Janaki Kalaganaledu August 1st Update: గోడమీద రామా, జానకి ఫోటో తీసేయమన్న జ్ఞానంబ- ఇంటి పెత్తనం తనదే అంటున్న మల్లిక, గుండెపగిలేలా ఏడుస్తున్న జానకి
వరలక్ష్మి వ్రతం పూజలో జానకిని జోక్యం చేసుకోవద్దని చెప్పడంతో రామా, జానకి బాధపడతారు. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
వరలక్ష్మి వ్రతం పూజలో జానకిని జోక్యం చేసుకోవద్దని చెప్పడంతో రామా, జానకి బాధపడతారు. పండగ సందర్భంగా ఇంట్లో అందరికీ జ్ఞానంబ బట్టలు ఇస్తుంది. కానీ రామా, జానకికి మాత్రం ఇవ్వకుండా వెళ్లిపోతుంటే గోవిందరాజులు ఆపి అడుగుతాడు. కొంతమందికి నా చేత్తో ఇచ్చేంత గొప్పదాన్ని కాదులెండి అని వెళ్లబోతుంది. ఎదురుగా గోడ మీద జానకి, రామా ఉన్న ఫోటో చూసి బాధపడుతూ చికితను ఆ ఫోటో తీసేయమని చెప్తుంది. గుర్తులు, జ్ఞాపకాలు సంతోషాన్ని ఇచ్చేలా ఉండాలి మోసాన్ని గుర్తు చేసి బాధపెట్టేలా ఉండకూడదు అనేసరికి అందరూ ఆశ్చర్యపోతూ బాధపడుతుంటే మల్లిక మాత్రం లోలోపల సంతోషపడుతుంది. ఎవరు లేని సమయంలో తెగ డాన్స్ చేస్తుంది.
రామా పూజకీ రెడీ అవుతాడు. జానకి అలాగే ఉండటం చూసి రెడీ అవమని చెప్తాడు. నన్ను చూస్తే అత్తయ్యగారు బాధపడతారు, పండగ రోజు సంతోషంగా ఉండకుండా నా కారణంగా బాధపడటానికి వీల్లేదని జానకి అంటుంది. మీరు లేకుండా పండగ ఉంటుందా, మీరు బాధపడుతుంటే ఈ ఇంటికి వెలుగు, సంతోషం ఉంటుందా, అయినా అమ్మ మనసులో ఉంది బాధే తప్ప కోపం మాత్రమే అని రామా సర్ది చెప్తాడు. ఆ కోపం కూడా ఈ వరలక్ష్మి వ్రతంతో దూరం అయిపోతుంది మనతో మళ్ళీ అమ్మ ఎప్పటిలాగానే ఉంటుందని అంటాడు. వ గంట క్రితం వరకు నేను అదే అనుకున్నాను కానీ మన ఫోటో కళ్ల ముందు ఉండటానికి ఇష్టపడని అత్తయ్యగారు అంతా తేలికగా మనల్ని క్షమిస్తారనే ఆశ పోయిందని జానకి కన్నీరు పెట్టుకుంటుంది. అలా ఏమి జరగదు అమ్మ మనల్ని క్షమిస్తుందనే నమ్మకం తనకి ఉందని రామా అంటాడు. ఈ పూజ అయిపోయేసరికి అమ్మ మనల్ని దగ్గరకి తీసుకుంటుందని చెప్తాడు. అపురూపమైన మీ తల్లి కొడుకుల బంధానికి నా కారణంగా మనస్పర్ధలు ఏర్పడ్డాయి, ఇంట్లో దీపం పెట్టాలనుకున్న కోడలు కన్నీళ్ళు పెట్టించిందని అత్తయ్యగారు అంటుంటే నా ప్రాణం విలవిల్లాడిపోయింది ఏడుస్తుంది. అత్తయ్యగారిని చూసినప్పుడల్లా నాకు ఆ మాటలే గుర్తుకొస్తున్నాయి, ఆ బాధ నన్ను జీవితాంతం బాధపెడుతూనే ఉంటుంది, కోడలిగా నేను ఒడిపోయాను అని కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఈ ఇంటి మహాలక్ష్మి మీరు పండగ పూట ఇలా కంటతడి పెట్టుకోవచ్చా, మీరు నాకు భార్య అవడం, ఈ ఇంటి కోడలు అవడం మా ఇంటి అదృష్టం. మీరు కోడలిగా ఎప్పటికీ ఒడిపోరు అని రామా జానకికి ధైర్యం చెప్తాడు.
