News
News
X

Karthika Deepam December 6th Update: కార్తీక్ దగ్గర నిజం దాచిన డాక్టర్ చారుశీల, సౌందర్య దగ్గరకు బయలుదేరిన దీప-కార్తీక్

కార్తీకదీపం డిసెంబరు 6 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

FOLLOW US: 
Share:

Karthika Deepam  December 6rd  Episode 1527 (కార్తీకదీపం డిసెంబరు 6 ఎపిసోడ్)

కార్తీక్ ఇంటికి వెళ్లడంతో అక్కడికు శివలత వచ్చి  మోనిత అరెస్ట్ విషయం చెబుతుంది. మోనిత మేడం రివాల్వర్ తీసుకెళుతుండగా అప్పుడు ఓ పెద్దమేడం, ఓ పోలీస్ ఆఫీసర్ వచ్చారంటుంది. ఎవరా పెద్దావిడ అంటే.. తెలియదు కానీ ఆవిడ చాలా అందంగా ఉన్నారంటుంది. శివలత చెప్పింది విని కార్తీక్ ఆశ్చర్యపోతాడు. 
కార్తీక్-శివలత: రోషిని మేడం వచ్చారని గుర్తుచేసుకున్న కార్తీక్..రోషిని మేడమా అని అడిగితే అవునని చెబుతుంది. తీసుకొచ్చిన ఆవిడ పేరు సౌందర్యనా అంటే..పేరు తెలియదు సార్..ఆవిడ ఇంతకుముందు కూడా ఇక్కడకు వచ్చారు..మోనిత మేడం ఆవిడను ఆంటీ అని పిలిచేవారు అని చెబుతుంది. సౌందర్య ఫొటో చూపించి ఈవిడేనా అని అడిగితే అవునంటుంది శివలత. మేం ఇక్కడే ఉన్నట్టు మమ్మీకి తెలుసా..తెలిస్తే వచ్చినా ఎందుకు వెళ్లిపోతుంది... అంటే అప్పుడు తాళం పగులగొడుతుండగా బయట బ్లడ్ కనిపించింది అది మమ్మీదేనా... ఎంతపని చేశావ్ మోనిత అనుకుంటాడు... నిజం చెప్పి వెళ్లిపోదాం అనుకున్నాను ఇక ఆ అవసరమే లేకుండా పోయిందనుకుంటాడు. బట్టలు తీసుకెళదాం అని వచ్చానని కార్తీక్ చెబితే... అవన్నీ మోనిత కాల్చేసిందని చెబుతుంది శివలత.. సరేలే అని కార్తీక్ వెళ్లిపోతుండగా.. మేడంని ఎప్పుడు బయటకు తీసుకొస్తారని అడిగితే.. బయట ఉండడం అందరకీ స్వేచ్ఛ కానీ..ఆవిడకు ఆయుధం..ఆమె అక్కడే ఉండడం మంచిదంటాడు కార్తీక్. 

Also Read: ఇగో మాస్టర్ నిజంగా జెంటిల్మెన్, గౌతమ్ కి థాంక్స్ చెప్పిన రిషి - వసుధారని ఇరికించేందుకు చూసిన దేవయాని

దీప-కార్తీక్ దీపతో మాట్లాడిన డాక్టర్.. మరో రెండు రోజుల్లో డిశ్సార్జ్ చేస్తాం అని చెబుతుంది. ఇంతలో ఎంటరైన కార్తీక్.. ఇవాళ సాయంత్రమే డిశ్సార్జ్ చేయండని అంటాడు. ప్రికాషన్స్ కోసం కొన్ని టెస్టులు చేశాం అవి రిపోర్ట్స్ రాగానే వెంటనే డిశ్చార్జ్ చేస్తాము అని అంటుంది  డాక్టర్. ఆ డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే వెంటనే దీప ఆ డాక్టర్ కి నా ముఖంలో ఆనందం గురించి అసలు కారణం తెలియదంటుంది. ఏంటని కార్తీక్ అడిగితే..మీరు ఆ మోనిత దగ్గరికి వెళ్లి కూడా తిరిగి వచ్చారు కదా అందుకు అని రిప్లై ఇస్తుంది. ఇప్పుడు కార్తీక్..మోనితను అరెస్ట్ చేసిన విషయం చెబుతాడు. సౌందర్య వచ్చిన విషయం కూడా చెప్పడంతో దీప ఆనందపడుతుంది. మరి శౌర్యని వెతక్కుండానే వెళ్లిపోయారా అని వరుస ప్రశ్నలు వేస్తుంది. అమ్మ నాన్నలను కలిస్తే ఈ డౌట్లు మొత్తం తీరిపోతాయి అంటాడు కార్తీక్. ఆ తర్వాత డాక్టర్ దీప రిపోర్ట్స్ రావడంతో అవి చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. 

