Gruhalakshmi August 1st Update: 'నేను నీ మాజీ భర్త'నని సామ్రాట్ కి చెప్పొద్దన్న నందు - తులసిని తెగ మెచ్చుకున్న సామ్రాట్
నందు చెప్పిన స్కూల్ ప్లాన్ బాగోలేదని తులసి చెప్తుంది. ఇలా అయితే ఈ మ్యూజిక్ స్కూల్ నాకు అవసరం లేదని తులసి అంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
నందు చెప్పిన స్కూల్ ప్లాన్ బాగోలేదని తులసి చెప్తుంది. ఇలా అయితే ఈ మ్యూజిక్ స్కూల్ నాకు అవసరం లేదని తులసి అంటుంది. ఇదే మాట సామ్రాట్ గారికి చెప్పమంటావా అని లాస్య అంటే చెప్పుకోమని అంటుంది. దీంతో నందు వాళ్ళు వెళ్లిపోతారు. డైరెక్ట్ గా సామ్రాట్ గారి దగ్గరకి వెళ్ళి నాకు తులసి ప్రాజెక్ట్ కి సంబంధం లేదు నన్ను రిలీజ్ చెయ్యమని అడుగుతాను అని నందు అంటాడు. చేస్తాడు కానీ తులసి ప్రాజెక్ట్ నుంచి కాదు అసలు ఆఫీసు నుంచే రిలీజ్ చేస్తాడని లాస్య అంటుంది. ఇప్పుడు నీ కళ్ల ముందు ఉంది పాత తులసి కాదు చెప్పు బాస్ అనే తులసి.. కొత్తగా లెక్కలు నేర్చుకుంటూ పాత లెక్కలు సరిచేస్తుంది. ఎదురు తిరుగుతూ కావాలని నిన్ను రెచ్చగొడుతుందని.. ప్రస్తుతం సామ్రాట్ దగ్గర తులసి హవా నడుస్తోంది, ఆయన తులసి మాయలో ఉన్నారు.. తులసి ఏం చెప్పినా చప్పట్లు కొట్టే స్టేజ్ లో ఉన్నాడని లాస్య అంటుంది. చదువు రాణి తులసి ముందు వర్క్ ఒకే చేయమని అడగడం కోసం తులసి చుట్టూ తిరగడం తన వల్ల కావడం లేదని నందు మండిపడతాడు. తులసి మెప్పు పొందటం కోసం సామ్రాట్ నానా తిప్పలు పడుతున్నాడు, నీ మాజీ భార్య గురించి ముందు ముందు నీకే తెలుస్తుందని లాస్య అంటుంది.
Also Read: వేద, యష్ ని కలిపేందుకు ఖుషి చీటీల ఆట - ఖైలాష్ గురించి తెలుసుకున్న అభి, కన్నింగ్ ప్లాన్స్ రెడీ
ప్రేమ్ శ్రుతి కోసం ఆలోచిస్తూ డైరీలో తన బాధనంతా రాసుకుంటాడు. అటు శ్రుతి కూడా ప్రేమ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అంకిత ప్రేమ్ గదికి వచ్చి అంతా శుభ్రం చేస్తూ ఆ డైరీని చూసి అందులో ఉన్న రాసిన దాని చదివి బాధపడుతుంది. ఇక తులసి మ్యాటర్ నందు సామ్రాట్ ముందుకి వస్తుంది. నేను చెప్పిన ప్లాన్ తులసికి నచ్చడం లేదని చెప్తాడు. ఇక తులసి ప్రాబ్లం ఎంతో చెప్పమని సామ్రాట్ అడుగుతాడు. మ్యూజిక్ స్కూల్ వాతావరణం బాగుండాలని కోరుకున్నాను అదే నందగోపాల్ గారికి చెప్పాను అది తప్పా. నేను పెద్దగా చదువుకోలేదు వ్యాపారం అంటే నాకు తెలియదు. కొంతమంది మనుషులు జీవితాన్ని కూడా వ్యాపారం లాగే చూస్తారు. కట్టుకున్న మనిషి నచ్చకపోతే మోజు తిరిపోతే ఆ కట్లు తెంపుకుని ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్లిపోతారు