జానకి పూజ ఏర్పాట్లు చేస్తుంది. అది చూసి మల్లిక కుళ్ళుకుంటుంది. ఇందాక జరిగినదానికి ఏడుస్తూ కూర్చుంటది అనుకుంటే ఇలా చేస్తుందేంటి అని మల్లిక గొడవ చేసేందుకు చూస్తుంది. ఏం చేస్తున్నావ్ జానకి అని అడుగుతుంది. ఈ ఇంట్లో కుర్చీలు, బల్లలు ఎలాగో నువ్వు అంతే ఒక పక్కన పడుండాలి. అలా కాకుండా కాళ్ళు ఉన్నాయి కదా అని కరాటే చేస్తాను చేతులు ఉన్నాయి కదా అని ఇంటి పనుల్లో వేలు పెడతాను అని అనుకుంటే చూసి ఊరుకునేదే లేదు అని అరుస్తుంది. ఆ మాటలకి జానకి కోపంగా చూస్తుంటే ఇవి నా డైలాగులు కాదు జానకి కాసేపటి క్రితం అత్తయ్యగారు ఇచ్చిన వార్నింగ్.. మరి అత్తయ్యగారు చెప్పిన మాటలు నీకు గుర్తు లేవా లెక్క లేవా అని అంటుంది. అత్తయ్యగారి మాటలు ఎదిరించాలని నేను ఈ పనులు చెయ్యడం లేదు నా బాధ్యత కాబట్టి చేస్తున్నాని చెప్తుంది. బాధ్యత బెండకాయ పులుసేమి కాదు నీ పెద్ద కోడలు పెత్తనాన్ని, హోదాని కట్టి కాల్వలో పడేశారు. ఇప్పుడు ఈ ఇంటి కోడలు పెత్తనాన్ని ఈ మల్లికకి ఇచ్చారు. ఇలా అంటున్నానని ఏమి అనుకోకు నీ మీద కోపం పెరుగుతుందే తప్ప తగ్గదు అని అంటుంది. ఎమ్మా పెట్రోల్ మల్లిక నీకు బాగా పండగ అనుకుంటాను అని గోవిందరాజులు కౌంటర్ ఇస్తాడు. అవును మావయ్యగారు అత్తయ్యగారు పనులన్నీ నా మీద పెట్టారు అని అంటుంది. నేను అంటుంది ఈ పండగ కాదమ్మా తోడికోడల్ని ఆడిపోసుకునే పండగ గురించని అంటాడు. అయ్యయ్యో నేను తోడికోడలి మీద తోడి పోసుకోవడం నాకు అస్సలు అవసరం లేదు అలాంటివి నా కిడ్నీలో కూడా లేవు అత్తయ్యగారు నాకు ఈ బాధ్యత అప్పగించారని మల్లిక చెప్తుంది. ఛాయాదేవి గారిలాగా నువ్వు చేసింది చాలు వ్రతం అయ్యేదాక పుల్లలు పెట్టడం తగ్గించు అలా కాకుండా పెట్రోల్ పోసే కార్యక్రమాలు చేసావంటే అసలు బాగోదని వార్నింగ్ ఇస్తాడు.
Also Read: రుక్మిణికి షాకింగ్ విషయం చెప్పిన భాగ్యమ్మ- గాయాలతో ఇంటికి వచ్చిన దేవి, అల్లాడిపోయిన రుక్మిణి
Also Read: 'నేను నీ మాజీ భర్త'నని సామ్రాట్ కి చెప్పొద్దన్న నందు - తులసిని తెగ మెచ్చుకున్న సామ్రాట్