News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Karthika Deepam December 10th Update: చంద్రమ్మకి డబ్బులిచ్చి పంపించేసిన కార్తీక్,దీపలో మొదలైన అనుమానం

కార్తీకదీపం డిసెంబరు 10 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

FOLLOW US: 
Share:

Karthika Deepam  December 10th  Episode 1532 (కార్తీకదీపం డిసెంబరు 10 ఎపిసోడ్)

దీప కళ్ళు తెరిస్తే ఇల్లు వస్తుంది అన్నారు మరి హాస్పిటల్ లో ఉన్నాను ఏమైంది డాక్టర్ బాబు అని అడుగుతుంది. ప్రయాణం చేసి అలసిపోయావు కళ్లు తిరిగిపడిపోయావు అని చెబుతాడు. 
దీప:ముఖంపై కొన్ని నీళ్లు చిలకరిస్తే సరిపోయేది కదా ఈ మాత్రం దానికే మళ్లీ హాస్పిటల్ కి తీసుకుని రావాలా..అక్కడికి అత్తయ్య మామయ్యలను చూసే దాన్ని కానీ ఇక్కడ డాక్టర్లు నర్సులు చూడాల్సి వస్తుంది. వెళ్దాం డాక్టర్ బాబు 
కార్తీక్: మనం సంగారెడ్డికే వెళ్లిపోదాం
దీప: ఎందుకు డాక్టర్ బాబు అలా మాట్లాడుతున్నారు ఏమైంది మీకు 
కార్తీక్ : దీపకి అబద్ధం చెబుతూ అమ్మ వాళ్లు మన ఇంటి దగ్గరికి వెళ్లారు. అందుకే నేను ఇక్కడికి తీసుకు వచ్చాను 
కార్తీక్ మాటలు నిజమే అని నమ్మిన దీప..సరే ఓసారి ఆ ఇంటికి వెళ్లి ఇల్లు చూసి వెళ్లిపోదాం అనడంతో కార్తీక్ సరే అంటాడు. 

Also Read: నాకోసమే దీప గుండె కొట్టుకుని కొట్టుకుని అలసిపోయింది, కన్నీళ్లు పెట్టించేసిన కార్తీక్, మళ్లీ శౌర్యకి అన్యాయం

చంద్రమ్మ...శౌర్యని తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. ఇంతకుముందు చిల్లర దొంగతనాలు చేసే వాళ్ళం కానీ ఇప్పుడు నిజాయితీగా బతుకుతున్నాం అంటే కారణం బంగారం లాంటి బిడ్డ..అలాంటి బిడ్డను దూరం చేసుకోవడం ఎంత కష్టం అనుకుంటుంది.  శౌర్యకి అన్నం తనిపిస్తూ..రేపు మా నుంచి వెళ్లిపోతావని మనసులో ఆలోచిస్తుంటుంది.
శౌర్య: ఏమైంది పిన్నీ అంత దిగులుగా ఉన్నావ్
చంద్రమ్మ: ఏమీలేదు..ఈ అన్నం వదిలిపెట్టకుండా మొత్తం తినేయాలి
శౌర్య: రేపు వదిలిపెట్టాలా 
చంద్రమ్మ: అన్నం కాదమ్మా..రేపు మమ్మల్నే వదిలిపెట్టి వెళ్లిపోతావు...

