By: ABP Desam | Updated at : 17 Jan 2023 09:37 AM (IST)
Edited By: RamaLakshmibai
Guppedanta Manasu January 17th Update ( (Image Credit: Star Maa/Hot Star)
గుప్పెడంతమనసు జనవరి 17 మంగళవారం ఎపిసోడ్ (Guppedanta Manasu January 17th Update)
ఇంట్లోంచి వెళ్లిపోయేందుకు సిద్ధపడిన రిషిని ఎక్కడికి, ఎప్పుడొస్తావ్ అని ప్రశ్నిస్తారు ఇంట్లోవారంతా.
రిషి: ఏమో నేను ఎవరో తెలియనికొత్త ప్రదేశానికి వెళ్తాను .మళ్ళీ కొత్తగా పుట్టినట్టు తిరిగి వస్తాను.
మహేంద్ర: ఎప్పుడొస్తావ్
రిషి: ఏమో వస్తానో రానో నాకు కూడా తెలియదు
అప్పుడు మహేంద్ర రిషిని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు..నువ్వు వెళ్లి ఈ డాడ్ ని ఒంటరి వాడిని చేస్తావా
రిషి:అందరిలో ఉన్నా నేను ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాను డాడ్, నన్ను చూస్తే మీరు ఇంకా బాధపడతారు అందుకే వెళ్తున్నాను నన్ను వెళ్ళనివ్వండి
జగతి: నువ్వెళ్లు..వద్దనే అధికారం నాకులేదు..కానీ..వెళ్తున్నట్టు నువ్వే ఒకమాట కాలేజీలో చెప్పివెళ్లు..ఇప్పుడు నువ్వు వెళ్లిపోతే ఈ ఇంట్లోవాళ్లు ఏం చెప్పినా కాలేజీలో వాళ్లు, బయట వాళ్లు నమ్మరు.. వాళ్లకు తోచింది ఊహించుకుంటారు.. కాలేజీ గౌరవానికి భంగం కలిగిస్తుంది..
ఫణీంద్ర: జగతి చెప్పింది ఫాలో అవడం మంచిది..కాలేజీలో వాళ్లకి ఓ క్లారిటీ ఇచ్చినట్టవుతుంది.. పెదనాన్నగా చెబుతున్నాను విను..జగతి మంచి ఆలోచనే చేసింది..కాలేజీలో చెప్పాకే వెళ్లు
అప్పుడు రిషి ఏం మాట్లాడకుండా లగేజ్ అక్కడే వదిలేసి తన గదిలోకి వెళ్ళిపోతాడు.
Also Read: సైకో మోనితకు హిమ రూపంలో మరో అవకాశం, మళ్లీ మాయలో పడిపోయిన సౌందర్య, కార్తీక్
కాలేజీలో కారు దిగిన రిషి..ఎప్పుడూ నీతో కలిసి నేను కార్ దిగేవాడిని కానీ ఇప్పుడు నీ జ్ఞాపకాలతో కాలేజీకి వస్తున్నాను అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు జగతి కూడా అచ్చం రిషి లాగే ఇద్దరు ఎప్పుడు కలిసి దిగేవారు కానీ బరువెక్కిన హృదయంతో జ్ఞాపకాలతో కాలేజీకి వచ్చాడు అనుకుంటుంది. వసుధారతో గడిపిన ప్లేసెస్ కి వెళ్లి ఆ జ్ఞాపకాలు గుర్తుతెచ్చుకుని బాధపడుతూ ఉంటాడు రిషి. ఇంతలో మహేంద్ర ఫోన్ చేసి అందరూ ఎదురుచూస్తున్నారు రా నాన్న అనడంతో వస్తున్నాను అని చెప్పి అక్కడికి వెళ్తాడు రిషి.
రిషి: మీటింగ్ అరేంజ్ చేయడానికి పెద్దగా కారణాలు ఏమీ లేవు డిబిఎస్ టి కాలేజ్ ని అందరి సహాయ సహాయకారాలతో ముందుకు మంచి స్థానానికి తీసుకెళ్లారు. ఇప్పటివరకు మీరు నాకు ఎంతో అండగా ఉన్నారు ఇప్పుడు కూడా మీరు అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. డిబిఎస్ టి కాలేజీ ఎండి పదవికి నేను రాజీనామా చేస్తున్నాను అనడంతో కాలేజీ స్టాఫ్ అందరు ఆశ్చర్యపోతారు. ఎందుకు ఏమీ అని అడగవద్దు. ఇది నా పర్సనల్ నాకు విశ్రాంతి కావాలి, చాలా అలసిపోయాను అని అంటాడు రిషి. అప్పుడు కాలేజ్ స్టాఫ్ ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడంతో అప్పుడు మహేంద్ర చెప్పారు కదా ఇందాకే అలసిపోయాను చిన్న బ్రేక్ కావాలని అందుకే అంటాడు. ఈ విషయాన్ని నోటీస్ బోర్డ్ లో పెట్టించండి మీటింగ్ ఓవర్ అని చెబుతాడు. కాలేజీ స్టాప్ అందరూ అక్కడ నుంచి వెళ్లిపోతారు. అప్పుడు మహేంద్ర ఫణీంద్ర వాళ్ళు ఎంత చెప్పినా వినిపించుకోకుండా రిషి నా మనసుకు అయిన గాయం మానాలి అంటే కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందే నేను వెళ్తాను అని అంటాడు.
