News
News
X

Bhogi Wishes in Telugu 2023: భోగి రోజు మీ బంధుమిత్రులకు ఇలా శుభాకాంక్షలు చెప్పండి

మీ బంధుమిత్రులకు ఈ కోట్స్‌తో భోగి-సంక్రాంతి శుభాకాంక్షలు చెబితే చాలా సంతోషిస్తారు. ఇంకెందుకు ఆలస్యం అందరి కంటే ముందే.. మీ బంధుమిత్రులకు విసెష్ చెప్పేయండి మరి.

FOLLOW US: 
Share:

Bhogi Wishes in Telugu 2023: తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకొనే పెద్ద పండుగ వచ్చేసింది. జనవరి 14 శనివారం భోగితో మొదలయ్యే ఈ పండుగ మూడు రోజుల పాటూ ముచ్చటగా సాగుతుంది. పాత వస్తువులను అగ్నికి ఆహుతి చేసి.. ఉత్తరాయణంలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ..మనలో చెడును తగలబెట్టి మంచిని పెంచుకోవడమే ఈ భోగి మంటలు వెనుక ఉన్న ఆంతర్యం. ఈ సందర్భంగా మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో భోగి శుభాకాంక్షలు చెప్పేయండి

భోగ భాగ్యాల భోగి..సరదాల సంక్రాంతి..కమ్మనైన కనుమ..
మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు

గతానికి వీడ్కోలు పలుకుతూ
రేపటి జీవిత సంక్రాంతికి స్వాగతం పలికే
భోగి పండుగ సందర్భంగా
అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు

కష్టాలు, బాధలు భోగి మంటలతో పోవాలి
కొత్త ఆనందాలు, సంతోషాలు వెల్లివిరియాలి
మీ అందరికీ భోగి శుభాకాంక్షలు

పతంగులు ఆకాశానికి సరికొత్త రంగులు అద్దినట్లు... 
ఈ భోగి పండుగ మీ జీవితంలో సరికొత్త ఆనందాలు తేవాలి
హ్యాపీ భోగి 

భోగి మంటలతో మీ సమస్యలన్నీ మటుమాయం కావాలి
మీ ఇంట భోగభాగ్యాలు రావాలి
మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు

చెడును దహించే భోగి మంటలు.
భోగాలను అందించే భోగి పండ్లు..
ఘుమఘుమలాడే పిండి వంటలు..
కీర్తనలు పాడే హరిదాసులు..
సంక్రాంతికి తెచ్చేను సందళ్లు..
సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి మీ ఇళ్లు.
మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి-సంక్రాంతి శుభాకాంక్షలు

Also Read: సంక్రాంతి ఆద్యంతం సందడి చేసే హరిదాసు, బసవన్న సాక్షాత్తూ ఎవరో తెలుసా!

ఈ భోగి మీ చీడ-పీడలను తొలగించాలని..
మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని..
భోగ భాగ్యాలు, సుఖ సంతోషాలు కలగాలని ఆశిస్తూ.. 
అందరికీ.. భోగి పండగ శుభాకాంక్షలు!

ఈ భోగి మీకు సకల భాగ్యాలను అందించాలని ఆ దేవుడిని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబసభ్యులకు భోగి శుభాకాంక్షలు.

మీలోని చెడును, వ్యసనాలను భోగి మంటల్లో వేసేయండి
జీవితంలోకి కొత్త వెలుగులను ఆహ్వానించండి.
అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు!

Also Read: భోగి, సంక్రాంతికి ఇంటి ముందు గొబ్బిళ్లు ఎందుకు పెడతారు, ఆ పాటల వెనుకున్న ఆంతర్యం ఏంటి!

ఈ భోగి భోగభాగ్యాలతోపాటు..
మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ..
అందరికీ భోగి శుభాకాంక్షలు.

