Ennenno Janmalabandham August 1st Update: వేద, యష్ ని కలిపేందుకు ఖుషి చీటీల ఆట - ఖైలాష్ గురించి తెలుసుకున్న అభి, కన్నింగ్ ప్లాన్స్ రెడీ
ఖైలాష్ చెప్పినట్టుగానే కాంచన తన తల్లి ముందు బాధపడుతుంది. దీంతో కూతురు బాధపడటం చూడలేక మాలిని ఖైలాష్ ని ఎలాగైనా విడిపిస్తానని హామీ ఇస్తుంది. ఈ పరజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
వేద, ఖుషి, యష్ కలిసి సంతోషంగా ఆడుకుంటూ సమయం గడుపుతారు. మాలిని కాంచన దగ్గరకి వచ్చి అన్నం తినడానికి రమ్మని పిలస్తుంది. ఖైలాష్ చెప్పిన మాటలు గుర్తు చేసుకున్న కాంచన తల్లి ముందు ఏడుపు మొదలుపెడుతుంది. నీ చేత్తోనే నాకు కాస్త విషం ఇచ్చి చంపేయమ్మా అని అడుగుతుంది. అవతల నీ కోడలు అల్లుడు సంతోషంగా ఆడుతూ పాడుతూ ఉన్నారు ఇవతల నీ కూతురు బతుకేంటి, జైల్లో ఉన్న నీ అల్లుడు పరిస్థితి ఏంటి, ఆయన్ని ఎవరు బయటకి తీసుకురావలమ్మా నేను ఇలాగే ఏడ్చుకుంటూ ఉండాలా.. నువ్వు వెళ్ళి కేసు వాపసు తీసుకుంటే తప్ప మా ఆయన బయటకి రాడమ్మా.. ఆయన్ని ఎవరు బయటకి తీసుకురావలమ్మా చెప్పు అని ఏడుస్తూ అడుగుతుంది. నా ఆలోచన అంతా నీ గురించే కంచు, నీ సమస్య ఎలా తీర్చలా అని సతమతమవుతున్నాను అని మాలిని అంటుంది. అయినా నీ వల్ల ఏమి కాదమ్మా ఇప్పుడు ఇంటి పెత్తనం అంతా ఆ వేదదే అని కంచు అనేసరికి మాలిని కోప్పడుతుంది. ఈ ఇల్లు నాది ఎవరే ఆ వేద నా కొడుకు నా మాట వినక తన మాట వింటాడా అని అంటుంది. నేను నోరు తెరిచి అడగాలే కానీ నా మాట యష్ కాదనడు అని ధైర్యం చెప్తుంది. యష్ తో నేను మాట్లాడి ఖైలాష్ ని బయటకి విడిపిస్తాను అని హామీ ఇస్తుంది. చూస్తాను అమ్మ యష్ నీ మాట వింటాడో ఆ వేద మాట వింటాడో అని కాంచన అంటుంది. ఖుషి కోసం పాలు తీసుకుని వేద వస్తుంది. మీరు తాగితేనే నేను తాగుతా అని ఖుషి మారాం చేస్తుంది. దీంతో మొదట ఆ పాలు వేద తాగి తర్వాత యష్ కూడా తాగుతాడు.
