News
News
X

Guppedantha Manasu September 22nd Update: మాటలతో వసు మనసుకి మరో గాయం చేసిన రిషి, బయటపడిన దేవయాని-సాక్షి కుట్ర!

Guppedantha Manasu September 22st Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు( గురువారం) ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

FOLLOW US: 

గుప్పెడంత మనసు గురువారం ఎపిసోడ్  ( Guppedantha Manasu September 22 Today Episode 562)

ఎవ్వరికీ తెలియకుండా ఓ వ్యక్తి దగ్గర్నుంచి పెన్ డ్రైవ్ తీసుకున్న రిషి...అది ఓపెన్ చేసి చూస్తాడు. అందులో ఫుటేజ్ చూసి షాక్ అవుతాడు. పరీక్ష రాయకుండా చేసేందుకు వసుధారని సాక్షితో కిడ్నాప్ చేయిస్తుంది దేవయాని. అయితే ఆ ఫుటేజ్ లో వసుధారకి మత్తు మందిచ్చి తీసుకెళ్లిన వ్యక్తిని..ఆ వెనుకే ఉన్న సాక్షిని చూస్తాడు. ఇంత పెద్ద విషయం వసుధార నా దగ్గర దాచిందా అనుకుంటాడు. కట్ చేస్తే ఇంటికెళ్లిన రిషిని తీసుకుని ధరణి రూమ్ కి వెళుతుంది వసుధార. నా దగ్గరకు వచ్చినప్పుడే ఇలా జరిగింది సార్ అని చెప్పి బాధపడుతుంది.. నీ దగ్గరకు వచ్చిన ఎవ్వర్నీ ప్రశాంతంగా ఉంచవా వసుధారా అని అనేస్తాడు రిషి...ఏమీ మాట్లాడలేక బాధగా చూస్తుండిపోతుంది వసుధార... 

Also Read: వంటలక్కకి ఘోర అవమానం, ఇంట్లోంచి వెళ్లిపోయిన హిమ, సౌందర్యకి దొరికిపోయిన మోనిత!

జరిగిన కథ
రిషి తనతో మాట్లాడుతాడో లేదో అనుకున్న మహేంద్ర దగ్గరకు వచ్చి sorry చెబుతాడు రిషి. నా కోపం ఎంతోసేపు ఉండదు డాడ్ అంటూనే భోజనం చేశారా అని అడుగుతాడు. ఆ తర్వాత గౌతమ్ వసు ను ఏమైనా అన్నావా అనటంతో అప్పుడే అక్కడికి జగతి వస్తుంది. దూరమైన వాళ్ళు దగ్గర కారని.. దగ్గరైన వాళ్ళు దూరం కారు అని జగతిని-వసుధారని ఉద్దేశించి అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

అటు వసుధార కాలేజీలో తన క్లాస్ రూమ్ కి వెళ్లి బోర్డు మీద యాంగ్రీ ప్రిన్స్ అని రాసి రిషి గురించి తనలో తాను మాట్లాడుకుంటుంది. ఎలాగైనా రిషి సార్ ఇక్కడికి రావాలి  అనుకుంటండంగా అక్కడకు వస్తాడు రిషి. 
రిషి: ఏం జరిగినా నాకు నీ మీద ప్రేమ తగ్గదు..నీకు మూడు రోజుల సమయం ఇస్తున్నాను.. నీ దగ్గర నుండి నాకు సమాధానం కావాలి.. ఆ ప్రశ్న ఏంటో.. ఆ జవాబు ఏంటో నీకే తెలుసు.. దాన్నిబట్టే భవిష్యత్తు ఉంటుంది
వసు: ఏడుస్తూ నా ప్రేమలో ఎటువంటి సార్ధం లేదంటుంది. 
రిషి: మూడు రోజుల్లో సమాధానం కావాలని అక్కడి నుంచి వెళ్తాడు 
ఆ తర్వాత రిషి తన క్యాబిన్ దగ్గరకు వెళ్లి ఓ వ్యక్తి దగ్గర్నుంచి పెన్ డ్రైవ్ తీసుకుంటాడు..ఈ పెన్ డ్రైవ్ ఇచ్చిన సంగతి ఎవ్వరికీ చెప్పొద్దు నువ్వెళ్లు అని పంపించేసి క్యాబిన్లోకి వెళతాడు. 

Also Read: వసు చుట్టూ ప్రేమకంచె వేసిన రిషి, సహాయం చేయాలంటూ పెద్ద మెలిక పెట్టిన ఈగో మాస్టర్

ఆ తర్వాత వసుధార ఇంట్లో వదిలేసిన చీర తీసుకెళ్లి ఇస్తుంది ధరణి. కాసేపు మాట్లాడాక అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇంతలో యాక్సిడెంట్ అయి కాలికి దెబ్బతగిలి పడిపోతుంది. వసుధార ఇంటికి తీసుకురావడం చూసి దేవయాని మండిపడుతుంది. వసు ఎక్కడినుంచి వచ్చింది ...ఆ సమయంలో వసు అక్కడ ఎందుకు ఉంది..గతంలో రిషికి యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడే ఉన్నావు, ఇప్పుడు ధరణికి యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడే ఉన్నావ్...మా ఇంటి వాళ్లకి ఎప్పుడు ఏం జరుగుతుందో కాచుకుని కూర్చుంటావా అని నోరు పారేసుకుంటుంది. 