లాభ నష్టాలని బేరీజు వేసుకుంటారని తులసి నందుని ఉద్దేశించి చెప్తుంటే అది సామ్రాట్ ఏం అర్థం కాక అయోమయంగా చూస్తాడు. నాకు అలాంటి వ్యాపారం కూడా తెలియదు సర్. నా వల్ల మీకు నష్టం జరగాలని కోరుకోలేదు. భవిష్యత్ లో మీకు ఎంతో గొప్ప పేరు తెచ్చేలా ఎదిగేలా చెయ్యాలని ఆశ. మీకు నా మీద నమ్మకం లేకపోతే నా దారి నేను చూసుకుంటాను. ఏ చెట్టు మీదో సంగీత పాటలు చెప్పుకుంటాను అని తులసి వెళ్లబోతుంటే సామ్రాట్ ఆపేస్తాడు. తులసి గారు ఎలా కోరుకుంటే అలాగే బిల్డింగ్ ఐడియా మార్చమని నందుకి పురామయిస్తాడు. డబ్బు నుంచి వ్యాపారం నుంచి కళలని వేరు చేసి చూసే తులసిగారి ఆలోచన నాకు బాగా నచ్చిందని అంటాడు. మీరు అనుకున్నది జరిగేలా చూస్తాను అని సామ్రాట్ చెప్తాడు.
Also Read: రుక్మిణికి షాకింగ్ విషయం చెప్పిన భాగ్యమ్మ- గాయాలతో ఇంటికి వచ్చిన దేవి, అల్లాడిపోయిన రుక్మిణి
ఇప్పుడు దండాలు పెట్టుకుంటున్నారు రేపో మాపో దండలు మార్చుకుంటారు చూస్తూ ఉండు అని లాస్య సెటైర్ వేస్తుంది. అంకిత ప్రేమ్ డైరీ ఇస్తుంది. శ్రుతిని ఎందుకు బాధపెట్టావ్ అని అడుగుతుంది. ఈ డైరీ చదివినాక కూడా నీకు అలాగే అనిపిస్తుందా వదినా.. కనీసం క్షమాపణ చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా ఇంత పెద్ద శిక్ష వెయ్యడం న్యాయమా అని అంటాడు. ఎవరి ఆలోచనలు వాళ్ళకి ఉంటాయి అందుకే కదా నాకు అభికీ మధ్య దూరం పెరిగిందని అంకిత అంటుంది. నీలో నువ్వు బాధపడటం ఎందుకు తల్లి దగ్గర దేవుడు ముందు చేసిన తప్పు చెప్పుకోడానికి సిగ్గు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన తప్పులు సరిదిద్ది జీవితాన్ని ఒక దారిలో పెట్టేది వాళ్ళే అని అంకిత హితబోధ చేస్తుంది. ఈ విషయం ఎక్కువ రోజలు దాగదని అంకిత అంటుంది. అమ్మకి విషయం తెలిసేలోపు శ్రుతి ఎక్కడ ఉందో వెతికి పట్టుకుంటానని నమ్మకంగా చెప్తాడు. నా అంతట నేను ఇంట్లో విషయం మాత్రం చెప్పను అని అంకిత హామీ ఇస్తుంది. ఇక హనీ బాధగా ఇంట్లో కూర్చుని ఉంటే సామ్రాట్ ఏమైందని అడుగుతాడు.
తరువాయి భాగంలో..
నందు తులసి ఇంటికి వస్తాడు. ఒక నిజం సామ్రాట్ గారికి తెలియకుండా ఉంటే బాగుండు అనిపిస్తుందని నందు అంటాడు. ఏంటి ఆ నిజం అని తులసి అడుగుతుంది. నేను నీ మాజీ భర్తని అని అంటాడు. ఒకప్పుడు నన్ను భార్య అని చెప్పుకోడానికి అసహ్యపడే వాళ్ళు ఇప్పుడు నా మాజీ భారత అని చెప్పుకోడానికి భయపడుతున్నారు. మీరు నా ముగ్గురు పిల్లలకి తండ్రి కాబట్టి సామ్రాట్ గారికి నా అంతట నేను నిజం చెప్పను అడిగితే మాత్రం అబద్ధం చెప్పను అని అంటుంది.