News
News
X
IND in ZIM, 3 ODI Series, 2022 | 2nd ODI | Harare Sports Club, Harare - 20 Aug, 12:45 pm IST
(Match Yet To Begin)
ZIM
ZIM
VS
IND
IND
Asia Cup Qualifier, 2022 | Match 1 | Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman - 20 Aug, 07:30 pm IST
(Match Yet To Begin)
SIN
SIN
VS
HK
HK

Gruhalakshmi July 30th Update: తులసి - సామ్రాట్‌కి పెళ్లి జరగబోతుందా? నందుని ఒక ఆట ఆడేసుకున్న తులసి

తులసి ఇంటికి సందు,లాస్య వస్తారు. వాళ్ళని ఒక ఆట ఆడేసుకుంటుంది తులసి ఫ్యామిలీ. ఇరపజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 

ప్రైజ్ తీసుకున్న తర్వాత తులసి వెళ్లబోతుంటే హనీ ఆపి సామ్రాట్ పక్కన నిలబెట్టి ఫోటో తీయించుకుంటుంది. ఒకప్పుడు నీ పక్కన కుదురుగా నిలబడే తులసి ఇప్పుడు నీ కళ్ల ముందే బెదురు లేకుండా మరొకరి పక్కన నిలబడింది. హనీ అమ్మ ప్లేస్ లో నిలబడిందని లాస్య నందుకు ఎక్కించే ప్రయత్నం చేస్తుంది. ఇక బహుమతి గెలుచుకున్నందుకు హనీ చాలా సంతోషంగా ఉంటుంది. అది చూసి సామ్రాట్ మురిసిపోతూ తులసి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. హనీ నవ్వుకు కారణం ఎవరో తెలుసా తులసి. ఆమె హనీ జీవితంలోకి వచ్చాక చాలా మార్పులు వచ్చాయి. ఏమాత్రం సంబంధం లేని హనీ విషయంలో ఇంత చేస్తుందంటే ఇంక తన వాళ్ళ విషయంలో ఇంక బాగా చూసుకుంటుంది కదా. తనకి చేతులెత్తి దణ్ణం పెట్టాలనిపిస్తుంది బాబాయ్ అని సామ్రాట్ తులసిని పొగడ్తల్లో ముంచెత్తుతాడు. హనీ విషయంలో ఏమో కానీ నీ విషయంలో వచ్చిన మార్పు చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని సామ్రాట్ బాబాయ్ అంటాడు. ప్రతి వాళ్ళని డబ్బు మనుషులంటూ అనుమానంగా చూసే నువ్వు మొదటి సారి తులసి నిజాయితిని, మంచితనాన్ని మెచ్చుకుని గుర్తించావ్ అని అంటాడు. ప్రపంచంలో అందరూ డబ్బు మనుషులే కాదు తులసి లాంటి వాళ్ళు కూడా ఉంటారు అని సామ్రాట్ అంటాడు. ఈ సందర్భంలో నిన్ను ఒకటి అడుగుతాను.. పెళ్లి గురించి నీ నిర్ణయం మార్చుకోరా అని అడుగుతాడు. 

నందు, లాస్య తులసి ఇంటికి వస్తారు. చీటింగ్ చీటింగ్ అనగానే ఈ ఛీటర్స్ ప్రత్యక్షమయ్యారేంటి అని పరంధామయ్య నందు వాళ్ళని అవమానకరంగా మాట్లాడతాడు. వాళ్ళు బిజినెస్ పని మీద వచ్చారని తులసి అంటుంది. మ్యూజిక్ స్కూల్ ప్లాన్ గురించి మాట్లాడటానికి వచ్చామని నందు అంటాడు. మ్యూజిక్ స్కూల్ కి ఇన్వెస్ట్మెంట్ చేసేది సామ్రాట్ వాళ్ళు కదా ఆంటీ అని అంకిత తులసిని అడుగుతుంది. వీళ్ళు సామ్రాట్ దగ్గర పని చేస్తున్నారని చెప్తుంది. ఆ మాటకి అవునా వీళ్ళు పనోళ్లా అని అనసూయ నవ్వుతుంది. సామ్రాట్ గారు చెప్పారు కాబట్టి ఈ ఇంటి గడప తొక్కామ్ అని నందు అంటే.. ఇష్టమా లేకపోతే చెప్పు ఇటు నుంచి ఇటే వెళ్లిపోతామని లాస్య అంటుంది. ఆ మాటకి సరే వెళ్లిపోండి అని తులసి అనడంతో నందు వాళ్ళు షాక్ అవుతారు. నిజంగా  అంటున్నావా అని లాస్య అంటుంది.. నీతో జోక్ చెయ్యడానికి నువ్వేమైన నా సవతివా అని తులసి అంటుంది. మేము సామ్రాట్ గారి దగ్గర హోదాలో పని చేస్తున్నామని నందు చెప్తాడు. అయితే ఏంటి నేను సామ్రాట్ గారితో వ్యాపార భాగస్వామిని.. ఆయన దగ్గర పని చేస్తున్న ఉద్యోగులందరూ నా కింద కూడా పని చేస్తున్నట్టే అని తులసి వాళ్ళని ఒక ఆట ఆడుకుంటుంది. నేను ఇలాగే మాట్లాడతాను ఇలాగే ప్రవర్తిస్తాను ఇష్టం ఉంటే ఉండండి లేదంటే వెళ్ళండి నష్టం మీకే మీరే వెళ్ళి సామ్రాట్ గారికి చెప్పండి అని తులసి చెప్తుంది. 

నందు తులసి అని పిలుస్తాడు.. ఆ మాటకి కట్టుకున్న పెళ్ళాన్ని పిలిచినట్టు ఏంటి ఆ పిలవడం అని అనసూయ తిడుతుంది. దీంతో తులసి గారు అని నందు పిలుస్తాడు;. మ్యూజిక్ స్కూల్ కి సంబంధించి డిజైన్స్ పట్టుకుని వచ్చాం మీరు చూసి ఒకే చేస్తే సామ్రాట్ గారికి చెప్తాం అని నందు అంటాడు. తండ్రిని అవమానించడం చూడలేక అభి బాధపడతాడు. అంకుల్ అంటే ఇక్కడ ఎవరికి శత్రుత్వం లేదు అని అంకిత సర్ది చెప్తుంది. ఇక స్కూల్ ప్లాన్ మొత్తం నందు తులసికి వివరంగా చెప్తాడు. ప్లాన్ ఎలా ఉంది తులసి మేడమ్ మీరు ఒకే అంటే సార్ కి చెప్తామని అంటాడు. నాకు నచ్చలేదని తులసి చెప్తుంది. ప్లాన్ లో ఉన్న అభ్యంతరాలు ఎంటో చెప్పమని అడుగుతాడు. ఈ ప్లాన్ లో స్కూల్ తో పాటు షాపింగ్ కాంప్లెక్స్ పెట్టడం నాకు నచ్చలేదని తులసి అంటుంది.  

తరువాయి భాగంలో..  

మ్యూజిక్ స్కూల్ అంటే పాట పాడేలా  ఉండాలని తులసి చెప్తుంది. కేవలం ఒక స్కూల్ కి మాత్రమే ఆ ప్లేస్ యూజ్ చేస్తే ఉపయోగముండదని నందు సామ్రాట్ కి చెప్తాడు. కొంతమంది మనుషులు జీవితాన్ని కూడా వ్యాపారంలాగా చూస్తారు. కట్టుకున్న మనిషి నచ్చకపోతే కొందరు వెతుక్కుంటూ మరో మనిషితో వెళ్లిపోతారు. మీకు నా మీద నమ్మకం లేకపోతే నాదారి నేను చూసుకుంటాను అని తులసి సామ్రాట్ తో చెప్తుంది. 

Also Read: హిమతో ప్రేమ్ ప్రేమపాటలు, శౌర్య కిడ్నాప్ వెనుకున్నది శోభేనా!

