News
News
X

Guppedanta Manasu January 13th Update: మళ్లీ కొత్తగా మొదలైన రిషిధార ప్రేమ ప్రయాణం, రొమాంటిక్ ఊహల్లో రిషి

Guppedantha Manasu January 13th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

FOLLOW US: 
Share:

గుప్పెడంతమనసు జనవరి 13 శుక్రవారం ఎపిసోడ్ (Guppedanta Manasu January 13th Update)

ఎప్పటిలా వసుధారపై ఆభాండాలు వేస్తున్న చక్రపాణిని చూసి వసుధార బాధగా ఉండిపోతుంది. తల్లి సుమిత్ర కూడా ఏమీ మాట్లాడలేకపోతుంది... రాజీవ్ మాత్రం మురిసిపోతుంటాడు..ఏంటి మావయ్యా నన్ను మరీ పొగిడేస్తున్నారని దగ్గరకు వెళతాడు. ఎవ్వరూ ఊహించని విధంగా లాగిపెట్టి కొడతాడు వసుధార తండ్రి చక్రపాణి... అక్కడున్న వారంతా షాక్ అవుతారు..
చక్రపాణి: వీడు నయవంచకుడు..వీడి మాటలు అబద్ధం..వీడు చెప్పేవి ఏవీ నిజాలు కాదు..వీడే నా భార్యను పొడిచింది
సుమిత్ర: వీడే సార్..వసుధారకి తెలియకుండా నన్ను పొడిచాడు..వీడు దుర్మార్గుడు సార్..మంచివాడు కాదు..
చక్రపాణి: నా కళ్లతో నేను చూశాను సార్ వీడునా భార్యను పొడవడం..
వసుధార: అవును సార్ నన్ను చాలాసార్లు ఇబ్బంది పెట్టాడు..కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడు..
ఇంకా చక్రపాణి ఏవేవో చెబుతుంటాడు..రాజీవ్ మాత్రం అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడు...  పోలీసులు వెంటపడతారు..
వసుధార తండ్రివైపు కృతజ్ఞతాపూర్వకంగా చూస్తుంది...
వసుధార: నాన్నా...
చక్రపాణి: కూతుర్ని దగ్గరకు తీసుకుంటాడు...సుమిత్ర సంతోషిస్తుంది..

Also Read: భోగిమంటపై నీళ్లు పోసేసిన మోనిత, షాక్ అయిన దీప-కార్తీక్ -సౌందర్య

రిషి రూమ్ కి వచ్చేసరికి..వసుధార రూమ్ సర్దుతూ కనిపిస్తుంది. ఈ రిషి సార్ కి ఎన్నిసార్లు చెప్పినా ఇంతే.. రూమ్ ని అస్సలు పట్టించుకోరు అనుకుంటుంది.. రిషి సార్ కి నేను ఇవన్నీ చేయడం నచ్చదు కానీ నేను కాకుండా ఇంకెవరు చేస్తారు మీ రూమ్ లోకి వచ్చే అధికారం నాకు తప్ప ఇంకెవరికి ఉంటుంది  అనుకుంటుంది..ఇంతలో రిషి వచ్చి ..నువ్వేంటి ఇక్కడ అనగానే..సార్ అది అని అడుగు ముందుకేసి కార్పెట్ తన్నుకుని జారిపడుతుంటే రిషి పట్టుకుంటాడు. నువ్వెందుకు వచ్చావ్..నన్ను బాధపెట్టడానికా..ఒకసారి చెబితే అర్థంకాదా..నిన్నే అనేసి..మళ్లీ వాస్తవంలోకి వస్తాడు ...
రిషి: నాకెందుకు ఈ బాధ..దీనికి అంతం లేదా..నన్ను ఎందుకు శిక్షిస్తున్నావ్..నేను ఏం తప్పు చేశాను అనుకుంటాడు.. టేబుల్ పక్కనున్న నెమలీక చూసి..గతంలో వసుధార అన్నమాటలు గుర్తుచేసుకుంటాడు...అది కోపంగా విసిరేస్తాడు.. అది మళ్లీ గాలికి ఎగిరివచ్చి రిషి గుండెపై పడుతుంది...నన్ను నువ్వు దూరం చేసుకున్నావు కానీ నీ జ్ఞాపకాలు దూరం చేసుకునేందుకు ఎన్నాళ్లు పడుతుందో..అందమైన జ్ఞాపకాలతో ఊపిరిపోశావు..నువ్వే ఉసురు తీస్తున్నావు అనుకుంటాడు...

