News
News
X

Guppedantha Manasu December 5th: ఇగో మాస్టర్ నిజంగా జెంటిల్మెన్, గౌతమ్ కి థాంక్స్ చెప్పిన రిషి - వసుధారని ఇరికించేందుకు చూసిన దేవయాని

Guppedantha Manasu December 5th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

FOLLOW US: 
Share:

రిషి గౌతమ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తనతో ఉన్న జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉండగా వసు కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. రిషి సర్ కోపం పోయి ఉంటుందా అని వసు మనసులో అనుకుంటుంది. రిషి తనని చూసి ఏంటని అడుగుతాడు. గౌతమ్ బాధగా బ్యాగ్ సర్దుకుని అమెరికా వెళ్లిపోతున్నా అని ఫోన్ లో మహేంద్రతో చెప్తాడు. వద్దని మహేంద్ర చెప్పినా కూడా గౌతమ్ బాధపడతాడు. మిమ్మల్ని నా ఫ్లాట్ లో ఉంచినందుకు వాడు నాతో ఇక మాట్లాడడు, అందుకే వెళ్లిపోతున్న అని చెప్తాడు. రిషి తనని అసహ్యించుకుంటున్నాడు, మోసాగాడిలా చూస్తున్నాడు, నిజం దాచిపెట్టి వాడిని మోసం చేశాను కదా అందుకే దూరంగా వెళ్తున్నా అని గౌతమ్ చెప్తాడు. అది మోసం కాదు మాకు సాయం అని మహేంద్ర చెప్పినా కూడా గౌతమ్ మాత్రం వినకుండా వెళ్లిపోతాను అనేసి ఫోన్ పెట్టేస్తాడు.

బ్యాగులు తీసుకుని గది నుంచి బయటకి రాగానే ఎదురుగా రిషి, వసుధార ఉంటారు. ఎక్కడికో బయల్దేరావ్ ఎక్కడికి అని రిషి అడుగుతాడు. అమెరికాకు వెళ్తున్నావా అంటాడు.

రిషి: నాకు చెప్పకుండా ఎలా వెళ్తావ్ ఇదేనా నా మీద నీకున్న ప్రేమ, ఇదేనా ఫ్రెండ్షిప్ అంటే.. నేను నీకు ఏమీ కానా అని గౌతమ్ ని హగ్ చేసుకుంటాడు

గౌతమ్: హ్యపీగా ఉంటాడు.. నిజాన్ని దాచిపెట్టి ఎంత బాధపడ్డానో అని మాట్లాడబోతుంటే

Also Read: మోనిత అరెస్ట్ సంగతి తెలుసుకున్న కార్తీక్- దీప రిపోర్ట్స్ చూసి షాకైన డాక్టర్

రిషి: నాకేమీ చెప్పొద్దు నాకు కోపం ఎంతో అంతకి వందరెట్లు ప్రేమ ఉంటుంది. డాడ్ వాళ్ళు నీదగ్గర కాకుండా వేరే వాళ్ళ దగ్గర ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కదా. నువ్వు వాళ్ళని బాగా చూసుకున్నావని డాడ్ చెప్పారు. నిజం దాచడం తప్పు అందులో కోపం ఉంది కానీ డాడ్ వాళ్ళని బాగా చూసుకున్నందుకు థాంక్స్. సోరి కోపంలో చాలా తిట్టేశాను

మహేంద్ర రిషి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే రిషి, వసులు గౌతమ్ ని తీసుకుని ఇంటికి రావడంతో మహేంద్ర షాక్ అవుతాడు. రిషి గౌతమ్ ఇంట్లో మర్చిపోయిన మహేంద్ర వాచ్ తీసుకొచ్చి పెడతాడు. డాడ్ వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళి గౌతమ్ వాళ్ళ ఫ్లాట్ లో ఉన్నారని రిషి ఇంట్లో అందరికీ చెప్తాడు. ఇదే అవకాశంగా తీసుకున్న దేవయాని మీ ఇంట్లోనే పెట్టుకుని ఇలా చేయడం పద్ధతేనా అని సీరియస్ అవుతుంది. తనని తిట్టబోతుంటే రిషి అడ్డుపడతాడు. డాడ్ వాళ్ళు ఇంకెక్కడో ఉండి ఉంటే ఎంతో కష్టపడే వాళ్ళని అంటాడు. ఏంటి గౌతమ్ ఇది నిజమేనా రిషి చిన్నప్పటి ఫ్రెండ్ వి నిజాన్ని దాచడం తప్పు కదా అని దేవయాని మళ్ళీ తిట్టేందుకు చూస్తుంది.

