అన్వేషించండి

Karthika Deeppam September 22nd: వంటలక్కకి ఘోర అవమానం, ఇంట్లోంచి వెళ్లిపోయిన హిమ, సౌందర్యకి దొరికిపోయిన మోనిత!

కార్తీకదీపం సెప్టెంబరు 22 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ నుంచి మోనితను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉంది వంటలక్క...

Karthika Deepam September 22 th Episode 1464 (కార్తీకదీపం సెప్టెంబరు 22 ఎపిసోడ్)

ఆనందరావు, హిమ రాసిన ఉత్తరాన్ని చదువుతూ ఉంటాడు.
హిమ:తాతయ్య శౌర్య లేకుండా నేను ఉండలేను. నేను శౌర్యను జాగ్రత్తగా చూసుకుంటాను అని అమ్మానాన్నలకు మాట ఇచ్చాను. నా గురించి వెతకొద్దు మళ్ళీ మీరు  శౌర్య దగ్గరికి వస్తే శౌర్య నన్ను కూడా వదిలేసి వెళ్ళిపోతుంది. నేను వెళ్తున్నాను అని ఉత్తరం రాసి వెళ్ళిపోతుంది. 
ఆనందరావు: ఆ ఉత్తరం చదివి కన్నీళ్లు పెట్టుకున్న ఆనందరావు నీ దగ్గర ఉండకూడదు అనే కదమ్మా శౌర్య కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే తను అక్కడి నుంచి ఇంక ఎక్కడికో వెళ్ళిపోతుంది.ఇప్పటికే కొడుకు,కోడల్ని, మనవరాలను దూరం చేసుకున్నాం. ఇప్పుడు నిన్ను కూడా దూరం చేసుకోవాల్సి వస్తుంది.. సౌందర్య కి విషయం తెలిస్తే ఎంత బాధ పడుతుంది అనుకుని..సౌందర్యకి కాల్ చేస్తాడు. నేను రోడ్లు, రైల్వే స్టేషన్లు అన్ని వెతికాను,ఎక్కడా దొరకలేదని చెబుతాడు
సౌందర్య: శౌర్య ఉండేది ఈ ఊర్లోనే కదా ఇక్కడకే వచ్చి ఉంటుంది..కంగారు పడొద్దు నేను వెతికి పట్టుకుంటాను 
ఆనందరావు: మోనిత గురించి ఏమైనా తెలిసిందా..
సౌందర్య: ఆ ప్రయత్నంలోనే ఉన్నానండీ. మీరొక్కరే అక్కడే ఉంటే కంగారుపడతారు మీరుకూడా బయలుదేరి వచ్చేయండి..
ఆనందరావు: అలాగే సౌందర్య బయలుదేరుతాను

Also Read: వంటలక్కే నా భార్య అన్న కార్తీక్, దీపను పిచ్చిదాన్ని చేసేందుకు స్కెచ్ వేసిన మోనిత!
కార్తీక్ ని వేరే ఊరికి తీసుకెళ్లిన మోనిత..కార్తీక్ బట్టలకొట్టు అనే బోర్డు చూపిస్తుంది. పెళ్లైన కొత్తలో ఇక్కడ బట్టలకొట్టు నడిపేవాళ్లం..బిజినెస్ బాలేదని ఆ తర్వాత అక్కడకు వెళ్లి బొటిక్ స్టార్ట్ చేశాం అని చెప్పి పద ఊర్లోకి వెళదాం అంటుంది. ఆ వెనుకే ఫాలో అయిన దీప.. కార్తీక్ బట్టల కొట్టుని చూసి ఇదేదో పెద్ద మాయే చేస్తోంది అనుకుంటూ వాళ్లని ఫాలోఅవుతుంది. దీపని చూసి మోనిత వికృతంగా నవ్వుకుంటుంది...ఓ చోట కారు ఆపి దిగుతారు మోనిత-కార్తీక్...దీప కూడా వీళ్లని ఫాలో అవుతుంది

అలా ఊర్లోకి వెళ్లి కార్తీక్, మోనితలు కార్ దిగేసరికి అక్కడికి ఊర్లో జనం అంతా వస్తారు.దూరం నుంచి చూస్తూ దీప, ఒక కొత్త గతమే సృష్టించేసేలా ఉన్నదే అని అనుకుంటుంది. అప్పుడు ఆ ఊరి వాళ్ళు అందరూ కార్తీక్ కి మోనిత భార్య, ఆనంద్ బిడ్డ అని గట్టిగా నమ్మిస్తారు. ఇదంతా విన్న దీప, లాభం లేదు ఇప్పుడు నేను అక్కడికి వెళ్లాలి లేకపోతే డాక్టర్ బాబు జరిగిందంతా నమ్మేస్తారు అని అక్కడికి వెళ్తుంది. దీపని చూసిన వారంతా...వంటలక్కా నువ్వు ఇంకా కార్తీక్ ని వదల్లేదా ఇప్పటికైనా నీ పీడ లేకుండా వాళ్ళిద్దరూ హాయిగా ఉంటారు అనుకున్నాను కానీ ఇక్కడ కూడా వాళ్ళు ఎందుకు వదలట్లేదని మండిపడతారు. 