జగతిని కాఫీ ఇమ్మని అడిగితే..ముందు ధరణి పని చూశాక ఇస్తానంటుంది జగతి. కోపంగా రియాక్టైన దేవయాని దగ్గరకొచ్చిన వసుధార..జగతి మేడం మీరు కాఫీ ఇవ్వండి ధరణి మేడం పని నేను చూసుకుంటా అంటుంది. నువ్వింకా ఇక్కడే ఉన్నావేంటి వెళ్లు రిషి వస్తే కోప్పడతాడని దేవయాని అంటే...ఆయన వచ్చాకే వెళతాను అంటుంది వసుధార. ఇదంతా బుధవారం రాత్రి ఎపిసోడ్..దీనికి కొనసాగింపే పైన ప్రోమో....

Published at : 22 Sep 2022 09:55 AM (IST) Tags: Guppedantha Manasu Daily Serial Episode Sai Kiran Raksha Gowda Mukesh Gowda Rasagnya Reddy jyothi roy Guppedantha Manasu September 22 Guppedantha Manasu Episode 562

సంబంధిత కథనాలు

Devatha October 3rd Update: ప్రకృతి వైద్యశాలకి జానకమ్మ, ఆదిత్యకి స్పాట్ పెట్టిన మాధవ్- పాండిచ్చేరి ట్రిప్ ప్లాన్ చేసిన సత్య

Devatha October 3rd Update: ప్రకృతి వైద్యశాలకి జానకమ్మ, ఆదిత్యకి స్పాట్ పెట్టిన మాధవ్- పాండిచ్చేరి ట్రిప్ ప్లాన్ చేసిన సత్య

Ennenno Janmalabandham October 3rd: ఆదిత్యకి ప్రేమగా అన్నం తినిపించిన వేద - తన సూసైడ్ ఎటెంప్ట్ కి కారణం ఎవరో చెప్పి షాకిచ్చిన మాళవిక

Ennenno Janmalabandham October 3rd: ఆదిత్యకి ప్రేమగా అన్నం తినిపించిన వేద - తన సూసైడ్ ఎటెంప్ట్ కి కారణం ఎవరో చెప్పి షాకిచ్చిన మాళవిక

Bigg Boss 6 Telugu: ఆరోహి ఎలిమినేషన్, వెక్కి వెక్కి ఏడ్చేసిన సూర్య - ఆదివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: ఆరోహి ఎలిమినేషన్, వెక్కి వెక్కి ఏడ్చేసిన సూర్య - ఆదివారం ఎపిసోడ్ హైలైట్స్!

Adipurush: 'ఆదిపురుష్' టీజర్ పై ట్రోల్స్ - ట్రెండింగ్‌లో 'Disappointed' హ్యాష్ ట్యాగ్!

Adipurush: 'ఆదిపురుష్' టీజర్ పై ట్రోల్స్ - ట్రెండింగ్‌లో  'Disappointed' హ్యాష్ ట్యాగ్!

Rahul Ramakrishna: ‘గాంధీ గొప్పవాడని నేను అనుకోను’.. నటుడు రాహుల్ రామకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు!

Rahul Ramakrishna: ‘గాంధీ గొప్పవాడని నేను అనుకోను’.. నటుడు రాహుల్ రామకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు!

టాప్ స్టోరీస్

Hyderabad News: హైదరాబాద్ లో ఉగ్రకుట్న భగ్నం, ముగ్గుర్ని అరెస్ట్ చేసిన సిట్ పోలీసులు

Hyderabad News: హైదరాబాద్ లో ఉగ్రకుట్న భగ్నం, ముగ్గుర్ని అరెస్ట్ చేసిన సిట్ పోలీసులు

CM Jagan : సీఎం జగన్ ఉదారత, చిన్నారి వైద్యానికి కోటి రూపాయలు మంజూరు

CM Jagan : సీఎం జగన్  ఉదారత, చిన్నారి వైద్యానికి కోటి రూపాయలు మంజూరు

Adipurush Teaser: 'న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం' - 'ఆదిపురుష్' టీజర్!

Adipurush Teaser: 'న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం' - 'ఆదిపురుష్' టీజర్!

Weather Updates: ఏపీలో 2 రోజులపాటు భారీ వర్షాలు, తెలంగాణలో వాతావరణం ఇలా

Weather Updates: ఏపీలో 2 రోజులపాటు భారీ వర్షాలు, తెలంగాణలో వాతావరణం ఇలా