అన్వేషించండి

Karthika Deepam November 15th Update: దీప-కార్తీక్ ను సౌందర్య చూస్తుందా,ఇప్పుడు మోనిత పరిస్థితేంటి!

కార్తీకదీపం నవంబరు 15 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

Karthika Deepam November 15th  Episode 1510 (కార్తీకదీపం నవంబరు 15 ఎపిసోడ్)

కార్తీక్ ప్రవర్తనపై మోనిత డౌట్ పడుతుంది. నన్ను కాకుండా వంటలక్కనే భార్యగా చూస్తున్నాడు..గతం గుర్తొచ్చిందా ఏం జరుగుతోంది అనుకుంటుంది. ఇంతలో కార్తీక్ కి కాల్ వస్తుంది.. సాయంత్రానికి అన్నీ రెడీ చేసుకోండి వస్తున్నా అంటాడు. ఆ మాటలు విన్న మోనిత...కార్తీక్ కి గతం గుర్తొచ్చిందా, ఎవరితో మాట్లాడుతున్నాడు ఏదో జరుగుతోంది..నేను పాత మోనిత అవతారం ఎత్తాలని అనుకుంటుంది..
కార్తీక్: ఆనంద్ ఎక్కడున్నాడు..
మోనిత: నిన్నటి నుంచి లేకపోతే ఇప్పుడు అడుగుతున్నావ్
కార్తీక్: నిన్న కార్తీక్ పౌర్ణమి కదా అందుకే శివలత ఇంటికి పంపించావు అనుకుంటున్నాను
మోనిత: నువ్వు బాబుని పట్టించుకోవడం మానేసి..వంటలక్క చుట్టూ తిరుగుతున్నావ్..అందుకే వాడిని నా ఫ్రెండ్ దగ్గరకు వేరే దేశం పంపించేశాను..మళ్లీ మనమధ్య ఎవ్వరూ లేనప్పుడు వాడిని మళ్లీ తీసుకొస్తాను అనేసి వెళ్లిపోతుంది
కార్తీక్: మోనితకు విదేశాల్లో ఫ్రెండ్స్ ఎవరున్నారు..నాకు గతం గుర్తొచ్చిందని అనుమానం వచ్చిందా అనుకుంటాడు

Also Read: తగలబెట్టుకుంటానన్న మోనిత, పట్టించుకోని కార్తీక్- ఉగ్రరూపం దాల్చిన దీప
మరోవైపు వంటలక్క కాఫీ తీసుకొచ్చి దుర్గకు ఇస్తుంది..ఇద్దరూ కార్తీక్ గురించి మాట్లాడుకుంటారు. గతంలో మోనిత ఏం చెప్పినా వినేవాడు కానీ..ఇప్పుడు మోనిత తాట తీస్తున్నాడు అంటాడు దుర్గ. డాక్టర్ బాబుకి గతం గుర్తొచ్చిందని నాకు అనిపిస్తోంది..నేనే ఆయన భార్యని అని తెలిసింది అనిపిస్తోంది. 
దుర్గ: అదే నిజమైతే మోనితను లాగిపెట్టి కొట్టి నిన్ను తీసుకెళ్లిపోయేవారు కదా
దీప: నాలాగే తనుకూడా ఏదైనా కారణంతో ఆగిపోతున్నారంటావా
దుర్గ: కార్తీక్ సార్ కి నిజం తెలిసిన రోజే మోనిత అంతం అయిపోయినట్టే
దీప: నాపై అభిమానంత మాత్రమే ఇలా చేస్తున్నారా
దుర్గ: మోనితపై కోపంతో కూడా... మొదట్నుంచీ మోనితతో అంత బాగా లేరు..నేను వచ్చాక తనపై ఉన్న మంచి అభిప్రాయం పోయింది..అందుకే తనని కాకుండా నిన్ను పట్టించుకున్నారు. కార్తీక్ సార్ కి గతం గుర్తొచ్చిందేమో అని మనం ఆగిపోవడానికి లేదు మోనితపై దాడి ఇలాగే కొనసాగించాలి..

Also Read: చిక్కుల్లో పడ్డ దేవయాని- తండ్రికి దగ్గరగా రిషి, వాళ్ళని చూస్తాడా?