ఈ వంటలక్కకి పెళ్లయింది కార్తీక్..తన భర్త ఒక ఆర్ఎంపీ డాక్టర్.మీ ఇంట్లో ఇంట్లో వంటమనిషిగా పని చేసేది.నిన్ను చూసి డాక్టర్ అంటే నీలా ఉండాలి అని తన భర్తని చిన్నచూపు చూసింది. అప్పుడు తన భర్త తని వదిలేసి వెళ్ళిపోయాడు అప్పుడు నుంచి నీ వెంటే తిరుగుతోందని నమ్మించే ప్రయత్నిస్తారు.మోనిత మాటలు నమ్మొద్దు మీరు నాకు తాళి కట్టిన భర్త అని దీప చెప్పినా ఎవ్వరూ వినిపంచుకోరు. ఇంతలో అక్కడికి ఇంకొక కారు వచ్చి ఆగుతుంది. కార్ దిగుతూనే,కార్తీక్, మోనితా ఎప్పుడొచ్చారు...0 నాకు చెప్పకుండా వచ్చారేంటి చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. ఆనంద్ కూడా వచ్చాడా అని పలకరిస్తూ పక్కన ఉన్న దీప ను చూసి ఏ వంటలక్క సిగ్గు లేదా నీకు ఇప్పుడు కూడా వస్తున్నావు అని తిడుతుంది. కార్తీక్, మోనిత లు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. దీప ఏడ్చుకుంటూ డుచుకుంటూ అక్కడే ఉంటుంది. 

Also Read: వసు చుట్టూ ప్రేమకంచె వేసిన రిషి, సహాయం చేయాలంటూ పెద్ద మెలిక పెట్టిన ఈగో మాస్టర్
ఆ తర్వాత సీన్లో సౌందర్య ఓ SI కి కాల్ చేసి మోనిత నంబర్ తీసుకుంటుంది. అదే సమయంలో కార్తీక్...బోటిక్ లో బట్టలు సర్దుతుంటాడు. మోనిత మాత్రం కుర్చీలో కూర్చుని దీపని అవమానించినదంతా గుర్తుచేసుకుని నవ్వుకుంటుంది. ఇకపై దీప గోల మాకు ఉండదని ఫిక్సవుతుంది. ఇంతలో సౌందర్య నుంచి కాల్ వస్తుంది. ఎవరు మాట్లాడుతున్నారని మోనిత అంటే నేను సౌందర్యని అంటుంది...అదే సమయంలో కార్తీక్ బొమ్మ కిందపడేయడంతో జాగ్రత్త కార్తీక్ అంటుంది. ఆ మాట సౌందర్య వినేస్తుంది. కార్తీక్ అంటున్నావ్ ఏంటని అడుగుతుంది...భయంతో మోనిత కాల్ కట్ చేస్తుంది. 
సౌందర్య: విన్నారు కదండీ అది కార్తీక్ అన్న మాట అన్నది. నేను చెప్పాను ఇక్కడ ఏదో పెద్దదే జరుగుతోందని వెంటనే బయలుదేరాలి
మోనిత: ఫోన్ లో ఈవిడున్నారని కూడా తెలియకుండా నోరు జారాను.  ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తారా ఏంటని భయపడుతూ ఉంటుంది. 
కార్తీక్: ఫోన్ వచ్చిన దగ్గరి నుంచి ఎందుకు భయపడుతున్నావు మోనిత 
మోనిత: తలనొప్పిగా ఉంది 
కార్తీక్: సరే వెళ్లి పడుతో... 
కాల్ కట్ చేసినప్పటికీ మోనిత మళ్లీ కాల్ వస్తుందని టెన్షన్ పడుతుంటుంది...
ఎపిసోడ్ ముగిసింది...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
Miss Universe 2024: విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ - ఆ దేశ తొలి మహిళగా రికార్డు
విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ - ఆ దేశ తొలి మహిళగా రికార్డు
Delhi Minister Kailash Gehlot Resigns : ఢిల్లీలో గేమ్ స్టార్ట్ చేసిన బీజేపీ- ఆప్‌లో మొదటి వికెట్‌ డౌన్ - రాజీనామా చేసిన మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ తీవ్ర ఆరోపణలు
ఢిల్లీలో గేమ్ స్టార్ట్ చేసిన బీజేపీ- ఆప్‌లో మొదటి వికెట్‌ డౌన్ - రాజీనామా చేసిన మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ తీవ్ర ఆరోపణలు
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
Embed widget