News
News
X

Karthika Deepam January 20th Update: అసలు విషయం చెప్పిన వారణాసి , మోనిత చాప్టర్ క్లోజ్ - రాక్షస సంహారంతో 'కార్తీకదీపం' శుభం

కార్తీకదీపం జనవరి 20 ఎపిసోడ్: బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్న కార్తీక్ దీపం సీరియల్ కి త్వరలో శుభం కార్డు పడనుంది... ఈ రోజు ఏం జరిగిందంటే...

FOLLOW US: 
Share:

కార్తీకదీపం జనవరి 20 శుక్రవారం ఎపిసోడ్ (Karthika Deepam January 20th Update)

మోనితని తీసుకొచ్చి నడిరోడ్డుపై నిల్చోబెడుతుంది దీప...ఎప్పటిలానే ఇద్దరూ వాదించుకుంటారు
మోనిత: ఇప్పుడు నువ్వు ఏదో చేస్తావని నేను భయపడను. అయినా పోయేదానివీ పోకుండా నీకెందుకు ఈ తాపత్రయం 
దీప: నేను పోతానే కానీ నీలాంటి రాక్షసుల నీడ నా భర్త మీద పడకూడదు 
మోనిత: రాక్షసురాలిని కాదు దీప ప్రేమికురాలిని, నా గురించి ఎందుకు అలా ఆలోచిస్తున్నావు. ఇన్ని రోజుల నుంచి పిచ్చిగా ప్రేమిస్తోంది నేను పోయేటప్పుడు నా భర్తను దీనికి అప్పగించాలి అని నీకు ఆలోచన రావడం లేదా 
దీప: అలాంటి ఆలోచన తీసెయ్
మోనిత: నువ్వు ఉన్నప్పుడే ఏం చేయలేకపోయావు పోయేటప్పుడు ఏం చేస్తావు. పోయేలోపు నువ్వు డాక్టర్ బాబు వైపు చూడకుండా చేసి పోతాను 
దీప: అంటే నీ మొగుడికి ఇంకొక పెళ్లి చేస్తావా, ప్రేమగా తాళి కట్టిన నీతోనే మూడు రోజులు కూడా కాపురం చేయకుండా చేశాను. ఇంకొక దాన్ని తెచ్చి చేస్తే నేను ఊరుకుంటాను అనుకున్నావా.
దీప: ఈరోజు నడిరోడ్లో కళ్ళు తెరిచావు ఈసారి పిచ్చిపిచ్చి ప్రయత్నాలు చేస్తే నరకంలో కళ్ళు తెరుస్తావు అని వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది దీప.

Alos Read: వసుకి కానుకగా పూలు ఇచ్చిన రిషి, మొహం మీదే తలుపేసి వెళ్లగొట్టిన జగతి!
 