Also Read: రుక్మిణి నీదగ్గరకి వచ్చిందా అని భాగ్యమ్మని నిలదీసిన దేవుడమ్మ- రుక్మిణి దగ్గర సత్య ఆవేదన

Published at : 30 Jul 2022 08:50 AM (IST) Tags: Gruhalakshmi serial Gruhalakshmi Serial today episode Gruhalakshmi Serial Today Episode Written Update Gruhalakshmi Serial July 30th

సంబంధిత కథనాలు

Dirty Picture Sequel: విద్యా బాలన్ 'డర్టీ పిక్చర్'కు సీక్వల్, ఆ పాత్ర చేసేందుకు కంగనా తిరస్కరణ?

Dirty Picture Sequel: విద్యా బాలన్ 'డర్టీ పిక్చర్'కు సీక్వల్, ఆ పాత్ర చేసేందుకు కంగనా తిరస్కరణ?

Chiranjeevi Birthday Special: 30 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలో సందడి చేయనున్న ‘ఘరానా మొగుడు’

Chiranjeevi Birthday Special: 30 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలో సందడి చేయనున్న ‘ఘరానా మొగుడు’

The Ghost Promo: ‘ది ఘోస్ట్’ ప్రోమో: ‘థమహగానే’ సీన్‌తో నాగ్ ఎంట్రీ - అంచనాలు పెంచేస్తున్న కింగ్ మూవీ!

The Ghost Promo: ‘ది ఘోస్ట్’ ప్రోమో: ‘థమహగానే’ సీన్‌తో నాగ్ ఎంట్రీ - అంచనాలు పెంచేస్తున్న కింగ్ మూవీ!

రామానాయుడు ఫ్యామిలీకి హైకోర్టు గుడ్‌న్యూస్, తెలంగాణ సర్కార్‌కు షాక్ - కీలక తీర్పు

రామానాయుడు ఫ్యామిలీకి హైకోర్టు గుడ్‌న్యూస్, తెలంగాణ సర్కార్‌కు షాక్ - కీలక తీర్పు

Guppedantha Manasu ఆగస్టు 18 ఎపిసోడ్: వసుకి క్యారియర్ పంపించి జగతికి అన్నం తినిపించిన రిషి, దేవయానిలో మొదలైన భయం

Guppedantha Manasu ఆగస్టు 18 ఎపిసోడ్:  వసుకి క్యారియర్ పంపించి జగతికి అన్నం తినిపించిన రిషి, దేవయానిలో మొదలైన భయం

టాప్ స్టోరీస్

Breaking News Live Telugu Updates: టీఆర్ఎస్ లీడర్ హత్య కేసులో నిందితుల అరెస్టు

Breaking News Live Telugu Updates: టీఆర్ఎస్ లీడర్ హత్య కేసులో నిందితుల అరెస్టు

Amit Shah Munugode Tour: 21న మునుగోడుకు అమిత్ షా, తరుణ్ చుగ్ వెల్లడి - షెడ్యూల్ ఇలా!

Amit Shah Munugode Tour: 21న మునుగోడుకు అమిత్ షా, తరుణ్ చుగ్ వెల్లడి - షెడ్యూల్ ఇలా!

KCR News: 21న కరీంనగర్‌కు సీఎం కేసీఆర్, ఆసక్తికరంగా ఆ ఏర్పాట్లు - గతంలో ఎప్పుడూ లేనట్లుగా

KCR News: 21న కరీంనగర్‌కు సీఎం కేసీఆర్, ఆసక్తికరంగా ఆ ఏర్పాట్లు - గతంలో ఎప్పుడూ లేనట్లుగా

AP Teachers : "మిలియన్ మార్చ్" నిర్వీర్యం కోసమే టార్గెట్ చేశారా ? ఏపీ టీచర్లు ప్రభుత్వంపై ఎందుకంత ఆగ్రహంగా ఉన్నారు ?

AP Teachers :