News
News
X

Karthika Deepam January 16th: సౌందర్యకి నిజం చెప్పిన మోనిత- కార్తీక్ కి రెండో పెళ్లి చేస్తానన్న దీప

కార్తీకదీపం జనవరి 16 ఎపిసోడ్: బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్న కార్తీక్ దీపం సీరియల్ కి త్వరలో శుభం కార్డు పడనుంది... ఈ రోజు ఏం జరిగిందంటే...

FOLLOW US: 
Share:

మోనిత వల్ల ఎవరు సంతోషంగా లేరని చనిపోయేలోపు ఏదో ఒక పరిష్కారం చేయాలని దీప అనుకుంటుంది. సౌందర్యకి నిజం చెప్పి భర్తకి ఇంకో పెళ్లి చేసేందుకు ఒప్పించాలని మనసులో అనుకుంటుంది. అప్పుడే పిల్లలు దీప దగ్గరకి వస్తారు. ఏంటి డల్ గా ఉన్నావ్ వచ్చినప్పడు నుంచి ఏదో ఆలోచిస్తూ ఉంటున్నావ్ అని పిల్లలు, సౌందర్య అడుగుతారు. విషయం ఏంటో చెప్పమని సౌందర్య అడుగుతుంది. హైదరాబాద్ వెళ్దామని శౌర్య అంటుంది. ఆ మాట విని సౌందర్య సంతోషిస్తుంది. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాట విషయం ఏంటో చెప్పమని అడిగేసరికి దీప విషయం చెప్పకుండా మాట దాటేస్తుంది. దీప, కార్తీక్ ఇద్దరూ విషయం చెప్పకుండా విచిత్రంగా ప్రవర్తించడంతో అనుమానపడుతుంది.

Also Read: కార్తీక్ కోసం సంక్రాంతి రోజు జుట్టుపట్టి కొట్టుకున్న దీప-మోనిత, గుండెమార్పిడి గురించి ఆలోచించమన్న హేమచంద్ర

సౌందర్య ఇంట్లో పూజ చేయిస్తుంది. సంక్రాంతి విశిష్టత గురించి చక్కగా చెప్తుంది. మీరు నిజం చెప్పేద్దాం అన్నారు ఇప్పుడు అది చెప్తే ఈ సంతోషం ఇలా ఉంటుందా అని దీప అంటుంది. మన పిల్లలకి మంచి అమ్మని, అత్తయ్యకి మంచి కోడలిని తీసుకొస్తే ఇంట్లో సంతోషం ఉంటుందని దీప అంటుంది. అదృష్టం కలిసొచ్చి నిన్ను కాపాడటం కుదురుతుందేమో కానీ నా జీవితంలోకి మరొకరు రావడం కుదరదని తెగేసి చెప్పేస్తాడు. ఎంత చెప్పినా మార్పు వచ్చేలా కనిపించడం లేదని నిజం చెప్పక తప్పదేమో అని దీప అనుకుంటుంది. తర్వాత పిల్లలతో కలిసి సంతోషంగా డాన్స్ వేస్తూ ఉంటుంది. హేమచంద్ర వాళ్ళ డాబా మీద నిలబడి చూస్తూ ఉంటుంది. హేమచంద్ర తనని చూసి ఎవరని అడిగేసరికి మోనిత డాక్టర్ కార్తీక రెండో భార్యని అని పరిచయం చేసుకుంటుంది.

హేమచంద్ర: కార్తీక్ కి ఉంది ఒకటే భార్య తనే దీప

మోనిత: నేను తనకి విలన్ కాబట్టి మీకు కూడా అలాగే కనిపిస్తాను

హేమచంద్ర: దీప వాళ్ళు ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నారు అంటే దానికి కారణం నువ్వే కదా

మోనిత: దీప కోసం నేను ఒక త్యాగం చేయాలని అనుకున్నా కార్తీక్ అది చెప్పలేదా? అందులో నా మంచితనం కనిపించలేదా

హేమచంద్ర: ఎంత మంచిది అని చెప్పినా తనని నమ్మడానికి వీల్లేదు ఇప్పుడు నాతో ఏం మాట్లాడటానికి వచ్చిందా అని మనసులో అనుకుంటాడు

Also Read: మళ్లీ కొత్తగా మొదలైన రిషిధార ప్రేమ ప్రయాణం, రొమాంటిక్ ఊహల్లో రిషి

దీప డాన్స్ వేసి ఆయాస పడుతూ ఉంటుంది. మోనితని హేమచంద్ర ఇంట్లో చూసి తను ఎందుకు వచ్చిందా అని టెన్షన్ పడుతూ కింద పడిపోతుంది. దీపని చూసి అందరూ కంగారు పడతారు. ఇంట్లో దీప తండ్రి మురళీ కృష్ట దీప వాళ్ళ ఫోటో చూసి బాధపడుతూ ఉంటాడు. అప్పుడే కార్తీక్, దీప వాళ్ళు ఇంటికి రావడం చూసి షాక్ అయి కింద పడిపోతుంది. వాళ్ళని చూసి మురళీ కృష్ట సంతోషపడతాడు. కాసేపటికి కళ్ళు తెరిచిన భాగ్యం దీప వాళ్ళని చూసి సంతోషిస్తుంది. ఇన్ని రోజులు ఎందుకు రాలేదు, అసలు ఏం జరిగిందని అడుగుతారు.

సౌందర్య దేవుడి ముందు దణ్ణం పెట్టుకుంటూ ఉండగా మోనిత వస్తుంది. కార్తీక్ వాళ్ళు ఇన్ని రోజులు ఎందుకు రాలేదో చెప్పారా? నేను లేకపోతే అసలు దీప, కార్తీక్ కథ ఉంటుందా? అని అంటుంది. నాకు విషయం చెప్పలేదంటే అది నన్ను బాధించేది అయి ఉంటుందని సౌందర్య అంటుంది. మోనిత దీప రిపోర్ట్స్ సౌందర్య చేతిలో పెడుతుంది. అవి చూసి షాక్ అవుతుంది. 

Published at : 16 Jan 2023 08:29 AM (IST) Tags: Karthika Deepam Serial karthika Deepam Serial Today Episode Karthika Deepam Serial Written Update Karthika Deepam Episode Karthika Deepam Serial January 16th Episode

సంబంధిత కథనాలు

Salim Khan Marriage: పెళ్లి కోసం పేరు మార్చుకున్న సల్మాన్ తండ్రి, సలీం ఖాన్ శంకర్ గా ఎలా మారారో తెలుసా?

Salim Khan Marriage: పెళ్లి కోసం పేరు మార్చుకున్న సల్మాన్ తండ్రి, సలీం ఖాన్ శంకర్ గా ఎలా మారారో తెలుసా?

Satyadeep Misra Marriage: రహస్యం ఏమీ లేదు, అందరికీ చెప్పే మసాబాను పెళ్లి చేసుకున్నా- సత్యదీప్ మిశ్రా

Satyadeep Misra Marriage: రహస్యం ఏమీ లేదు, అందరికీ చెప్పే మసాబాను పెళ్లి చేసుకున్నా- సత్యదీప్ మిశ్రా

Sidharth Kiara Advani Wedding: సిద్ధార్థ్-కియారా పెళ్లికి వెళ్లే గెస్టులకు ఓ కండీషన్, దయచేసి ఆపని చెయ్యొద్దని కోరిన కొత్త జంట!

Sidharth Kiara Advani Wedding: సిద్ధార్థ్-కియారా పెళ్లికి వెళ్లే గెస్టులకు ఓ కండీషన్, దయచేసి ఆపని చెయ్యొద్దని కోరిన కొత్త జంట!

Vani Jayaram Death Mystery : రక్తపు మడుగులో వాణీ జయరామ్ - మిస్టరీగా లెజండరీ సింగర్ మృతి

Vani Jayaram Death Mystery : రక్తపు మడుగులో వాణీ జయరామ్ - మిస్టరీగా లెజండరీ సింగర్ మృతి

Singer Vani Jayaram Death : లెజండరీ సింగర్ వాణీ జయరామ్ మృతి - రెండు  నేషనల్ అవార్డులు విశ్వనాథ్ సినిమాల్లో పాటలకే

Singer Vani Jayaram Death : లెజండరీ సింగర్ వాణీ జయరామ్ మృతి - రెండు  నేషనల్ అవార్డులు విశ్వనాథ్ సినిమాల్లో పాటలకే

టాప్ స్టోరీస్

TS High Court : న్యాయమూర్తికే నోటీసులిచ్చిన న్యాయవాది, జైలుకు పంపిస్తామని హైకోర్టు సీరియస్

TS High Court : న్యాయమూర్తికే నోటీసులిచ్చిన న్యాయవాది, జైలుకు పంపిస్తామని హైకోర్టు సీరియస్

BRS Nanded Meeting : నాందేడ్‌లో బీఆర్ఎస్ బహిరంగసభకు ఏర్పాట్లు పూర్తి - భారీగా మహారాష్ట్ర నేతల చేరికలు !

BRS Nanded Meeting :  నాందేడ్‌లో  బీఆర్ఎస్  బహిరంగసభకు ఏర్పాట్లు పూర్తి - భారీగా మహారాష్ట్ర నేతల చేరికలు !

Mekapati Ananya Reddy : నాన్న ఆశయాలు నెరవేరుస్తా, పొలిటికల్ ఎంట్రీపై గౌతమ్ రెడ్డి కుమార్తె క్లారిటీ

Mekapati Ananya Reddy : నాన్న ఆశయాలు నెరవేరుస్తా, పొలిటికల్ ఎంట్రీపై గౌతమ్ రెడ్డి కుమార్తె క్లారిటీ

Rushikonda Green Carpet : పచ్చగా మారిపోయిన రుషికొండ - ఈ మ్యాజిక్ ఎలా జరిగిందో తెలుసా ?

Rushikonda Green Carpet : పచ్చగా మారిపోయిన రుషికొండ - ఈ మ్యాజిక్ ఎలా జరిగిందో తెలుసా ?