ఇంటికెళ్లిన మోనిత ఇంట్లోకి వెళ్లి వస్తువులన్నీ విసిరేస్తూ కోపంతో రగిలిపోతుంది...నిన్ను చంపేస్తానంటూ అరుస్తూఉంటుంది.  మరోవైపు సౌందర్య దీపని కాపాడుకునే అవకాశం లేదా ఇప్పుడు కూడా దీప అదే ధైర్యంతో ఉంది అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి భాగ్యం వచ్చి వదినగారు బాగున్నారా అని పలకరిస్తూ ఉంటుంది. అప్పుడు సౌందర్య మాట్లాడడానికి గ్యాప్ ఇవ్వకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది భాగ్యం. ఇంతలోనే దీప వారణాసి అక్కడికి రావడంతో భాగ్యం దీపను ప్రేమగా పలకరిస్తూ ఉంటుంది. అయినా నువ్వు లిస్టు తీసుకోమంటే ఎక్కడికి వెళ్లావు దీప అని సౌందర్య అడగితే ఆ మోనిత దగ్గరికి వెళ్లాను నా జోలికి నా కుటుంబం జోలికి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పి వచ్చానంటుంది. ఇంతలోనే అక్కడికి శౌర్య...హిమను వెతుక్కుంటూ వస్తుంది. 
భాగ్యం: హిమ లేదు శౌర్య బయటకు వెళ్ళింది
సౌందర్య: నీకెలా తెలుసు 
భాగ్యం: నేను వస్తున్నప్పుడు గేటు దగ్గర నా మొబైల్ తీసుకుని ఎవరికో ఫోన్ చేసి అడ్రస్ చెప్పు అని అక్కడికి వెళ్ళిపోయింది 
అప్పుడు దీప సౌందర్య ఫోన్ తో ఆ నెంబర్ కి ఫోన్ చేయడంతో అది మోనిత నెంబర్ అవడంతో అంతా షాక్ అవుతారు.. మోనిత ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో టెన్షన్ పడతారు.
ఆ తర్వాత కార్తీక్, దీప, సౌందర్య ముగ్గురూ హిమా కోసం వెళితే..అక్కడ టూలెట్ బోర్డు వేలాడుతుంది. 
దీప: పొద్దున నేను దాన్ని మంచంతో పాటు నడి రోడ్డులో పడుకో పెట్టాను డాక్టర్ బాబు ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేసి ఎలా వెళ్ళిపోతుంది అనుకుంటూ ఉంటుంది .
కార్తీక్ : ఫోన్ చేసినా స్విచాఫ్ రావడంతో టెన్షన్ పడతాడు...ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఆ మోనిత చెప్పినట్టు చేయను అంటాడు
లోపలే ఉన్న మోనిత చూసావా హిమా మీ నాన్న ఎలా చెబుతున్నాడో నేను చెప్పినది చేయను అంటున్నారు అంటుంది. అప్పుడు లోపలే ఉండి హిమను రెచ్చగొడుతూ ఉంటుంది. బయట దీప  ఎలా అయినా నా కూతురు నా దగ్గర రావాలి అని కార్తీక్ మీద ఫైర్ అవుతూ ఉండగా నువ్వు టెన్షన్ పడకు దీప దాన్ని ఎక్కడ ఉన్నా జుట్టు పట్టుకుని లాక్కొని వస్తాను అని అంటుంది సౌందర్య. దాని సంగతి చూస్తాను ఫస్ట్ వెళ్దాం పదండి అని అక్కడ నుంచి వెళ్లిపోతారు. ఇదంతా హిమ,మోనిత లోపలి నుంచి చూస్తూ ఉంటారు. 
మోనిత: చూశావు కదా హిమ నామీద ఎంత కోపంగా ఉన్నారో పైగా నేను నిన్ను తీసుకొచ్చాను అని అంటున్నారు
హిమ:  ఇప్పుడు మనం ఏం చేద్దాం ఆంటీ 
మోనిత: మనం ఇక్కడే ఇలాగే ఉండి ఇక్కడి నుంచి మీ డాడీని ఒప్పించేలా చేద్దాం.. అందుకోసం నేను చెప్పినట్టు నువ్వు చేయాలి
హిమ: పిచ్చిదానిలా మోనిత మాటలు నమ్ముతుంది
మరోవైపు సౌందర్య మోనిత మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వమని చెబుతుంది. అప్పుడు దీప మోనిత మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలోనే మోనిత సౌందర్య కి ఫోన్ చేయడంతో మర్యాదగా అడుగుతున్నాను నా కూతురు హిమ ఎక్కడ ఉంది అని అడగగా నా చేతిలోనే హాయిగా సేఫ్ గా ఉంది అంటుంది మోనిత నువ్వు నా ప్రపోజల్ కీ ఒప్పుకునేంతవరకు హిమను వదిలిపెట్టను అని అంటుంది. నేను చచ్చేలోపు నేను నాతో పాటు తీసుకెళ్తాను అనడంతో హిమ నా దగ్గర ఉంది జాగ్రత్తగా మాట్లాడు అంటుంది మోనిత.  సౌందర్య, భాగ్యం కోపంతో రగిలిపోతూ ఉంటారు. 
మరొకవైపు మోనిత హిమ కోసం భోజనం తీసుకెళితే వద్దు ఆంటీ నాకు భయంగా ఉందంటుంది.  ఏం కాదు హిమ ధైర్యంగా ఉండు మీ అమ్మ బతకడం కోసమే కదా మనం ఇదంతా చేస్తోంది అంటుంది 
హిమ: మా అమ్మకు చెప్పకుండా వచ్చాను నాకోసం ఎంత టెన్షన్ పడుతుందో ఆంటీ
మోనిత: హిమ నువ్వు వెళ్ళిపోతావేమో వెళ్ళిపో మీ అమ్మ ప్రాణాలతో ఉండదని హిమను బ్లాక్ మెయిల్ చేస్తుంది

Also Read:

  మోనితను రోడ్డుకీడ్చిన దీప - కార్తీక్, సౌందర్యని టార్గెట్ చేసిన హిమ!

