Devatha August 1st Update: రుక్మిణికి షాకింగ్ విషయం చెప్పిన భాగ్యమ్మ- గాయాలతో ఇంటికి వచ్చిన దేవి, అల్లాడిపోయిన రుక్మిణి
గాయాలతో ఇంటికి వచ్చిన దేవిని చూసి రుక్మిణి అల్లాడిపోతుంది. తనకి ఎలాగైనా ధైర్యం వచ్చేలా చెయ్యాలి తన మనసులోని ఆలోచనలు తీసేయాలని రుక్మిణి అనుకుంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
అందరికీ కనిపిస్తున్న రుక్మిణి నాకు మాత్రం ఎందుకు కనిపించడం లేదు, రాకూడని పరిస్థితుల్లో ఉందా లేక నా వల్ల ఏదైనా తప్పు జరిగి రాకూడదు అనుకుందా అని దేవుడమ్మ భాగ్యమ్మ దగ్గర వాపోతుంది. చాటుగా అయినా నీ దగ్గరకి రుక్మిణి వచ్చిందేమో అని ఆశగా ఆడగటానికి వచ్చానని అంటుంది. అన్నం పెట్టిన నీకు అబద్ధం చెప్పినా నన్ను మన్నించు తల్లి నా బిడ్డకి ఇచ్చిన మాట కోసం నీదగ్గర నిజం చెప్పలేకపోయాను అని భాగ్యమ్మ కుమిలిపోతుంది. దేవి, చిన్మయి బాధగా ఇంటికి వస్తారు. దేవి ముఖం నిండా దెబ్బలు ఉండేసరికి రుక్మిణి కంగారుగా ఏమైందని అడుగుతుంది. స్కూల్ లో కొందరు దేవితో గొడవ పడ్డారు వాళ్ళు తనని కొట్టబోతుంటే నాకు బాగా కోపం వచ్చింది వాళ్ళని వెళ్ళి కొట్టి తరిమేశాను అని చిన్మయి చెప్తుంది. అయిన నువ్వు ఏం చేశావని నీ మీద కలబడ్డారని అడుగుతుంది. ఈరోజు స్కూల్ లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు దేవికి కొద్దిగా మార్కులు తక్కువ వచ్చాయి.. అందుకని క్లాస్ లో కొంతమంది పిల్లలు కామెంట్స్ చేసేసరికి దేవికి కోపం వచ్చి వాళ్ళని కొట్టింది వాళ్ళందరూ కలిసి దేవిని కొట్టారని చిన్మయి చెప్తుంది. ఈసారి దేవికి ఎప్పటికంటే మార్కులు తక్కువ వచ్చాయని అంటుంది. అదేంటి మంచిగా చదవడం లేదా అని రుక్మిణి అంటుంది. ఇద్దరికీ మార్కులు ఎన్ని వచ్చాయో చెప్పమని చిన్మయిని అడుగుతుంది.
Also Read: వేద, యష్ ని కలిపేందుకు ఖుషి చీటీల ఆట - ఖైలాష్ గురించి తెలుసుకున్న అభి, కన్నింగ్ ప్లాన్స్ రెడీ
నిన్ను కలెక్టర్ ని చెయ్యాలని ఆశగా ఎదురు చూస్తుంటే నువ్వు ఇలా చదువుతున్నావెంటీ అని రుక్మిణి అడుగుతుంది. ఏమైంది ఎందుకు ఇలా ఉంటున్నావ్ ఇలా చదివితే కలెక్టర్ ఎలా అవుతావ్ అని రుక్మిణి అడుగుతుంది. చదివినా గుర్తుండటం లేదు నాయనే గుర్తొస్తున్నాడు, ఆయన నిన్ను పెట్టిన బాధలు గుర్తుకు వస్తున్నాయి అని దేవి అమాయకంగా చెప్తుంటే రుక్మిణి బాధపడుతుంది. ఆ మాధవ సారు నా బిడ్డ మనసు పాడు చేస్తున్నాడు అనుకున్నా కానీ నా బిడ్డ చదువు కూడా పాడు చేస్తున్నాడు. మనసులో వాళ్ళ నాయన ఇలాంటి వాడా అని బాధపడుతున్నట్టు ఉంది.. ఇలాగే ఉంటే నా బిడ్డ పిచ్చిది అయిపోతుంది. తనకి ధైర్యం చెప్పాలి తన మనసు మార్చాలి అని రుక్మిణి మనసులో అనుకుంటుంది. సూరి గబగబ ఇంట్లోకి వస్తాడు. ఏమైందని రాజమ్మ అడుగుతుంది. వాడినమ్మ బాధ చూడలేక రుక్మిణిని వెతకడం కోసం పక్క ఊరికి వెళ్లానని చెప్తుంటే అప్పుడే అక్కడికి ఆదిత్య వచ్చి వాళ్ళ మాటలు వింటాడు. సమయం చూసి రుక్మిణి గురించి చెప్పాలని ఆదిత్య అనుకుంటాడు.
Also Read: రుక్మిణి నీదగ్గరకి వచ్చిందా అని భాగ్యమ్మని నిలదీసిన దేవుడమ్మ- రుక్మిణి దగ్గర సత్య ఆవేదన
దేవిని రుక్మిణి కరాటే నేర్పించే దగ్గరకి తీసుకొస్తుంది. నువ్వు ఆఫీసర్ కావడానికి చాలా దూరం పోవాలి దేని మీద అయిన నెగ్గాలంటే గుండె నిబ్బరం ఉండాలి అది కావాలంటే నువ్వు ఇది నేర్చుకోవాలి. నలుగురు కొట్టినప్పుడు ఏడ్చుకుంటూ ఇంటికి రావడం కాదు వాళ్ళు ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళేలా చెయ్యాలి. అందుకే నువ్వు ఇది నేర్చుకోవాలి అని ధైర్యం చెప్తుంది. ఇక కరాటే నేర్పించమని రుక్మిణి అక్కడి వాళ్ళకి చెప్పి జాయిన్ చేస్తుంది. భాగ్యమ్మ చిన్మయి వాళ్ళ ఇంటికి వస్తుంది. దేవి వాళ్ళు ఎక్కడికి పోయారని అడుగుతుంది. అప్పుడే రుక్మిణి ఎదురుపడుతుంది. ఇంటికి ఎందుకు వచ్చావని అడుగుతుంది. అదేంటి ఏదైనా మాట్లాడాలంటే కబురు పెడుతుంది కదా అని రుక్మిణి అడుగుతుంది. ఆయమ్మకి నువ్వు నన్ను కలిశావేమో అని అనుమానం వచ్చిందని భాగ్యమ్మ రుక్మిణికి చెప్పడంతో షాక్ అవుతుంది. అందుకే నా దగ్గరకి వచ్చి మస్త్ బాధపడింది ఐ జరిగిందంతా రుక్మిణికి చెప్తుంది.