News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Guppedantha Manasu December 9th Update: రిషిని ఆలోచనలో పడేసిన వసుధార ప్రవర్తన, వసుని ఇంటికి వెళ్లమని చెప్పిన జగతి

Guppedantha Manasu December 9th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

FOLLOW US: 
Share:

గుప్పెడంత మనసు శుక్రవారం ఎపిసోడ్  ( Guppedantha Manasu  December 9th Update Today Episode 629)

దేవయాని అరెంజ్ చేసిన కాలేజీ స్టాఫ్ కావాలని వసుధారని టార్గెట్ చేస్తారు. నోటికొచ్చినట్టు మాట్లాడతారు. ఆ మాటలు తలుచుకుని వసుధార బాధపడుతూ ఓ చోట నిల్చుంటుంది. వాళ్లు క్షమించమని అడుగి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇంతలో ధరణి అక్కడికి వెళ్లి ఏంటి వసుధార ఇక్కడ ఉన్నావని అడిగితే..ఏంలేదు మేడం అనడంతో సరే మినిస్టర్ గారు వస్తున్నారంట రిషి పిలుస్తున్నాడు  వెళ్దాం పద అంటుంది. రిషి గౌతమ్ వాళ్లు వెళ్లి మినిస్టర్ ని రిసీవ్ చేసుకుంటారు...మీ ఫ్యామిలీ మెంబర్స్ రాలేదా అని అడిగితే కొన్ని పరిస్థితుల వల్ల రాలేదు సార్ అని చెబుతాడు. ఇంతలోనే వసుధార అక్కడికి రావడంతో ఏమ్మా నువ్వే కనిపించడం లేదని అనుకుంటున్నాను అంటాడు మినిస్టర్. అప్పుడు వసుధార డల్ గా ఉండడాన్ని రిషి గమనిస్తాడు. 
మినిస్టర్: వసుధార నువ్వు అన్నిట్లోనూ ముందు ఉంటావు కదా ఆటపాటలను నువ్వే చూసుకో 
వసు: సరే సార్
రిషి: ఎందుకు అంత డల్ గా కనిపిస్తున్నావు
వసు: ఏం లేదు సార్ 
ధరణి: వసుధార హుషారుగా ఉండాలి అంటే ఆటపాటలు మొదలుపెట్టాలి 
 
Also Read: నాకోసమే దీప గుండె కొట్టుకుని కొట్టుకుని అలసిపోయింది, కన్నీళ్లు పెట్టించేసిన కార్తీక్, మళ్లీ శౌర్యకి అన్యాయం
ఆ తర్వాత వసుధార ఒంటరిగా నిలబడి ఆలోచిస్తూ ఉండగా అక్కడికి గౌతమ్ వస్తాడు.వసుధారా నువ్వు బాధలో ఉన్నావని నాకు తెలుసు కానీ స్టూడెంట్స్ కోసం రిషి కోసం నువ్వు ఆడాలి లేకపోతే రిషి బాధపడతాడు అని వసుకి నచ్చజెప్పి అక్కడి నుంచి తీసుకెళతాడు. తర్వాత అందరూ కలిసి తాడు లాగుతూ ఉంటారు. లేడీస్ ఓవైపు, జంట్స మరోవైపు లాగుతూ ఉంటారు.. ఆ పోటీలో జంట్స్ గెలుస్తారు..వసుధార కిందపడిపోతూ ఉండగా రిషి పట్టుకుంటాడు. మళ్లీ కాలేజీ స్టాఫ్ చెవులు కొరుక్కోవడం మొదలెడతారు. ఇలా బల ప్రదర్శన చేస్తే మగవారే గెలుస్తారు ఇందులో వింతేముంది అంటుంది ధరణి 

అందర్నీ భోజనానికి రమ్మని కబురురావడంతో అంతా వెళతారు. తినకుండా వసు ఆలోచిస్తూనే ఉంటుంది. గమనించిన గౌతమ్.. వసుధార బాధపడకడు ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం తిను అని చెబుతాడు. గమనించిన రిషి కూడా ఏమైంది ఎప్పటిలా లేవని అడుగుతాడు. తలనొప్పిగా ఉందని చెప్పడంతో టాబ్లెట్ తెప్పించమంటావా అన్నా వసుధార వద్దు అంటుంది. రిషి మాత్రం సంతోషంగా ఉంటాడు.. నువ్వు భోజనం చేశాక నీకు సర్ ప్రైజ్ అంటాడు. గతంలో ఇద్దరూ ఊయల ఊగిన దగ్గరకు వెళతారు. అప్పటికీ వసుధార డల్ గానే ఉంటుంది..చూడు వసుధార లైఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు అని నచ్చచెబుతూ ఉంటాడు రిషి..ఇంతలో గౌతమ్ అక్కడికి వచ్చి త్వరగా వచ్చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు వసుధార వచ్చి ఉయ్యాల్లో కూర్చో అని రిషి అనడంతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వసుధార. ఏమైందా అని ఆలోచిస్తాడు...
Also Read:  వసు ఇబ్బంది గమనించి హెల్ప్ చేసిన రిషి, దేవయాని ప్లాన్ ని ఫ్లాప్ చేసిన గౌతమ్

