News
News
X

Karthika Deepam December 5th: మోనిత అరెస్ట్ సంగతి తెలుసుకున్న కార్తీక్- దీప రిపోర్ట్స్ చూసి షాకైన డాక్టర్

కార్తీకదీపం డిసెంబరు 5 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

FOLLOW US: 
Share:

మోనిత హడావుడిగా బోటిక్ కి వస్తుంది. శివలత కంగారుగా వచ్చారా ఎక్కడికి వెళ్లారు అని కంగారుగా అడుగుతుంది. కార్తీక్, దీప వచ్చారా అని మోనిత అడుగుతుంది. రాలేదని చెప్పేసరికి కార్తీక్ కాల్ చేస్తుంది కానీ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తాడు. ఎలా ఉండే వాడివి ఎలా అయిపోయావ్ నీ జీవితంలోకి ఆ వంటలక్క రాకూడదని ఇలా చేశాను కానీ నువ్వు దానితో వెళ్లిపోయావా గతం గుర్తుకు వచ్చిందా అయినా వచ్చినా ఎలా వెళ్లిపోతావ్ నిన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నా నన్ను వదిలేసి వెళ్లిపోయావా అని బాధపడుతుంది. తర్వాత ఇంట్లోకి వెళ్ళి గన్, బ్యాగ్ పట్టుకుని బయటకి వెళ్లబోతుంటే శివలత ఆపుతుంది. కార్తీక్ లేకుండా ఉండలేను వెళ్ళి తేల్చుకుంటాను అని వెళ్లబోతుంటే ఎదురుగా సౌందర్య ఉంటుంది.

మోనిత: నా వెనుక ఎందుకు పడుతున్నారు ఆంటీ మీకు వేరే పని లేదా

సౌందర్య: ఎక్కడికి వెళ్తున్నావ్ మళ్ళీ ఎవరిని చంపడానికి వెళ్తున్నావ్

మోనిత: సౌందర్య తలకి గన్ పెట్టి ముందు మిమ్మల్ని చంపుతాను తర్వాత వేరే వాళ్ళని చంపుతాను నా సంగతి తెలిసి కూడా ఎందుకు నా వెంట పడుతున్నారు తెలిసి కూడా తప్పు చెయ్యొద్దు. అసలు ఏమనుకుంటున్నారు నా గురించి మిమ్మల్ని చూడగానే చేతులు కట్టుకుని ఒక మూలన పడి ఉంటాను అనుకున్నారా, మీరు పోవాల్సిందే అని గన్ పెట్టగానే సౌందర్య పక్కకి తప్పుకుంటుంది.

Also Read: రొమాంటిక్ గా డాన్స్ చేసిన క్యూట్ కపుల్- యాక్సిడెంట్ గురించి అసలు నిజం తెలుసుకున్న వేద

తన వెనుక పోలీస్ అధికారి రోషిణి ఉంటుంది. పెరోల్ అయిపోగానే జైలుకి రాకుండా మళ్ళీ ఇక్కడ రౌడీ వేషాలు వేస్తున్నావా అని మోనిత చేతిలో గన్ తీసుకుని అసలు ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని అడుగుతుంది. మోనిత ఏం లేదు బోటిక్ వ్యాపారం చేస్తున్నా అని చెప్తుంది. కానీ సౌందర్య మాత్రం ఏదో దాస్తుంది, మొన్న ఇంటికి వస్తే నా తల పగలగొట్టింది, ఇప్పుడు కూడా ఎవరినో చంపడానికి వెళ్తుందని అంటుంది. ఇంకా కార్తీక్ ని మర్చిపోలేదా అని రోషిణి అడుగుతుంది. ఆనంద్ ఎక్కడ అని సౌందర్య మోనితని అడుగుతుంది. కానీ చెప్పనని అంటుంది. మీ దగ్గర వాడు ఉంటే తల్లి గురించి చెడుగా చెప్పి నన్ను ఒక రాక్షసిని చేసి చూపిస్తారని మోనిత అంటుంది. రోషిణి మోనితని అరెస్ట్ చేయించి తీసుకెళ్తుంటే అప్పుడే కథ అయిపోలేదు ప్రేమ చావదు, కథ చావదు మళ్ళీ తిరిగి వస్తాను అని సౌందర్యకి వార్నింగ్ ఇస్తుంది.

