News
News
X

Karthika Deepam December 3rd Update: మోనిత అరెస్ట్, వంటలక్క సేవలో డాక్టర్ బాబు,మరి శౌర్య పరిస్థితేంటి!

కార్తీకదీపం డిసెంబరు 3 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

FOLLOW US: 
Share:

Karthika Deepam  December 3rd  Episode 1526 (కార్తీకదీపం డిసెంబరు 3 ఎపిసోడ్)

శౌర్యని వెతకడానికి వెళ్తానని దీప మొండిపట్టు పట్టడంతో కార్తీక్, దీప ఇద్దరూ ఆపుతారు. దీప వినకపోవడంతో ఆ డాక్టర్ దీప షటాప్ అని గట్టిగా అరుస్తుంది. 
డాక్టర్: ఇందాక నుంచి వెళ్తాను అంటున్నావు ఆయన ఇక్కడ ఎందుకు ఉన్నారో నీకు తెలుసా అని అనగా వెంటనే కార్తీక్ చెప్పొద్దు అంటూ సైగ చేస్తాడు. 
దీప: ఎందుకు ఉన్నారు ఆయన ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి? ఆయన నాకేమైనా ఆపరేషన్ చేశారా 
డాక్టర్: ఆపు..కూతురు కోసం వెళ్లమని చెబుతున్నావు నిన్ను ఎలా వదిలేసి ఎలా వెళ్తాడు అయినా ఆయన నీకోసం ఎంత తాపత్రయపడుతున్నాడో నీకు ఏమవుతుందని ఎంత బాధ పడుతున్నాడో తెలుసా అని అంటుంది. ఏమన్నావ్ ఆయన నీకేమైనా ఆపరేషన్ చేశారా అన్నావు కదా అవును ఆయనే నీకు ఆపరేషన్ చేశారు అని అంటుంది ఆ డాక్టర్. డాక్టర్ కార్తీక్ ఫేమస్ కార్డియాలజిస్ట్ అని అనడంతో దీప ఆశ్చర్య పోతుంది. అవును మీ డాక్టర్ బాబు నీకు ఆపరేషన్ చేశారు అని అంటుంది ఆ డాక్టర్.
దీప: మీకు గతం గుర్తుకొచ్చిందా ..ఇన్నాళ్లూ ఎందుకు చెప్పలేదు..మళ్లీ మోనిత దగ్గరకు వెళ్లొద్దు మనం శౌర్యని తీసుకుని హైదరాబాద్ వెళ్లిపోదాం అంటుంది. నువ్వు మాట్లాడకూడదు అని చెప్పి దీపకు ఇంజెక్షన్ ఇమ్మని చెబుతాడు కార్తీక్. 

Also Read: అర్థరాత్రి వసుతో రిషి రొమాంటిక్ జర్నీ, సమాధానం చెప్పలేక తలొంచుకున్న గౌతమ్
 
మరోవైపు బాబుని తీసుకుని పారిపోయేందుకు ఇదే మంచి సమయం అనుకుని బాబుని తీసుకుని వెళ్లిపోతుండగా హిమ అడ్డుకుంటుంది. నానమ్మ వచ్చాక వెళ్లమని చెబితే..ఇప్పుడే వచ్చేస్తానని చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు గతంలో మోనిత గురించి పోలీసువు మాట్లాడతారు. మళ్లీ మోనితని అరెస్ట్ చేయమని వారెంట్ ఎందుకు ఇచ్చారు... ఇంతకీ మోనిత ఎక్కడుంది. పెరోల్ మీద బయటకు వచ్చి మళ్లీ ఎక్కడికి వెళ్లింది అనుకుంటారు. సౌందర్య దగ్గరకు వెళ్లి అడుగుదాం అంటే కొడుకు,కోడలు పోయిన బాధలో ఉన్నారుకదా అని ఆగిపోయాను అంటుంది రత్నసీత. సాయంత్రానికల్లా మోనిత సమాచారం ఇస్తానని చెబుతుంది. 