భోగి మంటల వెచ్చని వెలుగులు..రంగవల్లుల్లో గొబ్బిళ్లు..
కొత్త బియ్యపు పొంగళ్లు..అందరి మది ఆనందంతో పరవళ్లు..
పెద్ద పండుగ మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కాంక్షిస్తూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి-సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగుదనానికి తలమానికంగా నిలిచే ప్రతి ఇల్లు..
కుటుంబాలను దగ్గరకి చేర్చే మూడు రోజులు.. 
మీ జీవితాల్లో మరిన్ని మధురానుభూతులు నింపాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి-సంక్రాంతి శుభాకాంక్షలు.

నింగిని తాకే పతంగులు..పలనాడులో కోళ్ల పందేలు..
చిందులువు వేసే బసవన్నలు..సంక్రాంతి మూడు దినాలు..
చూడతరమా పల్లె అందాల సోయగాలు
మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు

ఉత్తరాయణ పుణ్యకాలాన్ని తెచ్చే.. మకర సంక్రమణం
జనులందరికీ వెలుగునిచ్చె నిలువెచ్చని.. రవికిరణం
భోగభాగ్యాల భోగి.. సంతోషాల సంక్రాంతి..
సుఖసంతోషాలను తీసుకురావాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి-సంక్రాంతి శుభాకాంక్షలు!

ఈ భోగి పండుగ మీకు భోగభాగ్యాలను అందించాలి 
మీ కష్టాలన్నీ దహించి వేయాలని కోరుకుంటూ..
మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు. 

Published at : 13 Jan 2023 07:13 AM (IST) Tags: Bhogi Wishes in Telugu Bhogi Subhakankshalu Sankranti Wishes Sankranti wishes in Telugu Bhogi 2023 Sankranti 2023 Happy Bhogi 2023 Happy Sankranti 2023

సంబంధిత కథనాలు

మూడు రొట్టెలు ఒకేసారి వడ్డిస్తున్నారా? అయితే, మీకు ఈ విషయం తెలియదేమో!

మూడు రొట్టెలు ఒకేసారి వడ్డిస్తున్నారా? అయితే, మీకు ఈ విషయం తెలియదేమో!

K. Viswanath: సీతారాముల కళ్యాణంలో వితంతు వివాహం - ‘స్వాతిముత్యం’లో విశ్వనాథ్ సాహసం

K. Viswanath: సీతారాముల కళ్యాణంలో వితంతు వివాహం - ‘స్వాతిముత్యం’లో విశ్వనాథ్ సాహసం

K. Viswanath: నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన - కళాతపస్వి సినిమాలు సర్వం శివమయం

K. Viswanath: నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన - కళాతపస్వి సినిమాలు సర్వం శివమయం

K. Viswanath: భక్తిలో అయినా ప్రేమలో అయినా తన్మయత్వం ఒకటే -విశ్వనాథ్ సినిమాలో ఈ ఒక్క పాట చాలు

K. Viswanath: భక్తిలో అయినా ప్రేమలో అయినా తన్మయత్వం ఒకటే -విశ్వనాథ్ సినిమాలో ఈ ఒక్క పాట చాలు

Love Horoscope Today 03 February 2023: ఈ రాశివారు తమకన్నా పెద్దవారి పట్ల ఆకర్షితులవుతారు

Love Horoscope Today 03 February 2023: ఈ రాశివారు తమకన్నా పెద్దవారి పట్ల ఆకర్షితులవుతారు

టాప్ స్టోరీస్

YS Viveka Murder case CBI: వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు - వారిద్దరిపై ఆరున్నర గంటల పాటు ప్రశ్నల వర్షం !

YS Viveka Murder case CBI: వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు - వారిద్దరిపై ఆరున్నర గంటల పాటు ప్రశ్నల వర్షం  !

Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!

Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!

MLAs Poaching Case : ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐకా ? సిట్ కా ? సోమవారం తీర్పు చెప్పనున్న హైకోర్టు !

MLAs Poaching Case : ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐకా ? సిట్ కా ? సోమవారం తీర్పు చెప్పనున్న హైకోర్టు !

Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్

Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్