Karthika Deepam January 19th Update: మోనితను రోడ్డుకీడ్చిన దీప - కార్తీక్, సౌందర్యని టార్గెట్ చేసిన హిమ!
కార్తీకదీపం జనవరి 19 ఎపిసోడ్: బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్న కార్తీక్ దీపం సీరియల్ కి త్వరలో శుభం కార్డు పడనుంది... ఈ రోజు ఏం జరిగిందంటే...
కార్తీకదీపం జనవరి 19 గురువారం ఎపిసోడ్ (Karthika Deepam January 19th Update)
మోనితను కలిసిన తర్వాత ఆటోలో తిరిగి ఇంటికి వెళుతుంటుంది హిమ
హిమ: మోనిత ఆంటీ చెప్పినట్టు డాడీ ఎందుకు చేయడం లేదు. అమ్మని బ్రతికించడం ఇష్టం లేదా, లేక అమ్మంటేనే ఇష్టం లేదా అంటే డాడీ ఇంకా మారలేదా. ఎలా అయినా డాడీ ని ఒప్పించాలి అనుకుంటూ గుడి దగ్గర కార్తీక్ వాళ్ళ కారు చూసి ఆటో దిగి లోపలికి వెళ్తుంది.
కార్తీక్ ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే దీప అక్కడికి వస్తుంది. పూజారికి చెప్పావా దీప అంటే చెప్పాను డాక్టర్ బాబు దేవుడే కరుణించనప్పుడు పూజారి మాత్రం ఏం చేస్తాడు అంటుంది. అలా మాట్లాడకు ఆఖరి క్షణం వరకు ఆశలు పెట్టుకోవాలని సర్దిచెబుతాడు కార్తీక్. ఇంతలో దీపకు గుండెనొప్పి అనిపిస్తుంది.. శౌర్య ముడుపుకట్టడానికి వెళ్లింది తీసుకొస్తాను ఇంటికెళ్లిపోదాం అంటాడు కార్తీక్. ఇంతలో హిమ అక్కడకు వస్తుంది..దీప కళ్లుతిరిగి పడిపోతుంది. దీప టాబ్లెట్స్ వేసుకుంటుంది. అది చూసి సౌర్య వాళ్ళు టెన్షన్ పడుతు నాన్న అమ్మకి ఏమైంది ఎందుకు ఇలా పడిపోయింది అని అడిగితే ఏం కాలేదమ్మా అని చెబుతాడు కార్తీక్. శౌర్యని-దీపన కారు దగ్గరకు పంపించి..హిమ..కార్తీక్ ని పక్కకు తీసుకెళుతుంది.
హిమ: నేను చెప్పినట్టు చేస్తానని నాకు ఒట్టు వేయండి డాడీ
కార్తీక్: దేని గురించి
హిమ: అమ్మ ప్రాణాలు కాపాడడం గురించి. నాకు మోనిత ఆంటీ మొత్తం చెప్పింది అమ్మ ఎక్కువ రోజులు బ్రతకడంట కదా డాడీ
కార్తీక్: రాక్షసి అమ్మకు చెప్పింది చాలక మళ్ళీ పిల్లలకు కూడా చెప్పింది అనుకుంటూ.. ఆ మోనిత మాటలు నమ్మొద్దు అనడంతో లేదు డాడీ డాక్టర్ తో కావాలంటే చెప్పిస్తానని చెప్పింది అని ఏడుస్తూ మాట్లాడుతుంది. మీకు అసలు అమ్మ అంటే ఇష్టం లేదు అమ్మని బతికించుకోవడం నీకు ఇష్టం లేదు
కార్తీక్: షాక్ అవుతాడు...ఆ మోనిత మాటలు నమ్మొద్దు
హిమ: అయితే మోనిత ఆంటీ చెప్పినట్టు చేస్తానని నాకు మాట ఇవ్వండి
కార్తీక్: ఏం చెప్పింది అనడంతో మీకేదో చెప్పింది కదా డాడీ అది చేస్తానని నాకు మాట ఇవ్వండి అంటుంది హిమ. అప్పుడు కార్తీక్ ఎంత చెప్పినా వినిపించుకోకుండా హిమ మోనిత చెప్పినట్టు చేస్తాను నాకు ఇవ్వండి డాడీ మాట ఇస్తే ఏమవుతుందని అడుగుతంది.
Also Read: అత్తారింట్లో అడుగుపెట్టిన వసుధారకి ఘోర అవమానం, రిషి సపోర్ట్ గా నిలుస్తాడా!
మరోవైపు దీప నాకు టైం దగ్గర పడుతున్నట్టుంది.. ఎలా అయినా డాక్టర్ బాబుని ఒప్పించాలి అనుకుంటూ ఉండగా ఇంతలో సౌందర్య అక్కడికి వస్తుంది. మామయ్య గారికి ఎలా ఉందని అడిగితే బావుంది..వారం రోజుల్లో డిశ్సార్జ్ చేస్తామన్నారంటుంది సౌందర్య. అంటే వారం రోజులు ఉంటానో ఉండనో మిమ్మల్ని అందరిని బాగా చూసుకుంటాను అంటుంది దీప. ఆ మాట విన్న శౌర్య.. నాలుగు రోజులేనా మళ్లీ ఎక్కడికి వెళ్తావని అడుగుతుంది. ఎక్కడికీ వెళ్ళను మనం వెళ్లి వంట చేద్దాం పద అని దీప సౌర్యని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది.
సౌందర్య-హిమ
సౌందర్య దగ్గరికి హిమ ఏడ్చుకుంటూ వస్తుంది. మోనిత చెప్పిన విషయం మొత్తం చెబుతుంది. మోనిత ఆంటీ చెప్పినట్టు చేయమని అడుగుతుంది. దాని మాటలు పట్టించుకోవద్దనడంతో అంటే నీకు కూడా మమ్మీ బతకడం ఇష్టం లేదా అని అంటుంది హిమ. ఏమైంది నీకు మీ నాన్న ఎక్కడ అని కార్తీక్ ని వెతుక్కుంటూ వెళ్తుంది.
మోనిత
సౌందర్య వాళ్ళ నుంచి ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉండగా ఈ ప్లాన్ సక్సెస్ అయ్యేలా లేదు ఇంకొక ప్లాన్ ఆలోచించాలి అనుకుంటుంది. ఇక లాభం లేదు ఆఖరి హస్తం బ్రహ్మాస్త్రం సంధిస్తాను. ఇప్పుడు ఎలా ఒప్పుకోవో నేను చూస్తాను అని అనుకుంటూ ఉంటుంది మోనిత.
Also Read: కార్తీక్ పై హిమను ప్రయోగించిన మోనిత, దీపకు భరోసా ఇచ్చిన పూజారి!
కార్తీక్ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో సౌందర్య అక్కడికి వెళ్లి హిమ అన్న మాటలు గురించి చెబుతుంది. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు మమ్మీ అని కార్తీక్ అంటాడు. ఇంతలోనే దీప అక్కడికి వచ్చి ఏంటి డాక్టర్ బాబు హిమకి ఏమైంది అంటే ఏమి లేదు అనడంతో నాకు మొత్తం తెలిసింది డాక్టర్ బాబు అన్న దీప..దాని అంతు తేలుస్తానని బయలుదేరుతుంది.
మోనిత నిద్ర లేచి చూసేదానికి నడి రోడ్డుపై తన మంచం ఉండడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది. నా మంచం ఎవరు రోడ్డుపై వేశారు అనడంతో నేనే నీ బతుకుని రోడ్డున పడేద్దామని వచ్చాను అంటుంది దీప.
దీప: ఎప్పుడెప్పుడు నా ప్రాణాలు పోతాయని ఎదురు చూసేదానికి నువ్వు నాకు గుండెని ఇస్తావా ఎక్కువ మాట్లాడావంటే ఇక్కడే పాతేస్తాను అంటుంది దీప. పిచ్చి పిచ్చి ప్లాన్లు వేసావంటే చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తుంది. డాక్టర్ బాబు నీ మెడలో తాళి కడితే నువ్వు నాకు గుండె ఇస్తావా అనగా ఎంత స్వార్థం బుద్ధి అనడంతో ఇందులో తప్పేముంది
వారణాసి: దీన్ని అసలు నమ్మకండి దీపమ్మ డాక్టర్ బాబు మెడలో తాళి కట్టగానే డాక్టర్ బాబును వేధిస్తుంది
అప్పుడు అక్కడున్న వాళ్లంతా చుట్టూ చేరడంతో... ఈ మోనిత గురించి మీకు తెలియదు పెళ్లైన నా మొగుడిని పట్టుకుని వేలాడుతుంది అని అందరి ముందు పరువు తీస్తుంది. ఇద్దరి పిల్లలున్న నా మొగుడిని 12 ఏళ్ల నుంచి వేధిస్తోంది అనగా అప్పుడు అక్కడున్న చుట్టూ ఉన్నవారంతా మోనితను మాటలంటారు.
మోనిత: నడిరోడ్డుపై నిలబెట్టి అందరి ముందు అవమానిస్తావా అంతు చూస్తానని బెదిరిస్తుంది. పోయేదానివి పోకుండా నాకు ఎందుకు అడ్డుపడుతున్నావు నేను చస్తే కార్తీక్ భార్య గానే చేస్తాను అంటూ వాగుతూనే ఉంటుంది మోనిత