News
News
X

Karthika Deeppam September 21st: వంటలక్కే నా భార్య అన్న కార్తీక్, దీపను పిచ్చిదాన్ని చేసేందుకు స్కెచ్ వేసిన మోనిత!

కార్తీకదీపం సెప్టెంబరు 21 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ నుంచి మోనితను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉంది వంటలక్క...

FOLLOW US: 

Karthika Deepam September 21 th Episode 1463 (కార్తీకదీపం సెప్టెంబరు 21 ఎపిసోడ్)

మన బాబు పేరేంటని అడుగుతాడు కార్తీక్... చెప్పక తప్పని పరిస్థితుల్లో ఆనంద్ అని చెబుతుంది మోనిత. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది అనడంతో..నీ కొడుకు పేరు రోజూ నా నోటినుంచి వింటుంటావు కదా అని కవర్ చేస్తుంది. ఆ తర్వాత ఆనంద్ ని తీసుకుని లోపలకు వెళ్లిపోతాడు కార్తీక్. నేను భార్యను అంటే నమ్మాడు, బిడ్డను దగ్గరకు తీసుకున్నాడు...కానీ ఈ ఆనందం శాశ్వతం అంటే ఒప్పుకోను ఎవ్వరికీ కనిపించనంతదూరం వెళ్లిపోవాలి అనుకుంటుంది మోనిత. ఇంతలో వంటలక్క అక్కడకు వస్తుంది. 
మోనిత: నేరుగా అత్తగారింట్లోకి వచ్చినట్టు వస్తావేంటి..నా ఇంటికి రావొద్దని ఎన్నిసార్లు చెప్పాలి..నా కాపురానికి శనిలా దాపురించావ్ 
దీప: ఏం మాట్లాడుతున్నావ్..పరాయి ఆడదాన్ని మొగుడిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఏమంటారో ఊర్లోవాళ్లని అడుగు
మోనిత: ప్రేమించాను, బిడ్డను కన్నాను..ఇంతకన్నా ఏం కావాలి
దీప: నువ్వు ఎలా తల్లివి అయ్యావో నీకు తెలుసు.. నా సహనాన్ని పరీక్షించొద్దు మోనిత
మోనిత: ఎవరు ఎవరి సహనాన్ని పరీక్షిస్తున్నారు.. గతం గుర్తుచేసేందుకు ప్రయత్నించి ఏం చేద్దామని, ఇందాక నేను సమయానికి రాకపోతే ఏమయ్యేది
దీప: ఆపని చేసింది నువ్వు.. మందులిచ్చి మర్చిపోయేలా చేసింది నువ్వు..ఆ మందులు ఎక్కువ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయో నీకు తెలియదా
మోనిత: తెలుసు కానీ తన లైఫ్ లోంచి నిన్ను సైడ్ చేయడానికి ఆ మందులు వాడుతున్నాను
దీప: అవునులే నువ్వు తాళికట్టిన భార్యవి అయి ఉంటే తెలిసేది..కార్తీక్ చనిపోతే మరో మగాడిని వెతుక్కుంటావ్...
మోనిత: పెళ్లైందని తెలిసినా వెంటాడాను, చనిపోయాడని తెలిసినా వెతికాను..ఈ జన్మకి కార్తీక్ మాత్రమే నా భర్త
దీప: ఇదంతా గుర్తొచ్చినంతవరకే...ఆ తర్వాత నీకుంటుంది
మోనిత: గుర్తుకు రాకుండా చేస్తాను..నా కొడుక్కి తండ్రి అయినవాడు నాకు మొగుడు అవడానికి ఎంతసేపు 
దీప: నువ్వు నన్ను వేరేఊరు పంపించేందకు ప్లాన్ చేసినప్పుడే ఇలాంటి ప్లాన్ ఏదో వేస్తున్నావని అర్థమైంది. నీ కొడుకుని ఎత్తుకుని మురిసిపోతుంటే ముందు టెన్షన్ పడ్డాను...కానీ ఆ తర్వాత అర్థమైంది. బాబుని ఎత్తుకున్నప్పుడైనా నా జ్ఞాపకాలు గుర్తొస్తాయి..
మోనిత: ఆ ఛాన్సే లేదు..
దీప: పోయాను అనుకున్న నేనే తిరిగిరాగా లేనిది..పోయిన జ్ఞాపకం తిరిగి రాదా..వస్తుంది..

డాక్టర్ బాబు అని పిలుస్తుంది దీప..కార్తీక్ వచ్చాక మాట్లాడుతుంటుంది.. జ్ఞాపకాలు ఎందుకు అనుకుంటాం కానీ కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా ఉండడం మంచిది..మీరు ఇలాగే బాబుతో ఆడుకుంటూ గుర్తుచేసుకునేందుకు ప్రయత్నించండి అని చెప్పేసి దీప వెళ్లిపోతుంది...

