By: ABP Desam | Updated at : 09 Dec 2022 09:35 AM (IST)
Edited By: RamaLakshmibai
Karthika Deeppam December 9th Update Episode 1531 (Image Credit: Star Maa/Hot Star)
Karthika Deepam December 9th Episode 1531 (కార్తీకదీపం డిసెంబరు 9 ఎపిసోడ్)
ఇంటికి చేరిన కొడుకు కోడలిని చూసి సౌందర్య ఆనందరావు ఆనందానికి అవధులుండవు. ఏడవకు మమ్మీ అని కార్తీక్ అనడంతో ఏడవని నాన్న ఇన్నాళ్లు ఇదే ఏడుపు కానీ అప్పుడు అప్పుడు కన్నీళ్లలో బాధ ఇప్పుడు ఈ కన్నీళ్లలో ఆనందం అని అంటాడు ఆనందరావు. ఇన్నాళ్లూ ఏం జరిగింది? ఎక్కడున్నారు? ఎందుకు రాలేదని సౌందర్య అడగడంతో... గతం మర్చిపోవడం, మోనిత మోసం, దీప పడిన కష్టాలు అవన్నీ చెబుతారు. ఆ తర్వాత శౌర్య గురించి ప్రస్తావన రావడంతో ... శౌర్యని ఎందుకు వదిలేశారు, శౌర్య ఎక్కడుందో తెలుసా లేదా అని వరుస ప్రశ్నలు వేస్తుంది...శౌర్య శౌర్యా అని అరుస్తూ కార్లోనే కళ్లు తిరిగి పడిపోతుంది. ( జరిగినదంతా దీప కల)... అప్పుడే ఇంటి దగ్గర కారు ఆపుతాడు కార్తీక్... బయట హిమను చూస్తాడు, లోపల నుంచి సౌందర్య పిలుపు వినిపిస్తుంది కానీ..దీప ఎంతసేపటికీ కళ్లు తెరవకపోవడంతో కంగారుపడి కారు దిగకుండా అట్నుంచి అటే హాస్పిటల్ కి తీసుకెళ్లిపోతాడు కార్తీక్...
ఇంద్రుడు-చంద్రమ్మ: హైదరాబాద్ వెళ్లి జరిగినదంతా చెబుతాను అంటాడు ఇంద్రుడు. కన్నప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పది గండా అని చంద్రమ్మ కన్నీళ్లు పెట్టుకుంటుంది. జ్వాలమ్మ మనల్ని కూడా రమ్మంటోంది కదా మనల్ని వదిలేసి వెళ్లదులే అని ధైర్యం చెబుతాడు ఇంద్రుడు.
Also Read: మతి స్థిమితం కోల్పోయిన మోనిత, సౌందర్య ఆగ్రహం, ఇంటికి చేరిన దీప-కార్తీక్
మరోవైపు దీప రిపోర్ట్స్ చారుశీల దగ్గర్నుంచి తీసుకుని చూసిన కార్తీక్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. కార్తీక్ ను అలా చూసి కంగారుపడిన చారుశీల ఓదార్చుతుంది.
చారుశీల: రిపోర్ట్స్ చూడగానే నాకు కూడా చెమటలు పట్టాయి కానీ నేను ఎలా చెప్పాలో తెలియక అలాగే ఆగిపోయాను. గుండె బాగా దెబ్బతింది దీనికి ట్రీట్మెంట్ లేదు. గుండె మార్పిడి తప్ప దీనికి మరొక మార్గం లేదు
కార్తీక్:దీప పరిస్థితి తలుచుకుని కార్తీక్ కన్నీళ్లు పెట్టుకుంటాడు.. దీప చాలా మంచిది తనకి ఎందుకు ఇలా జరుగుతోంది. జీవితంలో తాను సంతోషంగా ఉన్న రోజులు వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు అంటాడు. నా కోసమే ఆరాటం,నాకోసమే పోరాటం, నా కోసమే ఆ గుండె కొట్టుకుని కొట్టుకుని అలసిపోయింది... దీపకు ఇలా జరగడానికి నేనే కారణం అని బాధపడతాడు. ఇన్ని రోజుల్లో తాను సంతోషంగా ఎప్పుడూ లేదు తనని నేను ఎప్పుడు సంతోషంగా ఉంచలేదు ఇన్ని రోజులు తాను నాకోసమే ఆరాట పడిందంటాడు.