Also Read: మోనిత అరెస్ట్ సంగతి తెలుసుకున్న కార్తీక్- దీప రిపోర్ట్స్ చూసి షాకైన డాక్టర్

శౌర్య,ఇంద్రుడు వాళ్ళు భోజనం చేస్తూ ఉండగా అప్పుడు ఇంద్రుడు శౌర్య పరిస్థితి చూసి బాధపడతాడు. త్వరలో నీ కష్టాలు తీరిపోతాయి నిన్ను మీ ఇంటికి చేరుస్తానంటాడు. శౌర్య సంతోషంగా ఫీలవుతుంది. మరొకవైపు దీప వాళ్ళు ఉండటం కోసం డాక్టర్ చారుశీల ఒక ఇంటిని చూపిస్తుంది. నన్ను డాక్టరమ్మ అని పిలవొద్దు..చారుశీల అని పిలువు అని ఆమె అంటే..హాస్పిటల్లో ఫస్ట్ టైమ్ చూసినప్పుడు నాక్కూడా అలాగే అనిపించింది..అక్కా అనే పిలవు అంటుంది.  అప్పుడు దీప గతం గురించి మాట్లాడగా నువ్వు గతం గురించి మాట్లాడకు దీప నువ్వు ఎంత మాట్లాడకుంటే అంత మంచిది అంత ప్రశాంతంగా ఉండొచ్చు అని అంటాడు కార్తీక్. అప్పుడు డాక్టర్ ఈ సంతోషం దీప  వాళ్ళకి ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు ఆ రిపోర్ట్స్ గురించి ఎలా చెప్పాలో అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో రిపోర్ట్స్ వచ్చాయా అని కార్తీక్ అడిగితే లేదని అబద్ధం చెబుతుంది చారుశీల. ఆ తర్వాత కార్తీక్ దీప ఇద్దరు శౌర్యను వెతకడానికి వెళ్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంద్రుడు మన శౌర్యని బాగానే చూసుకుంటున్నాడు కదా అని అంటే..అవును డాక్టర్ బాబు మొన్న కూడా ఫంక్షన్ బాగా గ్రాండ్ గా చేశారు అందుకే మనకు ఇవ్వడానికి ఇష్టపడటం లేదంటుంది. అప్పుడు దీప కార్తీక్ ఇద్దరు సౌందర్య వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు. హిమను చూసి చాలా రోజులైంది వెళ్దాం అని ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తానంటే.. కార్లో వెళదాం అంటుంది.. ఇదే ఆఖరి కోరిక అనుకోండి అంటుంది...కార్తీక్ సీరియస్ అవుతాడు.. సరే చారుశీల కార్లో వెళదాం అంటాడు.... 

Published at : 06 Dec 2022 09:48 AM (IST) Tags: Karthika Deepam Serial karthika Deepam Serial Today Episode Karthika Deepam Serial Written Update Karthika Deepam Episode Karthika Deepam Serial December 6th update

సంబంధిత కథనాలు

Kalyan Ram in Suma Adda: హీరోయిన్ ను పక్కనబెట్టి యాంకర్ సుమకు ప్రపోజ్ చేసిన కళ్యాణ్ రామ్!

Kalyan Ram in Suma Adda: హీరోయిన్ ను పక్కనబెట్టి యాంకర్ సుమకు ప్రపోజ్ చేసిన కళ్యాణ్ రామ్!

Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!

Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!

Unstoppable 2: నర్సుపై వివాదాస్పద కామెంట్స్, క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ

Unstoppable 2: నర్సుపై వివాదాస్పద కామెంట్స్, క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ

Madhavan Audition Clip: ‘3 ఇడియట్స్’ సినిమా కోసం మాధవన్ చేసిన ఆడిషన్ వీడియో చూశారా?

Madhavan Audition Clip: ‘3 ఇడియట్స్’ సినిమా కోసం మాధవన్ చేసిన ఆడిషన్ వీడియో చూశారా?

‘రైటర్ పద్మభూషణ్’ మూవీపై మహేష్ బాబు ట్వీట్ - సుహాస్ భావోద్వేగం!

‘రైటర్ పద్మభూషణ్’ మూవీపై మహేష్ బాబు ట్వీట్ - సుహాస్ భావోద్వేగం!

టాప్ స్టోరీస్

Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!

Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!

Love Marriage : సరిహద్దులు లేని ప్రేమ - ఆదిలాబాద్ అబ్బాయితో మయన్మార్ అమ్మాయికి పెళ్లి

Love Marriage : సరిహద్దులు లేని ప్రేమ - ఆదిలాబాద్ అబ్బాయితో మయన్మార్ అమ్మాయికి పెళ్లి

Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసిన మాజీ భారత ఆటగాళ్లు వీరే - లిస్ట్‌లో ఐదుగురు!

Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసిన మాజీ భారత ఆటగాళ్లు వీరే - లిస్ట్‌లో ఐదుగురు!

Majilis Congress : మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?

Majilis Congress :  మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ -  వర్కవుట్ అవుతుందా ?