Also Read: కళ్లముందు నుంచి వెళ్లిపో వసుధార అంటూ రిషి పూనకం, మళ్లీ మొదటికొచ్చిన టామ్ అండ్ జెర్రీ ప్రేమకథ

మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి జగతి మాట్లాడుతుంటుంది...ఆ ప్లేస్ లో వసుధార ఉన్నట్టు ఊహించుకున్న రిషి.. వసుధార ఆగిపోయావేంటి మాట్లాడు..ఏంటి వసుధార చెప్పడం ఆపేశావేంటి అంటాడు..అంతా షాక్ అయి చూస్తుంటారు.. ఫణీంద్ర మాట్లాడుతూ..ఇక్కడ వసుధార లేదుకదా అనడంతో రిషి వాస్తవంలోకి వస్తాడు..జగతి కంటిన్యూ చేస్తుంది.. రిషి ఇబ్బందిగా కూర్చుంటాడు...మళ్లీ వసుధార మాట్లాడుతున్నట్టు భావించి సూపర్ వసుధారా ఎక్సలంట్ ఐడియా అని చప్పట్లు కొడతాడు. ఈ మధ్య వసుధార జపం చేస్తున్నాడు రిషి సార్ కి ఏమైందని అక్కడున్నవారంతా కామెంట్ చేస్తారు.. sorry చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి... జగతి-మహేంద్ర-ఫణీంద్ర బాధపడతారు..స్టాఫ్ మొత్తం ముసిముసినవ్వులు నవ్వుకుంటారు..

హాస్పిటల్లో తల్లిదండ్రులకు సేవ చేస్తుంటుంది వసుధార.. చక్రపాణి కన్నీళ్లు పెట్టుకుంటాడు..
వసుధార: నాన్నా ఎందుకు ఏడుస్తున్నారు..
చక్రపాణి: నా అహంకారం కరిగి నీళ్లలా నానుంచి వేరైపోతున్నాయి..ఇవి కన్నీళ్లు కాదు..పోనీయమ్మా..మొత్తం పోనీ..మగాడిని అన్న పురుష అహంకారం ఇంటికి పెద్దవాడిని అన్న తలబిరుసుతనం నాదే చెల్లాలన్న అహంభావం..నా మొరటుతనం, మొండితనం నరనరాల్లో నిండిపోయిందమ్మా ఇన్నాళ్లూ..పోనీ..అవన్నీ కన్నీళ్ల రూపంలో పోనీ  అని వసుధారని అన్న మాటలన్నీ గుర్తుచేసుకుంటాడు...నిన్ను ఎంత హింస పెట్టానమ్మా..ఎంత చిత్రవధ చేశాను.. పరువు అనుకుంటూ నా కళ్లకు పొరలు కమ్మిపోయాయి. ఆ రాజీవ్ నా కళ్లముందు ముసుగేసుకుని తిరుగుతుంటే నేను తెలుసుకోలేకపోయాను.. నన్ను క్షమించు. రాజుని చూసి రాక్షసుడు అనుకున్నాను... రాక్షసుడిని చూసి రాజు అనుకున్నాను..అమ్మా..నన్ను క్షమించగలవా.. మా అమ్మవి అని ఎమోషన్ అవుతాడు..నేను నాన్నని కాదు నువ్వే నా అమ్మవి... నేను ఎన్నిమాటలన్నా నువ్వు భరించావు..ఇంత సహనం అమ్మకు మాత్రమే సాధ్యం తల్లీ..అమ్మా తల్లీ..నన్ను క్షమించగలవా
వసుధార: ఏంటి నాన్న ఈ మాటలు..నేను నిన్ను క్షమించడం ఏంటి..
చక్రపాణి: ఎన్నితప్పులు చేసినా బిడ్డల్ని తల్లిమాత్రమే క్షమించగలదు..బంధాలని కలపని పరువుకోసం నేను తాపత్రయపడ్డాను..చదువులో నువ్వు గెలిచావు..ఇక నీ ప్రేమను గెలిపించుకో..రిషి సార్ ని కలుసుకో అమ్మా...
వసుధార: కలుస్తాను నాన్నా..
చక్రపాణి: రిషి సార్ ఫోన్ వస్తుందని నీ ఫోన్ పగులగొట్టాను..ఇప్పుడు నేనే చెబుతున్నాను ఇదిగో నా ఫోన్.. రిషి సార్ కి ఫోన్ చేసి మాట్లాడమ్మా..రిషి సార్ తో మాట్లాడమ్మా...అని ఫోన్ ఇస్తాడు...
సుమిత్ర - చక్రపాణి: అల్లుడిని పోలీసులు పట్టుకున్నారా అనగానే..వాడిని అల్లుడు అనకు..ఆ దుర్గార్ముడి ప్రస్తావన నా దగ్గర తీసుకురావొద్దు...అమ్మా వసు వాడిమాయలో నేను పడిపోయాను..నీ భవిష్యత్ గురించి పట్టించుకోలేదు..వెళ్లు రిషి సార్ తో మాట్లాడు...

