ రోజు చాలా మంది రోజు. కుటుంబ సభ్యులు,స్నేహితులతో సంతోష సమయం గడుపుతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.


ABP Desam


కన్యా రాశి
ఒక నిర్దిష్ట పని పట్ల మీ ప్రణాళిక జాగ్రత్తగా ఉండాలి. మీలో తార్కిక పద్ధతి జీవితంలో స్థిరత్వాన్ని తెచ్చే అవకాశం ఉంది. వివిధ రంగాల నుంచి ప్రయోజనం పొందుతారు. ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నించండి. ప్రియమైన వారితో వ్యవహరించేటప్పుడు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి.


ABP Desam


తులా రాశి
మీ యోగ్యతని, మీ లోపాలను తూకం వేసుకోండి...జీవితంలో ముందుకు సాగడానికి మీకు చాలా సహాయపడుతుంది. ఆర్థికపరంగా సానుకూల ఫలితాలు లభిస్తాయి. ఇంట్లో ఉన్న వివాదాలు సమసిపోయేలా చేసేందుకు ప్రయత్నించండి. రోజంతా సంతోషంగా ఉంటారు.


ABP Desam


వృశ్చిక రాశి
మీరు జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించేవరకూ ఆగిపోవద్దు. సైడ్ బిజినెస్ నుంచి వచ్చే లాభాలతో స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలు ముందుకుసాగుతాయి. కుటుంబంతో కలిసి సంతోష సమయం గడుపుతారు. పిల్లల నుంచి శుభవార్త వింటారు.


ABP Desam


ధనస్సు
మీలో ఉన్న సానుకూల శక్తిని సరైన దిశలోకి మళ్లించాల్సిన సమయం ఇది. మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఇంట్లో ఉన్న కొంత గందరగోళ పరిస్థితిని శాంతింపచేసే అవకాశం ఉంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల గుర్తింపు పొందుతారు. ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వినే అవకాశం ఉంది.


ABP Desam


మకర రాశి
ఈ రోజు కొన్ని పరిస్థితుల పట్ల మీ ఆచరణాత్మక విధానం మీకు అనుకూలంగా పని చేస్తుంది. వాహనం కొనుగోలు చేయడానికి లేదా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. ఉద్యోగ పరంగా సంతృప్తికరంగా ఉంటుంది. ధ్యానం చేయడం వల్ల మానసికంగా దృఢంగా ఉంటారు.


ABP Desam


కుంభ రాశి
ఈ రోజు మీరు వినూత్న ఆలోచనలను స్వీకరిస్తారు..ఇది దీర్ఘకాలంలో మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రణాళిక ప్రకారం డబ్బు ఖర్చుచేయకుంటే చాలా నష్టపోతారు. గృహ వాతావరణంలో శాంతి స్థితిని తీసుకొచ్చేందుకు నేర్పుగా వ్యవహరించండి. ఉద్యోగులు ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు.


ABP Desam


మీన రాశి
మీపై మీకున్న నమ్మకాన్ని బలంగా నమ్మాల్సిన రోజు . వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. నిపుణుల సహాయంతో ఆర్థిక వ్యవహారాలు సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. కుటుంబ సభ్యులతో ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఉద్యోగులు ఉన్నతాధికారులనుంచి గుర్తింపు పొందుతారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి