Devatha July 30th Update: రుక్మిణి నీదగ్గరకి వచ్చిందా అని భాగ్యమ్మని నిలదీసిన దేవుడమ్మ- రుక్మిణి దగ్గర సత్య ఆవేదన
మాధవ దేవికి అబద్ధాలు చెప్పి తన మనసు పాడు చేస్తున్నాడని ఆదిత్య, రుక్మిణి బాధపడుతూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
ఆదిత్య దేవి గురించే ఆలోచిస్తుంటాడు. నా కూతురు నిజం తెలియక ఆ మాధవగాడిని నమ్మి నా మీద ద్వేషం పెంచుకుంటుంది. తానే ప్రాణంగా బతికే నాన్న ఉన్నాడని తెలియక తన తండ్రి అంతా దుర్మార్గుడా అని లోలోపల ఆ పసో మనసు అల్లాడిపోతుంది. ఇంక ఆలస్యం చేస్తే అది నా కూతురుకి మంచిది కాదు అందుకే నా కూతురు బాధపడకుండా నన్ను అపార్థం చేసుకోకుండా నిజం చెప్పాలి. నా బిడ్డని నా దగ్గరకి తెచ్చుకోవాలి అని ఆదిత్య దేవి గురించి మనసులో బాధపడుతూ ఉంటాడు. గదిలో నేను ఉన్నాను అనేది కూడా మర్చిపోయి ఆలోచిస్తున్నాడంటే అది దేవి గురించే అయ్యి ఉంటుంది. దేవి.. దేవి.. అంటూ దేవి ప్రపంచం అన్నట్టు తయారవుతున్నాడు. అక్క అంటే ప్రాణంగా బతికిన ఆదిత్య అక్క లేదని తన మీద ప్రేమ దేవి మీద చూపిస్తున్నాడా అని సత్య లోలోపల బాధపడుతుంది.
సత్య రుక్మిణి దగ్గరకి వస్తుంది. నిన్న ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేశాము కానీ వ్రతం పూర్తయ్యే సమయానికి ఆదిత్య దేవితో బయటకి వచ్చాడు. సాయంత్రం వరకు ఇంటికి రాలేదు. వ్రతం పూర్తయ్యాక ఆశీర్వాదం తీసుకోవాలి కదా కానీ ఆదిత్య లేడు. అక్కా నాకేం జరుగుతుందో అర్థం కావడం లేదు. నీకేమైన తెలుసా.. దేవి వల్ల కానీ నీ వల్ల కానీ ఆదిత్య బాధపడుతున్నాడా అని సత్య రుక్మిణిని అడుగుతుంది. నా వల్ల ఎందుకు బాధపడతాడు అని రుక్మిణి అంటుంది. దేవి కోసం ఇక్కడికి వస్తే బావగారు ఏదైనా అన్నారా అని అడుగుతుంది. అలా ఏమి లేదని రుక్మణి అంటుంది. మా అక్క గురించి బాధపడుతున్నాడా అనేసరికి రుక్మిణి షాక్ అవుతుంది. అంటే మా అక్కని గుర్తు చేసుకుని బాధపడుతున్నాడా అని నా అనుమానం. దేవి గురించి బాధపడుతున్నాడా అంటే అదేమీ లేదని అంటున్నావ్. నీకేం తెలుసో నాకు తెలియదు కానీ నా పరిస్థితి ఉన్నది ఉన్నట్టు చెప్పాను చేయగలిగితే ఏదైనా చెయ్యి అని సత్య రుక్మిణిని అడుగుతుంది.
నీ అనుమానం నిజమే పెనిమిటి అంత పరేషన్ అవుతున్నాడంటే అందుకు కారణం నేను, దేవినే. ఈ విషయం నీకు ఇప్పుడే చెప్పలేను, ఈ కష్టం నీకు ఎన్నో రోజులు ఉండదు. త్వరలోనే నీకు బిడ్డని ఇచ్చి నిన్ను ఆదిత్యని సంతోషంగా ఉండేలా చేస్తాను అని రుక్మిణి ఏడుస్తుంది. సూరి రుక్మిణి ఫోటో పట్టుకుని ఈ అమ్మాయిని ఎక్కడైనా చూశారా అని అందరినీ అడుగుతూ ఉంటాడు.
ఆదిత్య: ఏం జరిగింది రుక్మిణి.. అర్జెంట్ గా కలవాలని అన్నావ్
రుక్మిణి: ఇంట్లో ఏదో జరుగుతుంది పెనీవీటి అర్థం కావడం లేదు. గా మాధవ సారు బిడ్డకి ఆ మాటలు చెప్పి మనసు పాడు చేశాడు. నీతో తన్నులు తిని గది బిడ్డని దూరం చేయడానికి అడ్డుపెట్టుకుంటున్నాడు
ఆదిత్య: వద్దు రుక్మిణి వాడు చేసిన పని మళ్ళీ మళ్ళీ గుర్తు చెయ్యకు. గుండె మండిపోతుంది.
రుక్మిణి: కొత్తగా నాతో దాగుడు మూతలు ఆడుతున్నాడు. నా ముందుకు రాకుండా చాటుగా ఏదో చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడో సమజవతలేదు
ఆదిత్య: నా బిడ్డకి నన్ను పగవాడిని చేశాడు ఇంక ఏం చేస్తాడు రుక్మిణి
రుక్మిణి: ఏదో చేస్తున్నాడు నాకు అర్థం అవుతుంది.. ఈ సారి ఏమైనా చేస్తే విడిచిపెట్టేదె లేదు నా సంగతి ఆ సారుకు పూర్తిగా తెలియదు. ఏవేవో అనుకుంటున్నాడు. నేను బిడ్డ కోసమే తగ్గినా పాత రుక్మిణి అయితే ఈ పాటికి వాడి సంగతి చెప్పేదాన్ని
ఆదిత్య: జాగ్రత్త రుక్మిణి వాడు కనిపించెంత మంచివాడు కాదు వాడిలో ఇంకో మనిషి ఉన్నాడు
రుక్మిణి: సత్య మాటలు గుర్తు చేసుకుంటుంది. సత్య నాదగ్గరకి వచ్చి చాలా బాధపడింది అని జరిగింది అంతా చెప్తుంది. నా చెల్లికి నువ్వంటే ప్రాణం పెనీవీటి దాన్ని కష్టపెట్టకుండా చూసుకో. కష్టమంటే తెలిసిన నాకు సుఖమంటే ఎంటో నీదగ్గరకి వచ్చినాకే తెలిసింది. కానీ నా చెల్లి అలాంటిది కాదు దాని కష్టం కూడా నేనే మోసా. దాన్ని కష్ట పెట్టకుండా చూసుకో అని చెప్పి వెళ్ళిపోతుంది.
Also Read: జైలు నుంచి బయటికి వచ్చేందుకు ఖైలాష్ ప్లాన్, కాంచనకి వేద క్షమాపణలు- ఖైలాష్ ని విడిపించమన్న మాలిని
దేవుడమ్మ భాగ్యమ్మ దగ్గరకి వస్తుంది. రుక్మిణి బతికే ఉందని అంటుంటే నాదగ్గరకి ఎందుకు రావడం లేదు. ఏ బిడ్డకి అయినా కష్టం అంటే ముందు తల్లి దగ్గరకే వస్తుంది.. భాగ్యమ్మ రుక్మిణి నీ దగ్గరకి వచ్చిందా తన కష్టం ఇది అని నీతో ఏమైనా చెప్పుకుందా చెప్పు అని ఏడుస్తూ అడుగుతుంది. ఎప్పుడు లేనిది నువ్వు కమలని అరిహి నువ్వు ఇల్లు వదిలి వచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది.. ఆ అనుమానంలో నిజం ఎంత ఉందో నిన్నే అడిగి తెలుసుకుందామని వచ్చాను. నిజం చెప్పు భాగ్యమ్మ నువ్వు రుక్మిణి కలిశావా, మాట్లాడావ.. రుక్మిణి వస్తే సత్య కాపురం ఎక్కడ ఇబ్బందుల్లో పడుతుందో అని రావడం లేదేమో ఊరందరికీ న్యాయం చెప్పే నేను నా కోడలికి అన్యాయం చేస్తానా.. నిజంగానే నీ దగ్గరకి రుక్మిణి రాలేదా భాగ్యమ్మ అని అడుగుతూ దేవుడమ్మ బాధపడుతుంది.