అన్వేషించండి

Bigg Boss Telugu: బిగ్‌ బాస్‌లో మెరిసిన టీఆర్ఎస్ ఎంపీ.. వెయ్యి ఎకరాల అడవి దత్తత తీసుకుంటానని నాగార్జున హామీ

టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ప్రచారానికి గానూ ఆయన తెలుగు బిగ్ బాస్ షోకు హాజరయ్యారు.

టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ అకస్మాత్తుగా తెలుగు బిగ్‌బాస్‌ షోలో సందడి చేశారు. హోస్ట్ నాగార్జునతో కలిసి వేదికను పంచుకున్నారు. ఎంపీ సంతోష్‌ కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ప్రచారానికి గానూ ఆయన ఈ బిగ్ బాస్ షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తాను వెయ్యి ఎకరాల అడవిని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని హీరో అక్కినేని నాగార్జున ఈ షోలో ప్రకటించారు. అడవుల పరిరక్షణ కోసం గ్రీన్‌ చాలెంజ్‌ కార్యక్రమం ద్వారా ఎంపీ సంతోష్‌ కుమార్‌ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆయన స్ఫూర్తితోనే అడవిని దత్తత తీసుకుంటున్నట్టు వెల్లడించారు. అనంతరం బిగ్‌బాస్‌ హౌస్‌లో మొక్క నాటారు.

వాతావరణ మార్పులను అడ్డుకోవాలంటే ప్రజలంతా బాధ్యతగా మొక్కలు నాటాలని ఎంపీ సంతోష్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. మన ఊరి కోసం, భవిష్యత్‌ తరాల కోసం ప్రతి ఒక్కరూ ప్రతి చోటా మొక్కలు నాటాలని కోరారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ‘‘సంతోష్‌కుమార్‌ పట్టుదలతో 16 కోట్ల మొక్కలు నాటారు. మనమంతా ఎన్ని నాటగలం. నేను వచ్చే మూడు వారాలు మూడు మొక్కలు నాటుతానని ప్రమాణం చేస్తున్నా. నాకు అడవులంటే చాలా ఇష్టం. ఎక్కడ చూపిస్తే అక్కడ అడవిని దత్తత తీసుకుంటా’ అని నాగార్జున హామీ ఇచ్చారు. అయితే, హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో అడవులు ఉన్నాయని వాటిని దత్తత తీసుకోవచ్చని ఎంపీ తెలిపారు.

బిగ్ బాస్ హౌస్‌లో మొక్క
‘‘బిగ్‌బాస్‌ హౌస్‌లో నేను మొక్క నాటుతున్నా. మీరు కూడా మీ ఇళ్లల్లో, గ్రామంలో, మండలంలో, నియోజకవర్గంలో మొక్కలు నాటండి. ఈ కార్యక్రమాన్ని ఎంత ఎక్కువగా ముందుకు తీసుకెళ్తే మనకు అంత ప్రయోజనం. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ముఖ్యమంత్రి స్ఫూర్తితోనే గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ను ముందుకు తీసుకెళ్తున్నా. నాలుగేళ్లుగా అందరి సహకారంతో విజయవంతంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ ముందుకు సాగుతుంది. గ్రీన్‌ చాలెంజ్‌ను విజయవంతం చేస్తున్నవారందరికీ థ్యాంక్స్. హీరో ప్రభాస్‌ కూడా తన తండ్రి పేరుపై 1,643 ఎకరాల్లో ఉన్న కాజీపల్లి అడవిని, హెటిరో డ్రగ్స్‌ పార్ధసారథిరెడ్డి 2,500 ఎకరాల అడవులను దత్తత తీసుకున్నారు. తాము నిరంతరం మొక్కల యజ్ఞం చేస్తున్నాం. శక్తి ఉన్నంతవరకు దీనిని ముందుకు తీసుకెళ్తూనే ఉంటాం.’’ అని స్పష్టం చేశారు.

Also Read: ముగిసిన శిల్పా చౌదరి పోలీస్ కస్టడీ... రూ. 7 కోట్లు తిరిగిచ్చేందుకు అంగీకారం..!

Also Read: పగలు రెక్కీ రాత్రి చోరీలు... పాత నేరస్థుడి పక్కా ప్లాన్... సరూర్ నగర్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

Also Read: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Giri Babu : టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం - సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత
టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం - సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత
Dhindora Series Season 2 OTT : మామకు కొత్త కష్టాలు! - డబుల్ డోస్‌తో కామెడీ సిరీస్ 'ఢిండోరా' సీజన్ 2... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
మామకు కొత్త కష్టాలు! - డబుల్ డోస్‌తో కామెడీ సిరీస్ 'ఢిండోరా' సీజన్ 2... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Comedy Thriller OTT : ప్రతీ చిన్న విషయానికీ 'అనుమాన పక్షి'లా ఉంటే? - ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్... ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ప్రతీ చిన్న విషయానికీ 'అనుమాన పక్షి'లా ఉంటే? - ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్... ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 14th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఛీ.. ఛీ.. అసలు సహస్ర మనిషేనా? సిరిని ముట్టుకోవడానికి అసహ్యించుకున్న తల్లి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఛీ.. ఛీ.. అసలు సహస్ర మనిషేనా? సిరిని ముట్టుకోవడానికి అసహ్యించుకున్న తల్లి!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gig Workers Scheme Bebefits: గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
AP Local Body Elections: అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు: ఏపీ ఎస్‌ఈసీ
అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు
Elon Musk Supports Jensen Huang: మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
N Ramchander Rao: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్ట్.. తెలంగాణలో రాజ్యాంగం అమలుపై ప్రశ్నలు 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్ట్.. తెలంగాణలో రాజ్యాంగం అమలుపై ప్రశ్నలు 
Cricketer Suicide: ప్రేమ పేరుతో వేధింపులు.. అండర్ 19 క్రికెటర్ ఆత్మహత్య- వికారాబాద్‌లో ఘటన
ప్రేమ పేరుతో వేధింపులు.. అండర్ 19 క్రికెటర్ ఆత్మహత్య- వికారాబాద్‌లో ఘటన
Small Cars: మీ ఇంటి దగ్గర రోడ్డు చాలా ఇరుకా? పార్కింగ్‌కు సరైన స్థలం లేదా? ఈ 8 కార్లు మీకు మంచి ఎంపిక
చిన్న సందులు, ఇరుకైన అపార్ట్‌మెంట్ పార్కింగ్‌లకు సులభంగా సరిపోయే 8 కార్లు ఇవే!
15-11-2026 ఆదివారం రాశిఫలాలు: ధనుస్సు, మకర, కుంభ, మీనం వారికి గ్రహాల శుభ ప్రభావంతో అదృష్టం!
15-11-2026 ఆదివారం రాశిఫలాలు: ధనుస్సు, మకర, కుంభ, మీనం వారికి గ్రహాల శుభ ప్రభావంతో అదృష్టం!
Embed widget