కార్తీక్ దీపని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఏ ఆనందం తనతో ఎక్కువ కాలం నిలబడటం లేదని దీప బాధపడుతుంటే కార్తీక్ ధైర్యం చెప్పడానికి చూస్తాడు. కార్తీక్ మోనిత దగ్గరకి వెళ్ళి వస్తానని చెప్తాడు. వద్దని దీప చెప్తుంది కానీ కార్తీక్ మాత్రం వెంటనే వచ్చేస్తాను అని జాగ్రత్త చెప్పి వెళ్తాడు. సౌందర్య మోనితని అరెస్ట్ చేయించిన విషయం ఆనందరావుకి చెప్తుంది. శౌర్య ఇంటికి ఎందుకు రానని అంటుందో అని ఆలోచిస్తూ ఉంటారు. డాక్టర్ కార్తీక్, దీప గురించి నర్స్ ని అడుగుతుంది. బయట ఉన్న దీపని చూసి కార్తీక్ ఈమె ఎలా భార్యభర్తలు అయ్యారని ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళ సంగతి ఏంటో అడిగి తెలుసుకుందామని అనుకుంటుంది. కార్తీక్ బోటిక్ దగ్గరకి వెళ్ళగానే మోనితని అరెస్ట్ చేసి తీసుకెళ్లారని శివలత చెప్తుంది.

Also Read: మోనిత అరెస్ట్, వంటలక్క సేవలో డాక్టర్ బాబు,మరి శౌర్య పరిస్థితేంటి!

తరువాయి భాగంలో..

కార్తీక్ సంతోషంగా బ్యాగ్ పట్టుకుని దీప దగ్గరకి వస్తాడు. అక్కడి డాక్టర్ దీపతో మాట్లాడుతూ ఉంటుంది. డిశ్చార్జ్ చెయ్యమని కార్తీక్ అంటే కొన్ని టెస్ట్ లు చేశామని రిపోర్ట్ రాగానే పరిస్థితి చూసి డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ చెప్తుంది. తర్వాత నర్స్ దీప రిపోర్ట్ తెచ్చి డాక్టర్ కి ఇవ్వగానే వాటిని చూసి షాక్ అవుతుంది. ఈ విషయం కార్తీక్ చెప్తే తట్టుకోలేడని అనుకుంటుంది.

Published at : 05 Dec 2022 09:27 AM (IST) Tags: Karthika Deepam Serial karthika Deepam Serial Today Episode Karthika Deepam Serial Written Update Karthika Deepam Episode Karthika Deepam Serial December 5th update

సంబంధిత కథనాలు

జపాన్‌లో ‘బాహుబలి-2’ రి-రిలీజ్‌కు సన్నహాలు?

జపాన్‌లో ‘బాహుబలి-2’ రి-రిలీజ్‌కు సన్నహాలు?

Keeravani: ఆస్కార్ వేదికపై కీరవాణి ‘నాటు నాటు’ పాట లైవ్ షో!

Keeravani: ఆస్కార్ వేదికపై కీరవాణి ‘నాటు నాటు’ పాట లైవ్ షో!

Prabhas Health : జ్వరంతో బాధ పడుతున్న ప్రభాస్ - అందుకే

Prabhas Health : జ్వరంతో బాధ పడుతున్న ప్రభాస్ - అందుకే

Waltair Veerayya OTT Release: ‘వాల్తేరు వీరయ్య’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్, స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Waltair Veerayya OTT Release: ‘వాల్తేరు వీరయ్య’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్, స్ట్రీమింగ్ ఎక్కడంటే?

NTR30 Movie Story : ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా బ్యాక్‌డ్రాప్ అదేనా?

NTR30 Movie Story : ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా బ్యాక్‌డ్రాప్ అదేనా?

టాప్ స్టోరీస్

ఆదాల ఆట మొదలైందా- కోటంరెడ్డి ఇక ఒంటరేనా?

ఆదాల ఆట మొదలైందా- కోటంరెడ్డి ఇక ఒంటరేనా?

Mancherial Crime: మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ భార్య ఆత్మహత్య కలకలం!

Mancherial Crime: మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ భార్య ఆత్మహత్య కలకలం!

Turkey Earthquake:టర్కీలో 145సార్లకుపైగా భూప్రకంపనలు - వారాల పాటు కొనసాగే అవకాశం!

Turkey Earthquake:టర్కీలో 145సార్లకుపైగా భూప్రకంపనలు - వారాల పాటు కొనసాగే అవకాశం!

PSPK - Unstoppable 2 : 'అన్‌స్టాపబుల్ 2' ఫైనల్‌కు పవర్ టచ్ - సూసైడ్, డిప్రెషన్‌పై పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్!

PSPK - Unstoppable 2 : 'అన్‌స్టాపబుల్ 2' ఫైనల్‌కు పవర్ టచ్ - సూసైడ్, డిప్రెషన్‌పై పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్!