చారుశీల: ఇప్పుడేమీ చెప్పొద్దు..మీరే తన ధైర్యం..అందుకే మీరు ధైర్యంగా ఉండండి
ఇంతలో ఓ నర్స్ వచ్చి సార్..పేషెంట్ కి స్పృహ వచ్చిందని చెబుతుంది. రా చారుశీల అనికార్తీక్ అనడంతో.. వద్దు కార్తీక్ నేను ఇంత సడెన్ గా ఫ్లైట్ లో ఎందుకొచ్చానో అర్థంకాక కంగారుపడుతుంది..మీరు మాట్లాడి తనను అక్కడికి తీసుకురండి అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం అంటుంది చారుశీల..
Also Read: వసు ఇబ్బంది గమనించి హెల్ప్ చేసిన రిషి, దేవయాని ప్లాన్ ని ఫ్లాప్ చేసిన గౌతమ్
మరొకవైపు ఇంద్రుడు హైదరాబాద్ కు వెళ్లడానికి బయలుదేరుతూ ఉంటాడు. అప్పుడు చంద్రమ్మ ఎమోషనల్ అవుతూ ఉండగా ఆగు బాబాయ్ నువ్వు ఊరికి వెళితే పిన్ని ఎందుకు ఏడుస్తుంది అని అనగా అప్పుడు అబద్ధాలు చెప్పి కవర్ చేసుకుంటుంది చంద్రమ్మ. ఆ తర్వాత ఇంద్రుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు సౌందర్య... కార్తీక దీపల ఫోటోలకు దండ తీసేస్తుంది. ఇంతలోనే అక్కడికి ఆనంద్ రావు వస్తాడు. మొన్నటి వరకు ఆశ మాత్రమే ఉండేది కానీ ఆ మోనిత ప్రవర్తన చూసిన తర్వాత గట్టి నమ్మకం కలిగింది అని అంటుంది సౌందర్య. అప్పుడు వారిద్దరూ దీప, కార్తీక్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు దీపకి సృహ రావడంతో ఎందుకు డాక్టర్ బాబు ఇక్కడికి తీసుకొచ్చారని అడుగితే..ఏంలేదు దీపా అని అబద్ధం చెబుతాడు.
రేపటి(శనివారం) ఎపిసోడ్
దీప కార్తీక్ కారులో వెళుతుండగా..ఇంద్రుడిని చూస్తాడు కార్తీక్.. కారు ఆపిన కార్తీక్..తన ఇంట్లోకి వెళుతున్న ఇంద్రుడి చేయిపట్టుకుని వెనక్కు లాక్కొస్తాడు.. నా బిడ్డని నీ దగ్గర పెట్టుకుని నాటకాలు ఆడావా అని నిలదీస్తాడు.. అప్పుడు ఇంద్రుడు మీకోసం వెతికాను మీరు కనిపించలేదు అందుకే వాళ్ల నానమ్మకి అప్పగిద్దామని వచ్చానంటాడు.. లోపలు వెళ్లొద్దు, మాకు ఇవ్వొద్దు వెనక్కు తిరిగి వెళ్లిపో అంటాడు.. కార్తీక్ మాటలు విని ఇంద్రుడు షాక్ అవుతాడు...
K Viswanath Death: టాలీవుడ్ను ఖండాంతరాలకు తీసుకు వెళ్ళారు, తీరని లోటు - విశ్వనాథునికి చిరంజీవి, ఎన్టీఆర్, మమ్ముట్టి నివాళులు
K.Viswanath: చిరంజీవితో విశ్వనాథ్కు ప్రత్యేక అనుబంధం - కళా తపస్విని కన్నతండ్రిలా భావించే మెగాస్టార్!
K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక
K Viswanath Passed Away : బ్రేకింగ్ న్యూస్ - కళాతపస్వి కె. విశ్వనాథ్ ఇకలేరు
Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!
Pawan Kalyan: రోడ్డు మీద వాంతి చేసుకుంటే బాబాయ్ క్లీన్ చేశారు - చరణ్ ఫోన్కాల్లో పవన్ గురించి ఏం అన్నారు?
Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సంచలన మలుపు, ఛార్జ్షీట్లో కేజ్రీవాల్, కవిత, మాగుంట పేర్లు
YS Sharmila Gift To KCR : సీఎం కేసీఆర్ కు షూస్ గిఫ్ట్ పంపిన షర్మిల, ఒక్కరోజు పాదయాత్ర చేయాలని సవాల్
Lokesh Padayatra : నెల్లూరు నుంచి జగన్ పతనం స్టార్ట్, పెద్దిరెడ్డి లోకల్ వీరప్పన్ - లోకేశ్