మరోవైపు మోనిత క్యాబ్ బుక్ చేసుకుని అక్కడ నుంచి బాబుని తీసుకుని వెళుతూ ఉంటుంది. క్యాబ్ డ్రైవర్ కి ఎక్కువ డబ్బులు ఇచ్చి వీళ్ళందరూ తొందరగా స్పీడ్ గా పోనివ్వు అని చెబుతుంది. ఆనంద్ ని సౌందర్య ఆంటీ వాళ్ల ఇంట్లో ఉంచేస్తే వాడు పెరిగే కొద్దీ నాగురించి చెడుగా చెబుతారు...అందుకే లక్ష్మణ్ దగ్గర వదిలేశాను అనుకుంటుంది. అటు మోనిత కనిపించకపోయేసరికి సౌందర్య టెన్షన్ పడుతూ ఉండగా ఇంతలో హిమ అక్కడికి వచ్చి జరిగింది మొత్తం వివరిస్తుంది. బయటికి పని ఉందని వెళ్ళింది నానమ్మ వస్తుందని ఇంకా బయటే ఎదురుచూస్తున్నాను ఇంకా రాలేదు అని అంటుంది. దాంతో సౌందర్య వాళ్ళు టెన్షన్ పడుతూ శౌర్య చెప్పింది నిజమేమో నిజంగా కార్తీక్ వాళ్ళు బతికున్నారేమో అనుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. 

Also Read: హమ్మయ్య దీప-కార్తీక్ కలసిపోయారు, సౌందర్య ఇంట్లో కోడలిగా మోనిత బిల్డప్

హాస్పిట్లలో కార్తీక్ జ్యూస్ కలుపుతూ ఉండగా అప్పుడు దీప పదేపదే కార్తీక్ ని డాక్టర్ బాబు అని పిలుస్తూ నవ్వుతూ మాట్లాడుతుంది. కాసేపు సరాదాగా మాట్లాడుకుంటారు. 
దీప: మీకు ఎప్పుడు గతం గుర్తుకు వచ్చింది
కార్తీక్: ఆరోజు సంగారెడ్డికి వెళ్ళాం కదా దసరా ఉత్సవాల్లో అప్పుడు గుర్తుకు వచ్చింది 
దీప: మరి ఎందుకు చెప్పలేదు 
కార్తీక్: చెప్పకపోవడానికి కారణం ఆ మోనిత 
దీప: అప్పుడు నాకు చెప్పి ఎవరికీ చెప్పొద్దంటే నేను చెప్పకుండా ఉండేదాన్ని కదా నాకు ఇన్ని రోజులు ఈ బాధ ఉండేది కాదు కదా డాక్టర్ బాబు
దీప ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడంతో ఇక చాలు నీ ప్రశ్నలన్నింటికీ నా దగ్గర సమాధానాలు ఉన్నాయి అవన్నీ మళ్లీ చెబుతాను అని అంటాడు కార్తీక్. అప్పుడు దీపకి జ్యూస్ పడతాడు. 

ఇంద్రుడు ఊరంతా తిరిగి తిరిగి ఇంటికి వెళ్లడంతో వాళ్లు కనిపించారా అని చంద్రమ్మ అడుగుతుంది. ఆ రోజు వాళ్లకి ఇవ్వకుండా మనం చాలా పెద్ద తప్పు చేశాం మనం కావాలంటే జ్వాలమ్మతో పాటు వెళ్లిపోయినా సరిపోయిండేది అనుకుంటారు.  ఇంతలో శౌర్య అక్కడికి వచ్చి ఏం జరిగింది బాబాయ్ ఏం మాట్లాడుకుంటున్నారు అని అడిగితే ఇంద్రుడు వాళ్లు కవర్ చేస్తారు.

సోమవారం ఎపిసోడ్ లో
భార్య ఆరోగ్యం బాగాలేనప్పుడే భర్త ప్రేమ బయటపడుతుందా అనిదీప అడిగితే.. ప్రేమ ఎప్పుడూ ఉంటుంది అప్పుడే బాధ్యత బయటపడుతుంది...  మరోవైపు మోనిత ఆవేశంగా బోటిక్ నుంచి బయలుదేరుతుంది.. ఎదురుగా నిల్చుని ఉంటుంది సౌందర్య.. ఇంకా ఎంతమందిని చంపుతావు అని అడుగితే..ముందుమిమ్మల్ని చంపుతా అని గౌన్ ఎక్కుపెడుతుంది... ఆ వెనుకే పోలీస్ ఆఫీసర్ నిల్చుని ఉంటుంది..