సౌందర్య,దీప,కార్తీక్ ముగ్గురు మోనిత గురించి ఆలోచిస్తూ మోనిత మీద కోపంతో రగిలిపోతూ ఉంటారు. టెన్షన్ పడకు దీప అది హిమను ఏం చేయదు అని అంటాడు కార్తీక్. ఇంతలోనే సౌర్య అక్కడికి వచ్చి ఏంటి నాన్న మళ్ళీ ఆ హిమ ఇలాంటి పని చేస్తుందా అప్పుడు వద్దంటే కార్ డ్రైవింగ్ చేసింది ఇప్పుడు మళ్లీ మిమ్మల్ని ఇలా చేస్తోంది అందుకే నాకు అదంటే అసహ్యం అని అంటుంది. ఇది పెద్దల విషయం అని దీప అనడంతో చేసింది చిన్న పిల్ల కదా అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది సౌర్య. ఇంతలోనే వారణాసి దీపకీ ఫోన్ చేసి మీ అనుమానం నిజమే దీపక్క మోనిత ఇంట్లోనే ఉంది అని అంటాడు.

Published at : 20 Jan 2023 08:55 AM (IST) Tags: Karthika Deepam Serial karthika Deepam Serial Today Episode Karthika Deepam Serial Written Update Karthika Deepam Episode Karthika Deepam Serial January 20th Episode

సంబంధిత కథనాలు

K Viswanath Songs: పాటంటే కేవలం పాట కాదు, అందులోనూ కథ చెప్పడం విశ్వనాథ్ స్టైల్ - అందుకే అవి క్లాసిక్స్‌

K Viswanath Songs: పాటంటే కేవలం పాట కాదు, అందులోనూ కథ చెప్పడం విశ్వనాథ్ స్టైల్ - అందుకే అవి క్లాసిక్స్‌

Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?

Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?

Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్

Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్

‘ఫరాజ్’ సినిమాకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ - స్టే నిరాకరణ, వివాదం ఏమిటీ?

‘ఫరాజ్’ సినిమాకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ - స్టే నిరాకరణ, వివాదం ఏమిటీ?

K Viswanath Oscars : ఆస్కార్ బరిలో నిలిచిన తొలి తెలుగు దర్శకుడు విశ్వనాథ్

K Viswanath Oscars : ఆస్కార్ బరిలో నిలిచిన తొలి తెలుగు దర్శకుడు విశ్వనాథ్

టాప్ స్టోరీస్

Lokesh Padayatra Tension : లోకేశ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత, బహిరంగ సభకు అనుమతి లేదని ప్రచార వాహనం సీజ్

Lokesh Padayatra Tension : లోకేశ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత, బహిరంగ సభకు అనుమతి లేదని ప్రచార వాహనం సీజ్

నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Hindenburg Research: కుబేరుడు అదానీ ఆస్తులను ఊదేస్తున్న ఈ మొండిఘటం ఎవరు !

Hindenburg Research: కుబేరుడు అదానీ ఆస్తులను ఊదేస్తున్న ఈ మొండిఘటం ఎవరు !

YS Sharmila : మళ్లీ కేసీఆర్ ను నమ్మితే రాష్ట్రాన్ని అమ్మేస్తారు, రైతు బంధు తప్ప అన్ని సబ్సిడీలు బంద్- వైఎస్ షర్మిల

YS Sharmila : మళ్లీ కేసీఆర్ ను నమ్మితే రాష్ట్రాన్ని అమ్మేస్తారు, రైతు బంధు తప్ప అన్ని సబ్సిడీలు బంద్- వైఎస్ షర్మిల