మరోవైపు కార్తీక్ దీపని తీసుకెళ్లి ఇల్లు చూపిస్తాడు. ఆ ఇంటిని చూసి దీప సంతోష పడుతూ ఉంటుంది. ఆ తర్వాత కార్తీక్ కారు తిప్పి వెళుతుండగా..ఇంద్రుడు లోపలకు వెళ్లడం చూసి కార్తీక్ షాక్ అవుతాడు. వీడు లోపలకు వెళితే సరే.. శౌర్య గురించి చెబితే సరే కానీ మేం బతికి ఉన్న విషయం చెబితే అని ఆలోచనలో పడతాడు. దీప నువ్వు రెస్ట్ తీసుకో ఇప్పుడే వస్తాను అని కారు దిగి వెళతాడు. లోపలకు వెళుతున్న ఇంద్రుడి చేయిపట్టుకుని లాగి బయటకు తీసుకొస్తాడు.
కార్తీక్: ఎక్కడికి వెళ్తున్నావు నా బిడ్డను నీ దగ్గర ఉంచుకుని ఎన్ని నాటకాలు ఆడావు , ఎంత మోసం చేశావు
ఇంద్రుడు: ఏం జరిగిందో మొత్తం కార్తీక్ కి వివరిస్తాడు..మీకోసం అక్కడ వెతికాం కనిపించలేదు..అందుకే వాళ్ళ తాతయ్య నానమ్మలకు చెప్పి పాపను తీసుకుని వెళ్లమని చెబుదామని వచ్చాను సార్ .చెప్పండి సార్ మీరు తీసుకెళ్తారా లేకపోతే అమ్మ  గారికి అయ్యగారికి చెప్పమంటారా
కార్తీక్: నువ్వు పాపని ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. పాపని నీ దగ్గరే పెట్టుకో వెనక్కి వెళ్ళిపో . కొన్ని కారణాల వల్ల తీసుకొని వెళ్లలేకపోతున్నాను కొద్ది రోజులపాటు మీ దగ్గరే ఉంచుకో 
ఇంద్రుడు: ఇలా చేసిన దానికి మీరు నన్ను కొడతారు అనుకున్నాను సార్ 
కార్తీక్: మమ్మల్ని తిప్పావు అన్న కోపం తప్ప నీ మీద మాకు ఎటువంటి కోపం లేదు. మా బిడ్డను నువ్వు బాగా చూసుకున్నావు. 
ఇప్పుడు నేను నీతో ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను నేను అదే ఊరికి వస్తున్నాను అక్కడ మాట్లాడుకుందాం అని చెప్పి ఫోన్ నంబర్ ఇచ్చి ఇంద్రుడిని అక్కడ్నుంచి పంపించేసి బాధపడతాడు

Also Read: రిషిని ఆలోచనలో పడేసిన వసుధార ప్రవర్తన, వసుని ఇంటికి వెళ్లమని చెప్పిన జగతి

ఇంద్రుడు ఇంకా రాలేదేంటని చంద్రమ్మ టెన్షన్ పడుతుంటుంది. ఇంద్రుడు రావడంతో ఏమైంది గండా అని అడిగితే.. జ్వాలమ్మని మనదగ్గరే ఉంచుకోమని చెప్పారనడంతో చంద్రమ్మ సంతోషపడుతుంది. ఎక్కువ ఆలోచనలు ఎక్కువ ఆశలు పెట్టుకోకు చంద్రమ్మ అంటాడు ఇంద్రుడు. 

దీప తులసి కోటకు పూజ చేస్తూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ అక్కడికి కాఫీ తీసుకొచ్చి ఇస్తాడు. ఏంటి డాక్టర్ బాబు మీరు కాఫీ తీసుకొచ్చారని అంటే..ఇవాల్టి నుంచి నీ పేరు వంటలక్క కాదు నువ్వు వంటలు చేయవు అనడంతో ఏంటి పొద్దు పొద్దున్నే కొత్తగా మాట్లాడుతున్నారు అంటుంది. నేనే వంటలు చేస్తాను దీపా నువ్వు వంటలు నేర్పించు అని అంటాడు కార్తీక్. మీరు నాకు మూడు పూటలా వండి పెడతారా ఏ ఊరు బాబు మనది అని ఫన్నీగా మాట్లాడుతుంది దీప...సరే ఇప్పుడు నేను హాస్పిటల్ కి వెళుతున్నాను నీకు చారుశీల టిఫిన్ పంపిస్తుంది తిను అంటాడు. అంతలోనే ఓ పనిమనిషిని చూశాను నువ్వు రెస్ట్ తీసుకో అని చెబుతాడు. అప్పుడు దీప శౌర్య గురించి టెన్షన్ పడుతూ ఉండగా నువ్వు టెన్షన్ పడకు శౌర్య తొందరలోనే దొరుకుతుంది మనం హైదరాబాద్ కి వెళ్ళిపోదాం అని నచ్చ చెబుతాడు కార్తీక్.