రిషి ఒంటరిగా క్లాస్ రూమ్ కి వెళ్లి కూర్చుని.. వసుధారను గుర్తుచేసుకుంటాడు.. ఏంటి పొగరు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావ్ నీకిది న్యాయమా..ప్రతిక్షణం నీ జ్ఞాపకాలే..ఏంటీ మాయ అనుకుంటాడు..అటు హాస్పిటల్లో వసుధార రిషి ఫొటో చూస్తూ మాట్లాడుకుంటుంది..మీరు వచ్చారు వెళ్లారు ప్రతిక్షణం మీ జ్ఞాపకాలే అనుకుంటుంది...

Published at : 13 Jan 2023 09:42 AM (IST) Tags: Guppedanta Manasu Serial Guppedanta Manasu Serial Today Episode Guppedanta Manasu Serial Written Update Guppedanta Manasu Serial January 13th Episode

సంబంధిత కథనాలు

Salim Khan Marriage: పెళ్లి కోసం పేరు మార్చుకున్న సల్మాన్ తండ్రి, సలీం ఖాన్ శంకర్ గా ఎలా మారారో తెలుసా?

Salim Khan Marriage: పెళ్లి కోసం పేరు మార్చుకున్న సల్మాన్ తండ్రి, సలీం ఖాన్ శంకర్ గా ఎలా మారారో తెలుసా?

Satyadeep Misra Marriage: రహస్యం ఏమీ లేదు, అందరికీ చెప్పే మసాబాను పెళ్లి చేసుకున్నా- సత్యదీప్ మిశ్రా

Satyadeep Misra Marriage: రహస్యం ఏమీ లేదు, అందరికీ చెప్పే మసాబాను పెళ్లి చేసుకున్నా- సత్యదీప్ మిశ్రా

Sidharth Kiara Advani Wedding: సిద్ధార్థ్-కియారా పెళ్లికి వెళ్లే గెస్టులకు ఓ కండీషన్, దయచేసి ఆపని చెయ్యొద్దని కోరిన కొత్త జంట!

Sidharth Kiara Advani Wedding: సిద్ధార్థ్-కియారా పెళ్లికి వెళ్లే గెస్టులకు ఓ కండీషన్, దయచేసి ఆపని చెయ్యొద్దని కోరిన కొత్త జంట!

Vani Jayaram Death Mystery : రక్తపు మడుగులో వాణీ జయరామ్ - మిస్టరీగా లెజండరీ సింగర్ మృతి

Vani Jayaram Death Mystery : రక్తపు మడుగులో వాణీ జయరామ్ - మిస్టరీగా లెజండరీ సింగర్ మృతి

Singer Vani Jayaram Death : లెజండరీ సింగర్ వాణీ జయరామ్ మృతి - రెండు  నేషనల్ అవార్డులు విశ్వనాథ్ సినిమాల్లో పాటలకే

Singer Vani Jayaram Death : లెజండరీ సింగర్ వాణీ జయరామ్ మృతి - రెండు  నేషనల్ అవార్డులు విశ్వనాథ్ సినిమాల్లో పాటలకే

టాప్ స్టోరీస్

CM KCR Nanded Tour: నేడే నాందేడ్‌లో BRS సభ, సీఎం కేసీఆర్‌ టూర్ పూర్తి షెడ్యూల్‌ ఇదీ

CM KCR Nanded Tour: నేడే నాందేడ్‌లో BRS సభ, సీఎం కేసీఆర్‌ టూర్ పూర్తి షెడ్యూల్‌ ఇదీ

Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!

Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!

Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్‌ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా

Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్‌ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా

Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన

Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన