News
News
X

Karthika Deepam January 14th Update: కార్తీక్ కోసం సంక్రాంతి రోజు జుట్టుపట్టి కొట్టుకున్న దీప-మోనిత, గుండెమార్పిడి గురించి ఆలోచించమన్న హేమచంద్ర

కార్తీకదీపం జనవరి 14 ఎపిసోడ్: బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్న కార్తీక్ దీపం సీరియల్ కి త్వరలో శుభం కార్డు పడనుంది... ఈ రోజు ఏం జరిగిందంటే...

FOLLOW US: 
Share:

కార్తీకదీపం జనవరి 14 శనివారం ఎపిసోడ్ (Karthika Deepam January 14th Update)

 నీకు వేడి పడదని చెప్పాను కదా దీప మళ్ళీ ఎందుకు అక్కడికి వెళ్తున్నావు  అని కార్తీక్, హేమచంద్ర అంటారు
దీప: పిల్లలు పిండి వంటలు అడిగారు డాక్టర్ బాబు అందుకే కాదన లేకపోయాను 
హేమచంద్ర: నీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదమ్మా . ప్రమాదానికి మరింత దగ్గర వెళ్తే ఎలా 
దీప: ప్రమాదమని మీరు అనుకుంటున్నారు సంతోషానికి దగ్గరగా వెళుతున్నాను అని నేను అనుకుంటున్నాను. పిల్లలు పట్టుబడుతున్నారు చంద్రమ్మ నేను అత్తయ్య అందరూ చేస్తున్నాం ఒకవేళ కాదు అంటే ఎందుకు అని అడుగుతారు అందుకే కాదనలేక చేస్తున్నాను డాక్టర్ బాబు 
హేమచంద్ర: ఇంట్లో వాళ్లకి నిజం చెప్పేయండి నేను కూడా కార్తీక్ అదే విషయం చెబుతున్నాను ఇంకా ఎక్కువ రోజులు ఈ విషయాన్ని దాచొద్దు
దీప: కార్తీక్ నిజం చెప్పేద్దాము అనడంతో వద్దు డాక్టర్ బాబు అంటుంది దీప
హేమచంద్ర: మేము చెప్పేది కూడా ఒకసారి ఆలోచించు దీప 
దీప: నా ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాలని లేదు అన్నయ్య అందరిలాగే నేను నూరేళ్లు బతకాలని ఉంది. నేను బతకడానికి ఒక్క అవకాశం కూడా లేదా డాక్టర్ బాబు అని దీప ఏడుస్తూ అడగడంతో...కార్తీక్ కి మోనిత మాటలు గుర్తొస్తాయి. నేను బతికే అవకాశం ఉందంటే..ఇప్పుడే వెళ్లి అత్తయ్య వాళ్లకు చెప్పేస్తాను అనేసి..ఏడ్చుకుంటూ వెళ్లిపోతుంది దీప..

Also Read: భోగి రోజు మీ బంధుమిత్రులకు ఇలా శుభాకాంక్షలు చెప్పండి

సౌందర్య పిల్లలు కలసి దీప కార్తీక్ ను అక్కడికి పిలుస్తారు. ఇప్పుడు కార్తీక్ దీపను దూరంగా ఉండమని చెప్పడంతో సంతోషానికి హద్దులు పెట్టకండి డాక్టర్ బాబు అంటుంది దీప. ఆ తర్వాత సౌందర్య సీరియస్ అవ్వడంతో కార్తీక్ దీప అక్కడికి వచ్చి భోగి మంటలు వెలిగిస్తారు. ఇంతలో మోనిత వచ్చి బకెట్ నీళ్లతో ఆ భోగి మంటను ఆర్పేస్తుంది. ఇక్కడ నా కడుపు మండుతుంటే మీకు భోగిమంటలు కావాలా అని ఫైర్ అవుతుంది. మమ్మల్ని సంతోషంగా ఉండనివ్వవా రాక్షసి అంటుంది సౌందర్య. ఈ భోగి మంటలు ఇవన్నీ నావి ఈ దీప కార్తీక్ పక్కన లేకపోతే నేను భార్యగా ఇవన్నీ చేసేదాన్ని అని అంటుంది. 
దీప: మోనిత మాటలకు కోపంతో రగిలిపోతూ ఎక్కువ మాట్లాడమంటే ఈ భోగి మంటలలో నిన్ను తగలబెట్టేస్తాను అని మోనిత జుట్టు పట్టుకుంటుంది.  దీపను ఆపుతుంటే..దీన్ని చంపేస్తా డాక్టర్ బాబు
మోనిత: నవ్వుతూ ....నవ్వు నన్ను చంపేస్తావా అంటూ అసలు నిజం చెప్పబోతుండగా కార్తీక్ సీరియస్ అయ్యి ఒక్క మాట మాట్లాడావంటే దీప అన్నమాట నీ నిజం చేస్తాను ఇకనుంచి వెళ్లిపో అని అరుస్తాడు.
ఆ తర్వాత పిల్లలు అలిగి అక్కడ నుంచి వెళ్ళిపోతారు.

హేమచంద్ర కార్తీక్ అలా నడుచుకుంటూ వెళుతూ మోనిత గురించి మాట్లాడుకుంటారు...ఇంతలో మోనిత పిలుస్తుంది. 
మోనిత: ఏంటి కార్తీక్ థాంక్స్ చెప్తావ్ అనుకుంటే ఇలా మాట్లాడుతున్నావు
కార్తీక్: నీకు ఎందుకు చెప్పాలి థాంక్స్ 
మోనిత: నేను ఎంత పెద్ద సహాయం చేశాను అన్నది నీకు తెలుసు దీప ఉన్న పరిస్థితులలో భోగిమంట దగ్గరికి వెళ్తే ప్రమాదం మరింత ఎక్కువవుతుంది.దీపకు ప్రమాదం జరగకూడదని తెలిసే నన్ను తిట్టినా పర్వాలేదు అనుకోని అలా చేశాను. మళ్లీ గుండె మార్పిడి గురించి ఆలోచించు అని చెబుతుంది. దీపను దూరం చేసుకోవడం మంచిదా...నా ప్రాణత్యాగం వల్ల మన ముగ్గురం కలసి ఉండడం మంచిదా ఆలోచించు. పెళ్లైనా నిన్ను వదలను అన్నాను వదల్లేదు... దీప నీకోసం ఆలోచిస్తే నేను తన గుండెచప్పుడు అవుతా.. ఇది మాటలే చెబుతుంది ప్రాణాలెందుకు ఇస్తుందని అనుకుంటావేమో... నువ్వు ఊ అను గంటలో దీప గుండె మార్చేయవచ్చు అనేసి వెళ్లిపోతుంది..  కార్తీక్ ఆలోచిస్తాడు...

Also Read: భోగిమంటపై నీళ్లు పోసేసిన మోనిత, షాక్ అయిన దీప-కార్తీక్ -సౌందర్య

మరోవైపు సౌందర్య, దీప జరిగిన విషయాన్ని తలచుకొని రగిలిపోతూ ఉంటారు. 
ఎందుకు అది మిమ్మల్ని పిశాచిలా వెంటాడుతోందని సౌందర్య అంటే..అదంతే అత్తయ్య అంటుంది దీప. మీరు రాకపోవడానికి కారణం అదేనా అని సౌందర్య నిలదీస్తే..దీప ఏమీ మాట్లాడలేక ఆగిపోతుంది. ఇంతలో పిల్లలు వచ్చి..మోనిత గురించి మాట్లాడతారు.. ఆ మోనితపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వు నానమ్మా..లేదంటే మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు అని కోప్పడుతుంది శౌర్య... దానిగురించి భయపడొద్దమ్మా మళ్లీ అది ఇటువైపు రాకుండా ఏం చేయాలో నాకు తెలుసు.. రేపు సంక్రాంతి పండుగకు ఎలాంటి ఆంటంకం రాదని ధైర్యం చెబుతుంది... మరోవైపు హిమ..ఆనంద్ ఎక్కడున్నాడు అని అడిగితే.. తల్లి అయిన మోనితే ఆలోచించడం లేదు..మీకెందుకు..లోకంలో ఎక్కడ పెరిగినా పర్వాలేదు కానీ మన దగ్గర పెరగకూడదని అనుకుంది...ముందు దీని సమస్య వదిలితే ఆ తర్వాత ఆనంద్ గురించి ఆలోచిద్దాం అంటుంది సౌందర్య. 

