Guppedanta Manasu January 16th: రిషి నిర్ణయం విని షాకైన దేవయాని- వసు ప్రేమని అంగీకరించి పెళ్లిచేసుకోమన్న చక్రపాణి
Guppedantha Manasu January 16th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
రిషి, వసు ఒకరినొకరు గురించి ఆలోచించుకుంటూ బాధపడతారు. చేతి మీద రాతలు అంటే నీటి మీద రాతలు అని తెలుసుకోలేకపోయాను అని రిషి ఎమోషనల్ అవుతాడు. వసు తన మెడలో తాళి దానికి ఉన్న వీఆర్ ఉంగరం చూసి బాధపడుతుంది. దూరం ఇంత భారమా వసుధార, ఈ భారాన్ని భరించడం తన వల్ల కావడం లేదని రిషి ఫీల్ అవుతాడు. ఇంటి గుమ్మం వైపు చూస్తూ ఇక ఈ ఇంటికి రావా అని అనుకుంటూ ఉండగా జగతి వచ్చి నువ్వు పంపిన మెయిల్ చూశానని చెప్పేసి వెళ్ళిపోతుంది. అప్పుడే దేవయాని ఎదురుపడుతుంది. రిషి దగ్గరకి వెళ్తుంది.
కాలేజీ స్టాఫ్ ఇంటికి వస్తున్నారు, వాళ్ళతో మీరు మాట్లాడండి అని రిషి తన పెద్దమ్మకి చెప్తాడు. వసు గురించి తప్పుగా మాట్లాడిన స్టాఫ్ ఇంటికి వస్తారు. రిషి, వసుధార గురించి నోటికొచ్చినట్టు మాట్లాడారంట అని దేవయాని వాళ్ళని తిడుతున్నట్టు నటిస్తుంది. వసుధార గురించి అలా మాట్లాడమని చెప్పింది ఈవిడే కదా మళ్ళీ ఇలా మాట్లాడుతుంది ఏంటని స్టాఫ్ అనుకుంటారు. వీళ్ళని పిలిపించి అడగటం వల్ల ప్రయోజనం ఏంటని జగతి అంటుంది. వసు ఇక్కడ లేకపోయినా కూడా తను అనుభవించిన బాధ గుర్తుంది, కాలేజీలో ఇంక ఏ ఆడపిల్ల కూడా అలాంటి మాటలు పడకూడదు అని అంటాడు. నేనే వీళ్ళని అలా మాట్లాడమని చెప్పాను ఇప్పుడు నేనే తిడుతున్న రిషి నా పరువు తీసేస్తున్నాడు అని దేవయాని మనసులో అనుకుంటుంది.
Also Read: సౌందర్యకి నిజం చెప్పిన మోనిత- కార్తీక్ కి రెండో పెళ్లి చేస్తానన్న దీప
వసు గురించి అలా మాట్లాడే ధైర్యం వాళ్ళకి లేదు మీరే అలా చేయించారని జగతి కూడా అనుకుంటుంది. వసు తన తల్లిదండ్రులకి అన్నం తినిపిస్తూ ఉంటుంది. చక్రపాణి తను చేసిన తప్పులు తలుచుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటాడు.
చక్రపాణి: నీ గురించి తెలుసుకోవడానికి నాకు ఇంత కాలం పట్టింది. వసు విషయంలో మనం ఒక నిర్ణయం తీసుకోవాలి
సుమిత్ర; వసు విషయంలో దేవుడు ఎప్పుడో నిర్ణయం తీసుకున్నాడు
చక్రపాణి: వసు చేతికి టికెట్ ఇచ్చి రిషి దగ్గరకి వెళ్ళమని చెప్తాడు. పెళ్లి చేసుకుని పిలవాలని అనిపిస్తే పిలువు వచ్చి అక్షింతలు వేస్తాను. మట్టిలో మాణిక్యంలాగా పుట్టావు. చదువులో గెలిచావ్, జీవితంలో గెలిచావ్. వెళ్ళు నీకోసం రిషి సార్ ఎదురుచూస్తూ ఉంటారు
రిషి లాగేజ్ బ్యాగ్ తీసుకుని రావడం చూసి అందరూ షాక్ అవుతారు. దేవయాని ఎక్కడికని అడుగుతుంది.
రిషి: వెళ్తున్నా పెద్దమ్మా
దేవయాని: ఎక్కడికి వెళ్తావ్ రిషి
రిషి: కొన్నాళ్ళు అందరికీ దూరంగా ఉండాలని అనుకుంటున్నా
Also Read: మాళవికని గెంటేసేందుకు భ్రమరాంబిక స్కెచ్- ఇంటికి తిరిగొచ్చేసిన వేద, యష్
మహేంద్ర: ఎక్కడికని వెళ్తున్నావ్ పారిపోతున్నావా
రిషి: మనుషుల నుంచి పారిపోగలను ఏమో కానీ మనసు నుంచి ఎక్కడికి వెళ్లగలను
దేవయాని: ఎవరో మోసం చేశారని
రిషి: పెద్దమ్మా.. ఎవరో మోసం చేశారని పారిపోయెంత పిరికివాడిని కాదు, నాకు నేనే నచ్చడం లేదు
ఫణీంద్ర: నువ్వు వెళ్తే కాలేజీ ఎవరు చూసుకుంటారు
రిషి: నా తర్వాత కాలేజీని జగతి మేడమ్ చూసుకుంటారు. ఈ విషయం గురించి ఆల్రెడీ మెయిల్ చేశాను. మినిస్టర్ గారికి మెయిల్ చేశాను ఆయన ఒకే అన్నారు
మహేంద్ర: వెళ్ళడం అవసరమా
రిషి: అత్యంత అవసరం డాడ్. నా గుండె బరువుని మొయ్యలేకపోతున్నా. నేను ఎవరో తెలియని ఒక కొత్త ప్రదేశానికి వెళ్తాను. మళ్ళీ కొత్తగా పుట్టినట్టు తిరిగొస్తాను
మహేంద్ర: ఎప్పుడు వస్తావ్
రిషి: ఏం తెలియదు అసలు వస్తానో రానో కూడా తెలియదు