ఆనంద్ తో హిమ ఆడుకుంటూ ఉంటుంది..ఇంతలో సౌందర్య వస్తుంది... ఆనంద్ ని చూసి సౌందర్య గతంలో జరిగినదంతా గుర్తుచేసుకుంటుంది. 
సౌందర్య: మీరు వెళ్లగానే బాబుని ఇచ్చేసిందని ఇలాగే ఉంచుతుందని అనుకోవద్దు..ఎప్పుడైనా ఇంటిపై పడి తీసుకెళ్లిపోతుంది. అవసరం కోసం అవకాశం కోసం ఏమైనా చేస్తుంది
ఆనందరావు: అయినా వాడిని ఇక్కడ ఉంచేందుకు తీసుకురాలేదు..నువ్వు బుద్ధిగా చదువుకుంటావని తీసుకొచ్చాను. అయినా  ప్రయాణం చేసి వచ్చావు కదా నువ్వెళ్లి ఫ్రెష్ అవు తర్వాత మాట్లాడుకుందాం...

ఆ మోనితను క్షమించేది లేదు దుర్గా..మొన్న వాల్తేరు వాణితోనన్ను చంపించాలి అనుకుంది..రాత్రి గుడి అని చూడకుండా చంపేయాలి అనుకుంది..దాన్ని వదలను అని దీప మాట్లాడుతుండగా అక్కడకు వస్తాడు కార్తీక్... 
కార్తీక్: వాల్తేరు వాణి మోనితపై కోపంతో వచ్చిందికదా నీ ప్రాణాలు తీయడం ఏంటి
దీప: నేను కూడా అలాగే అనుకున్నాను డాక్టర్ బాబు..కానీ దుర్గ దాని బండారం బయటపెట్టాడు. దుర్గ ముందే పసిగట్టి పెట్రోల్ బదులు నీళ్లు నింపాడు..లేదంటే కాలి బూడిదైపోయేదాన్ని..నా మనిషిలా నా దగ్గరకు పంపించి అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసింది..
కార్తీక్: ఈ విషయం ఇంతవరకూ చెప్పలేదు
దీప: ఎన్నని చెబుతాను.. ఓసారి మీరు కాపాడారు, దుర్గ మరోసారి కాపాడాడు..ఇంకా ఎన్నాళ్లు.. కాలం మారుతోంది కానీ నా తలతార మారడం లేదు.. నా భర్తమీరే అనుకుంటున్నానని తెలుసు కానీ మీరు ఒప్పుకోరు.. అన్నింటిలో తోడుగా ఉంటారు  కానీ..మీరే ఒప్పుకోరు.. అంతా నా కర్మ అని ఏడుస్తుంది
కార్తీక్: ఇప్పటికే నీకు ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నాను..ఇప్పుడు నాకు గతం గుర్తొచ్చిందన్న నిజం తెలిస్తే పరిస్థితి మరోలా ఉంటుందని బాధపడతాడు..
కార్తీక్ వెళ్లిన తర్వాత దీప ఏడుస్తూకూర్చుండి పోతుంది

మరోవైపు ఆనందరావు...మోనితఇంట్లో జరిగినదంతా సౌందర్యకు చెబుతాడు.తన దగ్గర మన కార్తీక్ ఉండి కార్తీక్ ను తీసుకువచ్చేందుకు వెళితే ఎంత టెన్షన్ పడాలో అంతే పడింది..పోనీ ఆనంద్ కోసం అనుకుంటే ఇవ్వనని చెప్పేది లేదంటే ఇప్పటికే వచ్చి ఉండేది..
మోనిత: నాకు మొదట్నుంచీ తనపై అనుమానంగా ఉంది..కానీ మీరే ఏమీ అనలేదు. ఆనంద్ ని తీసుకొచ్చేస్తే మళ్లీ అక్కడకు వెళ్లం అనే పంపించింది..నేను రేపే అక్కడకు వెళ్లి మోనిత సంగతేంటో చూస్తాను
ఆనందరావు: శౌర్యని తీసుకొస్తుంటే దారి మధ్యలో కారు ఆపి మరీ తీసుకెళ్లిపోయారు..వాళ్లు పూర్తిగా శౌర్య మనసు మార్చేశారు
సౌందర్య: ముందు మోనిత సంగతి తేల్చి..ఆ తర్వాత శౌర్యని తీసుకొస్తాను