Published at : 03 Dec 2022 09:23 AM (IST) Tags: Karthika Deepam Serial karthika Deepam Serial Today Episode Karthika Deepam Serial Written Update Karthika Deepam Episode 1526 Karthika Deepam Serial December 3rd

సంబంధిత కథనాలు

Posani Krishna Murali: ఆ అవమానం తట్టుకోలేక చనిపోయారు, తండ్రి గురించి చెప్తూ కంటతడి పెట్టిన పోసాని

Posani Krishna Murali: ఆ అవమానం తట్టుకోలేక చనిపోయారు, తండ్రి గురించి చెప్తూ కంటతడి పెట్టిన పోసాని

అప్పుడు ‘విక్రమ్’తో సక్సెస్, ఇప్పుడు ‘కబ్జా’తో ప్రయోగం - నిర్మాతగా నితిన్ మళ్లీ జాక్‌పాట్ కొడతాడా?

అప్పుడు ‘విక్రమ్’తో సక్సెస్, ఇప్పుడు ‘కబ్జా’తో ప్రయోగం - నిర్మాతగా నితిన్ మళ్లీ జాక్‌పాట్ కొడతాడా?

Trivikram - Surya Vashistta : కో డైరెక్టర్ కుమారుడిని హీరో చేసిన త్రివిక్రమ్

Trivikram - Surya Vashistta : కో డైరెక్టర్ కుమారుడిని హీరో చేసిన త్రివిక్రమ్

Sidharth Kiara Wedding: సిద్ధార్థ్, కియారా పెళ్లికి ముహూర్తం ఫిక్స్ - జైసల్మేర్‌లో వెడ్డింగ్, ముంబై రిసెప్షన్!

Sidharth Kiara Wedding: సిద్ధార్థ్, కియారా పెళ్లికి ముహూర్తం ఫిక్స్ - జైసల్మేర్‌లో వెడ్డింగ్, ముంబై రిసెప్షన్!

Pathaan Movie: ‘పఠాన్’ మూవీ గురించి మీకు తెలియని 8 ఇంట్రెస్టింగ్ విషయాలు

Pathaan Movie: ‘పఠాన్’ మూవీ గురించి మీకు తెలియని 8 ఇంట్రెస్టింగ్ విషయాలు

టాప్ స్టోరీస్

Telangana budget 2023 : కొత్త పన్నులు - భూముల అమ్మకం ! తెలంగాణ బడ్జెట్‌లో ఆదాయ పెంపు మార్గాలు ఇవేనా ?

Telangana budget 2023 :  కొత్త పన్నులు -  భూముల అమ్మకం ! తెలంగాణ బడ్జెట్‌లో ఆదాయ పెంపు మార్గాలు ఇవేనా ?

Pawan Kalyan On Anam : డీజీపీ బాధ్యత తీసుకోకపోతే కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు - ఆనం, కోటంరెడ్డి ఇష్యూపై పవన్ కల్యాణ్ హెచ్చరిక

Pawan Kalyan On Anam : డీజీపీ బాధ్యత తీసుకోకపోతే కేంద్ర హోంశాఖకు  ఫిర్యాదు - ఆనం, కోటంరెడ్డి ఇష్యూపై పవన్ కల్యాణ్ హెచ్చరిక

YS Sharmila Gift To KCR : సీఎం కేసీఆర్ కు షూస్ గిఫ్ట్ పంపిన షర్మిల, తమతో ఒక్కరోజు పాదయాత్ర చేయాలని సవాల్

YS Sharmila Gift To KCR : సీఎం కేసీఆర్ కు షూస్ గిఫ్ట్ పంపిన షర్మిల, తమతో ఒక్కరోజు పాదయాత్ర చేయాలని సవాల్

Lokesh Padayatra : నెల్లూరు నుంచి జగన్ పతనం స్టార్ట్, పెద్దిరెడ్డి లోకల్ వీరప్పన్ - లోకేశ్

Lokesh Padayatra : నెల్లూరు నుంచి జగన్ పతనం స్టార్ట్, పెద్దిరెడ్డి లోకల్ వీరప్పన్ - లోకేశ్