Also Read: రుక్మిణి నీదగ్గరకి వచ్చిందా అని భాగ్యమ్మని నిలదీసిన దేవుడమ్మ- రుక్మిణి దగ్గర సత్య ఆవేదన
గుడిలో యష్ అన్న మాటలు తలుచుకుంటూ మాళవిక బాధపడుతుంది. అంతగా ఆలోచించడానికి ఏమి లేదు అనవసరమైన ఆలోచనలు ఎందుకు చేస్తావ్ అని అభిమన్యు అంటాడు. వేద, యష్ ఎందుకు విడిపోయారు మళ్ళీ ఎలా కలుసుకున్నారు, ఈ మధ్యలో ఖుషి ఎందుకు మిస్ అయ్యింది అని మాళవిక అనుమానపడుతుంది. మనల్ని ఈ డైలామాలోకి నెట్టడానికే ఇలా చేశారని అభి అంటాడు. యశోధర్ సంగతి నాకు బాగా తెలుసు ఒక్కసారి నిర్ణయం తీసుకున్నదంటే కట్టుబడి ఉంటాడు వెనక్కి తగ్గడు అని మాళవిక అనడంతో అభికి కాలుతుంది. తిట్టుకోవాల్సిన మనిషిని తెగ పొగిడేస్తున్నావ్ మాజీ మొగుడు మీద మళ్ళీ మోజు పుట్టుకొస్తుందా అని అభి అడుగుతాడు. జలస్ గా ఫీల్ అవడంలో నువ్వు ఆడవాళ్ళు లాగా ప్రవర్తిస్తావ్ అని మాళవిక అంటుంది. వేద, యశోధర్ మధ్య ఏదో నడుస్తుంది అదేంటో తెలుసుకోవాలి.. అది తెలిస్తే వాళ్ళు మన చేతిలో ఇరుక్కునట్టే అని అభి అంటాడు. వేద, యష్ ని దగ్గర చేసేందుకు ఖుషి ప్రయత్నిస్తుంటుంది. ఇద్దరు ఒకరికోసం ఒకరు డ్రెస్స్ లు సెలెక్ట్ చెయ్యమని చీటీలు పెడుతుంది. దీంతో వేద యష్ కోసం డ్రెస్స్ తీస్తే యష్ వేద కోసం డ్రెస్స్ తీసి పెడతాడు. అదంతా చూస్తూ ఖుషి సంతోషిస్తుంది.
Also Read: తులసి - సామ్రాట్‌కి పెళ్లి జరగబోతుందా? నందుని ఒక ఆట ఆడేసుకున్న తులసి
ఇక వేద వల్ల ఇంట్లో ఏం జరిగిందో చెప్పడానికి మాళవిక ఫ్రెండ్ తారా అభిమన్యు ఇంటికి వస్తుంది. ఆ వేద మీద నువ్వు గెలవబోతున్నావ్ కంగ్రాట్స్ మాళవిక, నువు ఆ యష్ మీద పై చెయ్యిగా గెలవబోతున్నావ్ కంగ్రాట్స్ అభిమన్యు అని అంటుంది. యష్ ఇంట్లో సునామీ పుట్టింది వాళ్ళని అల్లాడించి దిక్కుతోచని పరిస్థితిలు కల్పించింది. ఆ సునామీ పేరే ఖైలాష్.. అంటూ జరిగింది అంతా పూసగుచ్చినట్టు చెప్తుంది. అది విని వాళ్ళిద్దరూ సంతోషిస్తారు. ఖైలాష్ ని అడ్డుపెట్టుకుని కుట్రలు చెయ్యాలని అభి అనుకుంటాడు. ఇక వేద, యష్ ఇద్దరు కలిసి నవ్వుతూ తినాలని ఖుషి మరో చీటి పెడుతుంది. అది చూసి ఇద్దరు అతి కష్టంగా నవ్వుతూ తింటారు. ఖుషి సంతోషంగా వాళ్ళ దగ్గరకి వచ్చి మీరిద్దరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలని అంటుంది. నీ కోసం మేము ఏమైనా చేస్తామనాయి వేద అంటుంది.
తరువాయి భాగంలో..
నువ్వు ఎప్పుడు కామాలు పెడుతూ వెళ్తున్నావ్ యశోధర్ నేను ఇప్పుడు ఒకేసారి ఫులు స్టాప్ పెడదామని అహిమాన్యు అంటాడు. నా మీద గెలుద్దామనే అని యష్ అంటే గెలవలేననా అని అభి అడుగుతాడు గెలవడానికి ఉక్రోషం ఉంటే సరిపోదు వ్యూహం కావాలి అంటాడు. ఆ వ్యూహాలే రచించడానికి వెళ్తున్నాను.. నీ మీద సంధించడానికి ఒక బాణాన్ని సిద్ధం చెయ్యడానికి వెళ్తున్నా అని అభి చెప్తాడు. ఆ బాణం తిరిగి తిరిగి నీకే గుచ్చుకోకుండా చూసుకోమని యష్ హెచ్చరిస్తాడు.