కార్తీక్-హేమచంద్ర
హేమచంద్ర: ఏమంటోంది మోనిత
కార్తీక్: నేను చనిపోతాను...నా గుండె దీపకు పెట్టి బతికించుకో.. దీప పోయినా నువ్వు దక్కవు అందుకే ఇలా చేస్తే నీ గుండెకు దగ్గరవొచ్చు కదా అంటోంది
హేమచంద్ర: ఇది మోనిత క్యారెక్టర్ కానేకాదు...కానీ...నిన్ను ప్రేమించింది..ఆ మోనిత అన్నంత పనిచేస్తుంది కార్తీక్ ఎందుకంటే పెళ్లి అయినా కూడా నిన్ను విడిచిపెట్టలేదు కదా ఆ విషయంలో మోనితను ఎంతకైనా తెగిస్తుందని చెప్పొచ్చు. 
కార్తీక్: అది ప్రేమ కాదు పిచ్చి
హేమచంద్ర: నీకు పెళ్లైనా నీ వెంటపడడం తప్పే...తను ఏం సుఖపడింది.. హంతకురాలైంది, జైలుకెళ్లింది, అవమానాలు ఎదుర్కొంది..ఇంకా నీకోసమే ఎదురుచూస్తోంది..తనది నిజమైన ప్రేమ..తన ప్రాణాలు పోయేవరకూ నీతోనే ఉండాలనుకుంటోంది..
కార్తీక్: నన్ను నమ్మించేందుకు మరో డ్రామా... నా భార్య ప్రాణాలు కాపాడుకునేందుకు మరొకరి ప్రాణాలు కాపాడేందుకు నేను కసాయివాడిని కాదు..
హేమచంద్ర:నువ్వు ఒప్పుకున్నావని నీ వెంటపడలేదు..తను గట్టిగా నమ్మితే నువ్వు వద్దన్నా ప్రాణాలు వదిలేస్తుంది.. అప్పుడు ఏం చేయాలో ఆలోచించు కార్తీక్..

Published at : 14 Jan 2023 09:40 AM (IST) Tags: Karthika Deepam Serial karthika Deepam Serial Today Episode Karthika Deepam Serial Written Update Karthika Deepam Episode Karthika Deepam Serial January 14th

సంబంధిత కథనాలు

మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?

మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?

Rakhi Sawant Mother Death: రాఖీ సావంత్ తల్లి జయ భేదా కన్నుమూత - ఇక ఎవరు నన్ను హగ్ చేసుకుంటారంటూ భావోద్వేగం

Rakhi Sawant Mother Death: రాఖీ సావంత్ తల్లి జయ భేదా కన్నుమూత - ఇక ఎవరు నన్ను హగ్ చేసుకుంటారంటూ భావోద్వేగం

Ajith Kumar’s AK62 Movie: అజిత్ సినిమా నుంచి దర్శకుడు విఘ్నేష్ శివన్ ఔట్? కారణం అదేనా?

Ajith Kumar’s AK62 Movie: అజిత్ సినిమా నుంచి దర్శకుడు విఘ్నేష్ శివన్ ఔట్? కారణం అదేనా?

Chiranjeevi - Ram Charan: రామ్ చరణ్ స్థానంలో నేనే ఉన్నంత గర్వంగా ఉంది: చిరంజీవి

Chiranjeevi - Ram Charan: రామ్ చరణ్ స్థానంలో నేనే ఉన్నంత గర్వంగా ఉంది: చిరంజీవి

Pawan Kalyan New Movie: పవర్ స్టార్ అభిమానులకు సూపర్ న్యూస్, పవన్ - సుజిత్‌ మూవీ షూటింగ్ డేట్ ఫిక్స్!

Pawan Kalyan New Movie: పవర్ స్టార్ అభిమానులకు సూపర్ న్యూస్, పవన్ - సుజిత్‌ మూవీ షూటింగ్ డేట్ ఫిక్స్!

టాప్ స్టోరీస్

SI Constable Marks : ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్, ఆ 7 ప్రశ్నల విషయంలో మార్కులు కలపాలని బోర్డు నిర్ణయం

SI Constable Marks : ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్, ఆ 7 ప్రశ్నల విషయంలో మార్కులు కలపాలని బోర్డు నిర్ణయం

Australian Open 2023: 2023ను రికార్డుతో మొదలెట్టిన ‘జోకర్’ - పదో ఆస్ట్రేలియన్ ఓపెన్ సొంతం!

Australian Open 2023: 2023ను రికార్డుతో మొదలెట్టిన ‘జోకర్’ - పదో ఆస్ట్రేలియన్ ఓపెన్ సొంతం!

Nellore Rural MLA: నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు ! వైసీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

Nellore Rural MLA: నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు ! వైసీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

IND Vs NZ 2nd T20I Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ - భారత్‌కు చావో రేవో!

IND Vs NZ 2nd T20I Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ - భారత్‌కు చావో రేవో!