నా మనసులో నేను లేను అంటూ ఎమోషనల్ గా మాట్లాడుతాడు రిషి. నేను లగేజ్ తెచ్చుకున్నాను ఇటు నుంచి ఇటే ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోతాను అనడంతో అందరూ షాక్ అవుతారు. ఇంట్లో ఎవరికీ చెప్పలేదు చెప్పకుండా వచ్చాను ఒక మాట చెప్పండి వాళ్లకు కోపం వచ్చినా బాధ వచ్చినా నేను ఏమి చేయలేని స్థితిలో ఉన్నాను అని అంటాడు. ఆ తర్వాత రిషి జగతి దగ్గరికి వెళ్లి జగతి చేయి పట్టుకుని తీసుకొచ్చి తన సీట్ లో కూర్చోబెడతాడు. అప్పుడు జగతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. డాడ్ జాగ్రత్త మేడం, కాలేజీ కూడా అని చెప్పి రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
Also Read: రిషి నిర్ణయం విని షాకైన దేవయాని- వసు ప్రేమని అంగీకరించి పెళ్లిచేసుకోమన్న చక్రపాణి
రిషి కాలేజీ నంచి బయటకు వెళ్లిపోతుండగా..వసుధార లగేజ్ తీసుకుని కాలేజీకి వస్తుంది. అప్పుడు రిషి వసుధారనీ చూసి కూడా తన భ్రమ అనుకుని వెళ్ళిపోతుండగా వసుధార పిలవడంతో కారు ఆపుతాడు. అప్పుడు వసుధార అన్న మాటలు గుర్తు తెచ్చుకుని పిలుస్తున్నా పలకకుండా వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత మహేంద్ర జగతి ఇద్దరు రిషి క్యాబిన్ కి వెళ్లి బాధపడుతూ ఉంటారు. అప్పుడు జగతి, రిషి సీట్ల కూర్చోడానికి ఇబ్బంది పడుతూ ఉండగా మహేంద్ర కూర్చోబెడతాడు. ఇంతలోనే వసుధర అక్కడికి రావడంతో జగతి మహేంద్ర ఇద్దరు షాక్ అవుతారు. అప్పుడు జగతి వసుధార మెడలో ఉన్న తాళిని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
జగతి: మళ్లీ ఎందుకు వచ్చావు
వసు: అదేంటి మేడం అలా అంటారు. మిషన్ ఎడ్యుకేషన్ హెడ్గా నన్ను ఎన్నుకున్నారు కదా ఆ వర్క్ స్టార్ట్ చేయమని మినిస్టర్ గారి నుంచి మెయిల్ రావడంతో వచ్చాను మేడం అని అంటుంది.
మహేంద్ర: జగతి మేడం ఇప్పుడు డిబిఎస్టి కాలేజీ కొత్త ఎండి
వసు: రిషి సార్ ఎక్కడికి వెళ్ళారు మేడం
జగతి: భవిష్యత్తును వెతుక్కుంటూ మాకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు
జగతి మాటలు విని వసుధార షాక్ అవుతుంది..
మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?
Rakhi Sawant Mother Death: రాఖీ సావంత్ తల్లి జయ భేదా కన్నుమూత - ఇక ఎవరు నన్ను హగ్ చేసుకుంటారంటూ భావోద్వేగం
Ajith Kumar’s AK62 Movie: అజిత్ సినిమా నుంచి దర్శకుడు విఘ్నేష్ శివన్ ఔట్? కారణం అదేనా?
Chiranjeevi - Ram Charan: రామ్ చరణ్ స్థానంలో నేనే ఉన్నంత గర్వంగా ఉంది: చిరంజీవి
Pawan Kalyan New Movie: పవర్ స్టార్ అభిమానులకు సూపర్ న్యూస్, పవన్ - సుజిత్ మూవీ షూటింగ్ డేట్ ఫిక్స్!
SI Constable Marks : ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్, ఆ 7 ప్రశ్నల విషయంలో మార్కులు కలపాలని బోర్డు నిర్ణయం
Australian Open 2023: 2023ను రికార్డుతో మొదలెట్టిన ‘జోకర్’ - పదో ఆస్ట్రేలియన్ ఓపెన్ సొంతం!
Nellore Rural MLA: నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు ! వైసీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
Srisailam Bus Accident : శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సుకు తప్పిన పెనుప్రమాదం