సోమవారం ఎపిసోడ్ లో
టిఫిన్ రెడీ అని పిలుస్తుంది దీప.. ఫోన్ చార్జింగ్ పెట్టి వస్తానని దీపను పంపిస్తాడు కార్తీక్.. ఇంతలో చంద్రమ్మ ఇంటి లోపలకువస్తూ కనిపిస్తుంది. కార్తీక్ కంగారుగా ఆమెను తీసుకెళ్లిపోతాడు.డబ్బులిచ్చి పంపించేస్తాడు... దీప బయటకు వచ్చి చూస్తుంది...

Published at : 10 Dec 2022 09:46 AM (IST) Tags: Karthika Deepam Serial karthika Deepam Serial Today Episode Karthika Deepam Serial Written Update Karthika Deepam Episode Karthika Deepam Serial December 10th update

ఇవి కూడా చూడండి

Guntur Kaaram Song: మహేష్ బాబుకు శ్రీలీల ముద్దు - 'గుంటూరు కారం'లో రెండో పాట రెడీ!

Guntur Kaaram Song: మహేష్ బాబుకు శ్రీలీల ముద్దు - 'గుంటూరు కారం'లో రెండో పాట రెడీ!

‘మంగళవారం’ ఓటీటీ స్ట్రీమింగ్, ‘బ్రహ్మాస్త్ర 2’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘మంగళవారం’ ఓటీటీ స్ట్రీమింగ్, ‘బ్రహ్మాస్త్ర 2’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Brahmanandam: ‘యానిమల్’లో కొడుకు పాత్రలో బ్రహ్మానందం, తండ్రి ఎవరో తెలుసా? ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు

Brahmanandam: ‘యానిమల్’లో కొడుకు పాత్రలో బ్రహ్మానందం, తండ్రి ఎవరో తెలుసా? ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు

Jagadhatri December 9th Episode: సూరిని చూసి షాకైన సుధాకర్.. పోలీసులు మాధురిని అరెస్టు చేస్తారా?

Jagadhatri December 9th Episode: సూరిని చూసి షాకైన సుధాకర్.. పోలీసులు మాధురిని అరెస్టు చేస్తారా?

Bigg Boss 7 Telugu: మోనితా బాధితులకు గుడ్ న్యూస్, ‘బిగ్ బాస్’ నుంచి శోభా శెట్టి ఔట్? క్షోభ పోతుందంటున్న హేటర్స్!

Bigg Boss 7 Telugu: మోనితా బాధితులకు గుడ్ న్యూస్, ‘బిగ్ బాస్’ నుంచి శోభా శెట్టి ఔట్? క్షోభ పోతుందంటున్న హేటర్స్!

టాప్ స్టోరీస్

Telangana Ministers Portfolios: నాలుగు కేబినెట్‌లలో సభ్యుడిగా తుమ్మల రికార్డు- 11 మందికి కేటాయించిన శాఖల ప్రత్యేకతలు ఇవే

Telangana Ministers Portfolios: నాలుగు కేబినెట్‌లలో సభ్యుడిగా తుమ్మల రికార్డు- 11 మందికి కేటాయించిన శాఖల ప్రత్యేకతలు ఇవే

Mangalavaaram: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్న ‘మంగళవారం’ - ఎప్పుడు, ఎక్కడంటే?

Mangalavaaram: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్న ‘మంగళవారం’ - ఎప్పుడు, ఎక్కడంటే?

Infinix Smart 8 HD: రూ.ఆరు వేలకే స్మార్ట్ ఫోన్ - భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే - ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్ వచ్చేసింది!

Infinix Smart 8 HD: రూ.ఆరు వేలకే స్మార్ట్ ఫోన్ - భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే - ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్ వచ్చేసింది!

Telangana Assembly : 15న స్పీకర్ ఎన్నిక - విపక్షాలు పోటీ పెడతాయా ?

Telangana Assembly :  15న స్పీకర్ ఎన్నిక - విపక్షాలు పోటీ పెడతాయా ?