ఇంటికి వెళ్లాక కూడా వసుధార ఎడుస్తూ ఉంటుంది...ఏమైందని జగతి అడుగుతుంది
వసు: ఎందుకు మేడం ఎదుటి వ్యక్తుల గురించి ఇలా తప్పుగా మాట్లాడతారు 
జగతి: అవేమీ పట్టించుకోవద్దు
వసు: వాళ్లకు నాతో శత్రుత్వం ఏంటి మేడం గుండెలు కోసేసేలా మాట్లాడుతారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది 
జగతి: శత్రుత్వం అవసరం లేదు వసుధార ఒంటరి అమ్మాయి వాళ్లకు టాపిక్ మాట్లాడుకోవడానికి దొరికింది ఏవైనా మాట్లాడుకుంటారు దానికి నువ్వు బాధపడకు. నువ్వు మీ ఊరికి వెళ్ళు.  మీ అమ్మానాన్నలతో ధైర్యంగా మాట్లాడు జరిగింది మొత్తం చెప్పు అనడంతో వసుధార షాక్ అవుతుంది. నేను ఎందుకు వెళ్ళమంటున్నానో నాకు స్పష్టత ఉంది ఇంక ఆలస్యం చేయకు ఊరికి వెళ్ళు అని అంటుంది జగతి.

Published at : 09 Dec 2022 10:11 AM (IST) Tags: Guppedantha Manasu Guppedantha Manasu Daily Serial Episode Sai Kiran Raksha Gowda Mukesh Gowda Rasagnya Reddy jyothi roy Guppedantha Manasu December 9th Update Guppedantha Manasu Today Episode 629

ఇవి కూడా చూడండి

Dhootha Web Series Review - దూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?

Dhootha Web Series Review - దూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?

Vijay Rashmika: ఒకే తరహా డ్రెస్‌లో రష్మిక, విజయ్ దేవరకొండ - దొరికిపోయారుగా!

Vijay Rashmika: ఒకే తరహా డ్రెస్‌లో రష్మిక, విజయ్ దేవరకొండ - దొరికిపోయారుగా!

The Goat Life Release Date: ఎడారి దేశంలో భారతీయ కూలీ కష్టాలు - మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సినిమా విడుదలకు రెడీ!

The Goat Life Release Date: ఎడారి దేశంలో భారతీయ కూలీ కష్టాలు - మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సినిమా విడుదలకు రెడీ!

ఫ్రీగా ‘సలార్’ టికెట్లు, ‘కాలింగ్ సహస్ర’కు థియేటర్ల కరువు - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఫ్రీగా ‘సలార్’ టికెట్లు, ‘కాలింగ్ సహస్ర’కు థియేటర్ల కరువు - నేటి టాప్ సినీ విశేషాలివే!

Allu Arjun: విడివిడిగా ఓటు వేసిన అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహ - వేర్వేరుగా వెళ్లడంతో...

Allu Arjun: విడివిడిగా ఓటు వేసిన అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహ - వేర్వేరుగా వెళ్లడంతో...

టాప్ స్టోరీస్

Telangana Exit Poll Results 2023: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి, ఏంటంటే!

Telangana Exit Poll Results 2023: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి, ఏంటంటే!

Telangana Elections 2023: స్వల్ప ఉద్రిక్తతలతో ముగిసిన తెలంగాణ ఎన్నికలు, 70 దాటిన పోలింగ్ శాతం

Telangana Elections 2023: స్వల్ప ఉద్రిక్తతలతో ముగిసిన తెలంగాణ ఎన్నికలు, 70 దాటిన పోలింగ్ శాతం

Anasuya Bharadwaj: రౌండ్ కళ్లద్దాలతో రంగమత్త - భలే బాగుంది కదూ!

Anasuya Bharadwaj: రౌండ్ కళ్లద్దాలతో రంగమత్త - భలే బాగుంది కదూ!

Telangana Assembly Election 2023: కన్ఫ్యూజన్ వద్దు వందశాతం గెలుపు BRS దే, కేటీఆర్ కామెంట్స్ వైరల్

Telangana Assembly Election 2023: కన్ఫ్యూజన్ వద్దు వందశాతం గెలుపు BRS దే, కేటీఆర్ కామెంట్స్ వైరల్