అటు వాల్తేరు వాణి సంగతి మోనితని క్వశ్చన్ చేస్తాడు కార్తీక్. నేరుగా పంపిస్తే నీపై అనుమానం వస్తుందని అలా చేశావ్
మోనిత: సాయానికి సహచర్యానికి తేడా తెలియని పిచ్చిదాన్ని కాదు..మిమ్మల్ని చూసిన వారందరకీ అనుమానం అదే. దీపాలతో నన్ను తగలబెట్టడానికి వస్తే నువ్వు కదలకుండా కూర్చున్నావ్... అంటే నేను ఏమైపోయినా పర్వాలేదా..నాకన్నా నీకు దీపే ముఖ్యమా..ఎందుకు నీలో ఇంత తేడా కనిపిస్తోంది
కార్తీక్: మోనితకు అనుమానం వచ్చిందా...కానీ రాకుండా కవర్ చేయాలి అనుకుంటాడు
మోనిత:దీప నన్నేం చేసినా స్పందించినా నువ్వు..నేను దీపని ఏదో చేసినట్టు ఎందుకు తట్టుకోలేకపోతున్నావ్
కార్తీక్: నువ్వు నా భార్యవి కాబట్టి..నేను అందరిలాంటి భర్తని కాదు..నా భార్య ఏ తప్పు చేయకూడదు, నా భార్యవైపు ఎవ్వరూ వేలెత్తి చూపించకూడదు...అందుకే అంత కఠినంగా ఉంటున్నాను
మోనిత: ఏంటి కవర్ చేసుకుంటున్నాడు
కార్తీక్: నమ్మిందా...
మోనిత: నేను పోయినా పర్వాలేదా..తగలబెట్టుకుంటాను అన్నా స్పందించలేదు
కార్తీక్: నన్ను బెదిరించడానికే అంటున్నావని తెలుసు..ఆపడానికి ప్రయత్నిస్తే సీన్ చేస్తావని ఆపలేదు. ఇంతకీ నిజంగా నువ్వు నా భార్యవేనా..గతం మర్చిపోయిన నన్ను తీసుకొచ్చి నన్ను నమ్మించావా...
మోనిత: నీకు ఆ అనుమానం ఎందుకొచ్చింది
కార్తీక్: వంటలక్క నా భార్య కాబట్టి తన అడ్డుతొలగించి నీసొంతం చేసుకోవాలి అనుకుంటున్నావా...
మోనిత: వంటలక్క నీ భార్య కాదు..

రేపటి(బుధవారం) ఎపిసోడ్ లో
సౌందర్యని చూసి మోనిత కంగారు పడుతుంది.. ఇంటికి వెళదాం పదా అంటుంది సౌందర్య..ఎలాగైనా తప్పించుకోవాలి మోనిత...అస్సలు వదలకూడదని సౌందర్య అనుకుంటారు... మరోవైపు ఇంట్లో దీప-కార్తీక్...మోనిత కోసం ఎదురుచూస్తుంటారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
Bandi Sanjay: ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస

వీడియోలు

BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్
Yashasvi Jaiswal about Rohit Sharma | జైస్వాల్‌ డెబ్యూపై రోహిత్ మాస్టర్ ప్లాన్
అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్‌లో ఉత్కంఠ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
Bandi Sanjay: ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
Peddi Movie : రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
The Raja Saab Release Trailer : ప్రభాస్ 'ది రాజా సాబ్' రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది - టైం స్టార్ట్ అయ్యింది డార్లింగ్స్
ప్రభాస్ 'ది రాజా సాబ్' రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది - టైం స్టార్ట్ అయ్యింది డార్లింగ్స్
JEE Advanced 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల! మీరు ఎప్పుడు రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోండి!
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల! మీరు ఎప్పుడు రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోండి!
Padi Kaushik Reddy: తెలంగాణ అసెంబ్లీలో బాంబు ప్రకంపనలు - ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్
తెలంగాణ అసెంబ్లీలో బాంబు ప్రకంపనలు - ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్
Embed widget