వసు: మేడమ్ వాళ్ళు గౌతమ్ సర్ దగ్గర ఉండటం మనం సంతోషించాలి

దేవయాని: సంతోషం ఏంటి వీళ్ళు వెళ్లడమే తప్పు నిజాన్ని దాయడం ఇంకా పెద్ద తప్పు

వసు: మేడమ్ వాళ్ళు గౌతమ్ సర్ దగ్గర కాకుండా వేరే చోట ఉంటే క్షేమంగా వచ్చే వాళ్ళు కాదేమో

దేవయాని: అంతా ప్లాన్ చేసుకుని వెళ్లారు, ఈ విషయం నీకు కూడా తెలిసే ఉంటుంది ఎవరికి తెలుసు

Also Read: రొమాంటిక్ గా డాన్స్ చేసిన క్యూట్ కపుల్- యాక్సిడెంట్ గురించి అసలు నిజం తెలుసుకున్న వేద

రిషి: అయిందేదో అయిపోయింది ఇక్కడ మనం చూసుకున్నాం అక్కడ గౌతమ్ చూసుకున్నాడు

దేవయాని: ఏంటో అన్ని పాజిటివ్ గా తీసుకుంటున్నారని అంటుంది. ఇదంతా జగతి ప్లాన్ అయి ఉంటుందని మనసులో అనుకుంటుంది. జగతి దగ్గరకి వెళ్తుంది

జగతి వాటర్ బాటిల్ తీసుకుంటుంటే దేవయాని వచ్చి దాన్ని తీసుకుంటుంది. ఆరోగ్యం బాగుందా అని వెటకారంగా అడుగుతుంది. ఇంట్లో నుంచి వెళ్ళిపోయి గౌతమ్ ఇంట్లో మకాం వేశారు చాలా తెలివిగా చేశారని దేవయాని అంటుంది. ఆ మాట విని జగతి షాక్ అవుతుంది. తెలిసిందిలే అంతా అని వెటకారంగా మాట్లాడుతుంది. మీ టూర్ గురించి వసుధారకి కూడా తెలుసే ఉంటుందని దేవయాని అంటే రిషి ఏమన్నాడని అడుగుతుంది. పెద్ద మనసుతో రిషి గౌతమ్ ని క్షమించేశాడు అని చెప్పేసరికి జగతి సంతోషిస్తుంది.

Published at : 05 Dec 2022 10:18 AM (IST) Tags: Guppedanta Manasu Serial Guppedanta Manasu Serial Today Episode Guppedanta Manasu Serial Written Update Guppedanta Manasu Serial December 5th Episode

సంబంధిత కథనాలు

Kalyan Ram in Suma Adda: హీరోయిన్ ను పక్కనబెట్టి యాంకర్ సుమకు ప్రపోజ్ చేసిన కళ్యాణ్ రామ్!

Kalyan Ram in Suma Adda: హీరోయిన్ ను పక్కనబెట్టి యాంకర్ సుమకు ప్రపోజ్ చేసిన కళ్యాణ్ రామ్!

Janaki Kalaganaledu February 6th: మలయాళం వంటలు తినలేకపారిపోయిన విష్ణు - మల్లికకి దిమ్మతిరిగే సమాధానమిచ్చిన జానకి

Janaki Kalaganaledu February 6th: మలయాళం వంటలు తినలేకపారిపోయిన విష్ణు - మల్లికకి దిమ్మతిరిగే సమాధానమిచ్చిన జానకి

Brahmamudi Serial February 6th: స్వప్నకి కుజదోషం, కనకం నెత్తిన పిడుగు- మళ్ళీ గొడవపడిన రాజ్, కావ్య

Brahmamudi Serial February 6th: స్వప్నకి కుజదోషం, కనకం నెత్తిన పిడుగు- మళ్ళీ గొడవపడిన రాజ్, కావ్య

Guppedanta Manasu February 6th: ఇగో మాస్టర్ వంకర ప్రశ్నలు, పొగరు తిక్క సమాధానాలు- రిషిధారని కలిపేందుకు మహేంద్ర స్కెచ్

Guppedanta Manasu February 6th: ఇగో మాస్టర్ వంకర ప్రశ్నలు, పొగరు తిక్క సమాధానాలు- రిషిధారని కలిపేందుకు మహేంద్ర స్కెచ్

Ennenno Janmalabandham February 6th: చిత్రమీద కన్నేసిన అభిమన్యు, మాళవిక గతి ఇక అథోగతి- విన్నీ పార్టీకి వెళ్తున్న వేద

Ennenno Janmalabandham February 6th: చిత్రమీద కన్నేసిన అభిమన్యు, మాళవిక గతి ఇక అథోగతి- విన్నీ పార్టీకి వెళ్తున్న వేద

టాప్ స్టోరీస్

Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!

Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!

Majilis Congress : మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?

Majilis Congress :  మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ -  వర్కవుట్ అవుతుందా ?

Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!

Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!

Man Marries Triplets: ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు- టైం టేబుల్‌ వేసుకొని భర్తతో కాపురం!

Man Marries Triplets: ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు- టైం టేబుల్‌ వేసుకొని భర్తతో కాపురం!