News
News
X

Guppedanta Manasu January 18th Update: అత్తారింట్లో అడుగుపెట్టిన వసుధారకి ఘోర అవమానం, రిషి సపోర్ట్ గా నిలుస్తాడా!

Guppedantha Manasu January 18th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

FOLLOW US: 
Share:

గుప్పెడంతమనసు జనవరి 18 బుధవారం ఎపిసోడ్ (Guppedanta Manasu January 18th Update)

రిషి ప్లేస్ లో జగతిని చూసిన వసుధార.. పాత ఎండీ గారు ఎక్కడికి వెళ్లారని అడిగుతుంది
జగతి: కనిపించని భవిష్యత్తు కోసం తెలియని దారిలో వెళ్తున్నాడు. అందుకే మాకు కూడా చెప్పలేదు . ఒక్కొక్కసారి పాలలాగే మనసులు కూడా విరిగిపోతాయి. మనసుల్ని విరకొట్టి చాలామంది ఆనందాన్ని పొందుతారు 
వసుధార: మీరు ఏం అంటున్నారో నాకు అర్థమైంది 
జగతి: మళ్ళీ ఎందుకు వచ్చావు 
మహేంద్ర: మాట్లాడరేంటి వసుధార గారు మా అబ్బాయి పరిస్థితి ఎలా ఉందో చూద్దామని వచ్చారా, లేకపోతే బ్రతికున్నాడో లేదో చెక్ చేద్దామని వచ్చారా
వసు:సార్ మీరు నన్ను మేడం గారు మీరు అంటున్నారు ఏంటి
మహేంద్ర: మీరు గొప్పవారయ్యారు...మా వసు అయితే మాకు తెలిసిపోయేది తను మా అందరి గురించి ఆలోచించేది. మీరు కొత్త వసుధారగా అవతారమెత్తారు కదా, మీ ప్రవర్తనాన్ని ఆలోచనలు మాకు అందుబాటు లేదు అందుకే మిమ్మల్ని గౌరవించక తప్పడం లేదు
జగతి: తనతో మాటలేంటి మహేంద్ర, కొందరు పెద్దపెద్ద గోల్స్ పెట్టుకుంటారు అందరితో మంచిగా ఉంటారు చివరికి తాము నడిచి వచ్చిన దారి తాము ప్రేమించిన వారిని మర్చిపోయి కొత్త అడుగులు వేస్తారు. మనం అల్పులం . వాళ్ల ఆలోచనలను అంచనాలను మనం అందుకోలేము, మనం అల్పులం వాళ్లతో మనం పోటీ పడలేం
వసు: సరే మేడం నేను నా క్యాబిన్ కి వెళ్తున్నాను మిషన్ ఎడ్యుకేషన్ హెడ్ గా  చార్జి తీసుకుంటున్నాను 
జగతి: నువ్వు ఇక్కడికి రావడం అవసరమా? సమాధానం చెప్పకుండా ఎన్నాళ్ళు దాటవేస్తావు అంటూ నిలదీస్తుంది 
వసు: కొన్ని సమాధానాలు కొందరికి చెప్తేనే బాగుంటాయి నేను ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్తాను అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది 

Also Read: కార్తీక్ పై హిమను ప్రయోగించిన మోనిత, దీపకు భరోసా ఇచ్చిన పూజారి!

వసుధార తన క్యాబిన్ లో కూర్చుని..రిషి సర్ ఎక్కడికి వెళ్తున్నారనే ఆలోచనలో పడుతుంది. కాల్ చేస్తుంది కానీ రిషి కట్ చేస్తాడు. మీ స్థానంలో ఎవరున్నా కోపం వస్తుంది సార్..కానీ ఏం జరిగిందో మీకు వివరించడానికి వచ్చాను అనుకుంటుంది. కన్నవాళ్ళ మీద ఎంత మమకారం ఉందో కాలేజీ మీద కూడా అంతే మమకారం ఉంది అనుకుంటుంది. రిషికి ఎన్నిసార్లు కాల్ చేసినా కట్  చేస్తాడు..మళ్లీ మళ్లీ రింగ్ అవడంతో..కోపంగా కాల్ లిఫ్ట్ చేసి అరుస్తాడు..అట్నుంచి వసుధార కాదు.. ఫ్లైట్ క్యాన్సిల్ అయిందంటూ సమాచారం వస్తుంది. 

వసు క్యాబిన్ కి వస్తారు జగతి, మహేంద్ర..
వసు: మిషన్ ఎడ్యుకేషన్ గురించి కొన్ని ఐడియాలున్నాయి..
జగతి: నువ్వు ఎందుకు వచ్చావు జరిగినవన్నీ మర్చిపోయి ఎప్పటిలాగా కాలేజీకి వచ్చి మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నావ్. మేము ఎలా కనిపిస్తున్నావు నీకు? అసలు నువ్వు ఏం చేసావో నీకు అర్థం అవుతోందా నువ్వు రిషి ని మోసం చేశావు. అసలు రిషి ఎలా ఉన్నాడో తెలుసా, ఏం మాట్లాడవేంటి 
వసు: అన్నింటికీ సమాధానాలు నేను చెప్పాల్సిన టైం లోనే చెప్తాను. ముందు జరిగిందంతా రిషి సర్ కి చెప్పాలి లేకపోతే ఫీలవుతారు అనుకుంటుంది వసు. బయటికి మాత్రం జరగాల్సిన దాని గురించి అందరం కలిసి మాట్లాడుకుకుందాం అంటుంది 
జగతి: ఆ మాటలకి కోపంతో వసుని కొట్టబోతుంది జగతి. మహేంద్ర వారిస్తాడు. మంచి శిష్యురాలు దొరికింది అనుకున్నాను కానీ ఇంత గొప్ప శిష్యురాలు ఇంత తెలివైన శిష్యురాలు దొరుకుతుందని అనుకోలేదు. నా జన్మ సార్ధకం అయిపోయింది. ఒక గురువుగా కాకుండా కన్న తల్లిగా అడుగుతున్నాను అసలు రిషి ని ఎందుకు మోసం చేయాల్సి వచ్చింది. రిషి గురించి ఆలోచించకుండా నీ స్వార్థం కోసం నీకు నచ్చిన నిర్ణయాలు తీసుకుంటే రిషి గుండె ఆగిపోతుంది అని నీకు తెలియదా
వసు: మీరు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుంది
జగతి: చంపి పాతి పెట్టి దానిమీద గులాబీ మొక్క నాటినట్టు మాట్లాడుతున్నావు. 
మహేంద్ర: చిన్న వాళ్ళకి దండం పెట్టకూడదు కానీ నీకు దండం పెట్టి అడుగుతున్నాను ఏం సాధిద్దామని మళ్లీ కాలేజీకి వచ్చావ్
జగతి: టేబుల్ మీద ఉన్న సారీలు రాసిన పేపర్ ని చూసి ఏంటిది అని అడుగుతుంది జగతి. పశ్చాత్తాపం అని వసు అంటే, చేయాల్సిందే చేసేసి ఈ సారీలు రిషి ని తీసుకురాగలవా, నా కొడుకుని బాధ పెట్టే హక్కు నీకు ఎక్కడిది అంటూ నిలదీస్తుంది. నువ్వు సంతోషంగానే ఉన్నావు కానీ రిషి దూరంగా వెళ్లిపోయాడు
వసు: ఎక్కడికి వెళ్లారు
జగతి: ఎక్కడికి వెళ్తే నీకెందుకు చేయాల్సిన చేసావు కదా. నా కొడుక్కి 20 ఏళ్ల నుంచి దూరంగా ఉన్నాను మళ్ళీ నీవల్ల నా కొడుకు దూరమయ్యాడు. నీకన్నా దేవయాని అక్కయ్య నయం కనీసం రిషి బాగోగులు చూసేది అయినా నీతో మాట్లాడాలంటేనే అసహ్యంగా ఉంది అంటూ కోపంగా వెళ్ళిపోతుంది జగతి.

గురుదక్షిణ ఇస్తానన్నావు కదా మంచి గురుదక్షిణ ఇచ్చావంటూ కోపంగా వెళ్లిపోతుంది. సార్ రిషి సారు ఎక్కడికి వెళ్లారు అని వసు అడిగితే మాకు తెలియదు తెలిసినా చెప్పము తన గురించి అడిగే హక్కు అధికారం నీకు లేవు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు జగతి, మహేంద్ర. 

వసు-పుష్ప: అంతలో అక్కడికి పుష్ప వచ్చి వసుని పలకరిస్తుంది. కంగ్రాట్స్ నీ పెళ్లికి నేను చాలా ప్లాన్స్ వేసుకున్నాను కానీ నీ పెళ్లి అయినందుకు సంతోషంగానే నన్ను పిలవనందుకు బాధగా ఉంది ఇంతకీ మీ వారు ఏం చేస్తుంటారు ఎందుకు ఎవరిని పిలవకుండా పెళ్లి చేసుకున్నావు అంటుంది పుష్ప. సమయం వచ్చినప్పుడు అన్ని చెప్తాను అంటుంది వసు. నీ పెళ్లి గురించి మన కాలేజీలో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారట, మన జూనియర్ చెప్పింది అంటుంది పుష్ప. ఈ తాళి మెడలో వేసుకున్నందుకు అందరికీ సమాధానం చెప్పాలి కానీ ముందుగా రిషి సార్ కే చెప్తాను అనుకుంటుంది వసు. ఇంతకీ నన్ను ఎందుకు రమ్మన్నావని పుష్ప అడిగితే నేను ఉండడానికి ఒక ఇల్లు కావాలి అంటుంది. హాస్టల్లో ఉండొచ్చు కదా అంటే ఇంట్లో వాళ్ళందరూ ఉంటారు కదా వీలు అవ్వదు అంటుంది వసు. నిజమే పెళ్లయింది కదా అత్తింటి వారు అప్పుడప్పుడు పుట్టింటివారు వస్తుంటారు అందుకని పెద్దల్లే ఉండాలి అంటుంది పుష్ప. మిషన్ ఎడ్యుకేషన్ హెడ్ హా గవర్నమెంట్ రూమ్ ఇస్తానంది కానీ చాలా దూరంగా ఉంది అందుకే దగ్గరలో ఏదైనా చూడు అంటుంది వసు. సరే కానీ ఇల్లు దొరికే వరకు మా ఇంట్లోకి రా నీకు సెపరేట్ రూమ్ ఇస్తాను అంటుంది పుష్ప. 

Also Read: భారమైన హృదయంతో కాలేజీ బయటకు రిషి, కోటి ఆశలతో కాలేజీ లోపలకు వసు- వాటే సీన్!

దేవయాని: వసుధార వచ్చిందని తెలుసుకున్న దేవయాని కోపంతో రగిలిపోతుంది.రిషి ఇప్పటికే నలిగిపోయి ఉన్నాడు. మళ్లీ వసు కాలేజీకి వస్తే ఎలా అంటాడు ఫణీంద్ర. తను మిషన్ ఎడ్యుకేషన్ కి హెడ్ ఇప్పుడు అని జగతి అంటే తీసిపారేమంటుంది దేవయాని. అలా చేయటానికి కుదరదు తను మినిస్టర్ గారి తరపున జాయిన్ అయింది అంటాడు మహేంద్ర. రిషి ని ఎటు కాకుండా చేసి మళ్లీ ఎందుకు వచ్చినట్లు ఏం మాట్లాడవేం మహేంద్ర, నేను మొదటినుంచి తన గురించి చెప్తూనే ఉన్నాను కానీ నన్ను నమ్మలేదు. ఎక్కడ నుంచో తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నారు అంటుంది దేవయాని. అలా జరుగుతుందని వాళ్లు మాత్రం ఊహించారా అంటాడు ఫణీంద్ర. అనుకోవాలి తెలివితేటలు అంటే అవే మరి. రేపు జరగబోయే దాన్ని ఊహించి జాగ్రత్తపడాలి. నేనేదో గయ్యాలి దాన్ని అనుకుంటున్నారు కానీ ఇప్పుడు ఏం జరిగిందో చూసారా, రిషి గుండె పగిలిపోయింది. ఏం చెప్పి మనం ఓదారుస్తాం. నా బాధ మీకు ఏం అర్థమవుతుంది అంటూ నిలదీస్తుంది దేవయాని.

అంతలోనే వచ్చిన వసు,రిషి ని పిలుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఏదో అత్తారింటికి వచ్చినట్లు అలా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నీకు సిగ్గుగా అనిపించడం లేదా అని దేవయాని ఫైర్ అవుతుంది. అక్కయ్య మీరు ఆగండి నేను చాలు తనకి బుద్ధి చెప్పడానికి అంటుంది జగతి.  ఎపిసోడ్ ముగిసింది...

Published at : 18 Jan 2023 09:47 AM (IST) Tags: Guppedanta Manasu Serial Guppedanta Manasu Serial Today Episode Guppedanta Manasu Serial Written Update Guppedanta Manasu Serial January 18th Episode

సంబంధిత కథనాలు

Nijam With Simtha : బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్ 2'కు ఎండ్ కార్డు వేసిన రోజే  'నిజం విత్ స్మిత' మొదలు

Nijam With Simtha : బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్ 2'కు ఎండ్ కార్డు వేసిన రోజే 'నిజం విత్ స్మిత' మొదలు

యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించిన దర్శకుడు కె. రాఘవేంద్రరావు, ఎందుకంటే?

యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించిన దర్శకుడు కె. రాఘవేంద్రరావు, ఎందుకంటే?

Mehaboob On Sri Satya: శ్రీసత్య విషయంలో చొక్కాలు పట్టుకుని మరీ కొట్టుకోబోయిన అర్జున్, మెహబూబ్

Mehaboob On Sri Satya: శ్రీసత్య విషయంలో చొక్కాలు పట్టుకుని మరీ కొట్టుకోబోయిన అర్జున్, మెహబూబ్

K. Viswanath: సీతారాముల కళ్యాణంలో వితంతు వివాహం - ‘స్వాతిముత్యం’లో విశ్వనాథ్ సాహసం

K. Viswanath: సీతారాముల కళ్యాణంలో వితంతు వివాహం - ‘స్వాతిముత్యం’లో విశ్వనాథ్ సాహసం

Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?

Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?

టాప్ స్టోరీస్

నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

IND vs AUS: విశాఖలో మ్యాచ్‌ ఉందని గుర్తుందా! బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ షెడ్యూలు, టైమింగ్స్‌, వేదికలు ఇవే!

IND vs AUS: విశాఖలో మ్యాచ్‌ ఉందని గుర్తుందా! బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ షెడ్యూలు, టైమింగ్స్‌, వేదికలు ఇవే!

Jagananna's Foreign Education: పేద విద్యార్థులకు అండగా జగనన్న విదేశీ విద్యా దీవెన, తొలివిడతగా రూ.19.95కోట్లు విడుదల

Jagananna's Foreign Education: పేద విద్యార్థులకు అండగా జగనన్న విదేశీ విద్యా దీవెన, తొలివిడతగా రూ.19.95కోట్లు విడుదల