Also Read: కథని మలుపుతిప్పనున్న మోనిత కొడుకు ఆనంద్, దీప చెప్పింది వినగానే కళ్లు తిరిగిపడిపోయిన కార్తీక్

శౌర్య ఎక్కడుందో తెలుసుకుని ఆనందరావు, హిమ వెళతారు. నిన్ను ఈ రోజు ఎలాగైనా తీసుకెళ్లేందుకే వచ్చామని హిమ అంటే.. అమ్మా నాన్న బతికే ఉన్నారు..వాళ్లు వచ్చేవరకూ రాను అని చెప్పి పంపించేస్తుంది. 
కార్తీక్ బయటకు వెళ్లి రాగానే... ఎక్కడికి వెళ్లి వస్తున్నావ్..ఆ వంటలక్క కనిపించిందా అని అడుగుతుంది
మోనిత: అదొక్కటి చాలుకాదు నా ప్రాణానికి
కార్తీక్: నా భార్యవి నువ్వా-వంటలక్కా..గతం మర్చిపోయాను..ఎవరు ఏది చెబితే అది నమ్మాను.. నువ్వు నా భార్యవేనా నువ్వు నన్ను హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన కొన్నాళ్లవరకూ బాగానే ఉన్నాం..ఎప్పుడైతే వంటలక్క వచ్చిందో అప్పటి నుంచి నీకు భయం మొదలైంది..నాకు కారణం తెలియాలి మోనిత..
మోనిత: నువ్వు చెప్పింది నిజమే కానీ కారణం ఇది అని ఎలా చెప్పగలను అని మనసులో అనుకుని... బయటకు దొంగ ఏడుపు ఏడుస్తుంది.. నువ్వు నన్ను ఎప్పుడూ అర్థం చేసుకోలేదని డ్రామా స్టార్ట్ చేస్తుంది... బిడ్డను తీసుకొచ్చి నీ చేతిలో పెట్టాక కూడా నువ్వు నన్ను అనుమానిస్తున్నావ్..నేను ఎంత ఏడుస్తున్నా నువ్వు ఓదార్చడం లేదు..నిన్ను నమ్మించడానికి ఏం చేయాలో తెలియడం లేదని నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుంటుంది...

అటు దీప తన అన్నయ్యతో మాట్లాడుతుంది..
దీప: మా జీవితంలో జరిగిన సంఘటనలు గుర్తుచేసాను..కాసేపు టెన్షన్ పడ్డారు..కళ్లు తిరిగి పడిపోయారు ఆ తర్వాత లేచాక మళ్లీ మామూలుగానే ఉన్నారు
అన్నయ్య: నీ ప్రయత్నం వృధా కాదు..నీ భర్తని హాస్పిటల్ కి తీసుకురా..టెస్టులు చేయిస్తే ప్రజెంట్ స్టేటస్ తెలుస్తుంది.
దీప: ఎలాగైనా డాక్టర్ బాబుని హాస్పిటల్ కి తీసుకొస్తాను

Also Read: ఒకరికి ఈగో మరొకరికి పొగరు ఇద్దరూ ఇద్దరే -'తగ్గేదే లే' అన్న రిషి, 'వదిలేదే లే' అన్న వసు

మరోవైపు మోనిత బట్టలు సర్దుతుంది...రాత్రంతా తిండి నిద్రలేదు..ఏడుస్తూ కళ్లు వాచిపోయాయి..అయినా పట్టింపేలేదని మళ్లీ డ్రామా స్టార్ట్ చేస్తుంది. నువ్వు నన్ను వంటలక్కతో పోల్చావ్ అంటూ ఫైర్ అవుతుంది
కార్తీక్: వంటలక్క వచ్చాకే కదా నీలో అనుమానం మొదలైంది..అందుకే అన్నా
మోనిత: ఈ అనుమానాలన్నీ తీరాలంటే ఊరికి వెళ్లాలి..అక్కడకు వెళ్లాక నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం...
కార్తీక్: టిఫిన్ తినేసి బయలుదేరుదాం పద..
మోనిత: ఈ మాత్రం డోస్ ఇస్తేకానీ దారిలోకి రాడు..ఇప్పుడు చూపిస్తాను నా ప్రతాపం..
మా మేడం సార్ ని, బాబుని తీసుకుని ఏదో ఊరు వెళుతున్నారక్కా అని వచ్చి చెబుతాడు శివ.. ఎలాగైనా కనుక్కో శివ అని దీప అంటే.. మా సార్ డ్రైవ్ చేస్తే మా మేడం దారిచూపిస్తుందట..ఏ ఊరో కనుక్కుని వస్తానంటాడు
కార్తీక్: మన ఊరు ఎంత దూరం ..రెండు గంటలే అయితేఇన్నాళ్లూ తీసుకెళ్లలేదు...
మోనిత: నన్ను అనుమానిస్తున్నావ్ కదూ అని డ్రామా స్టార్ట్ చేస్తుంది...
కార్తీక్ ఏమీ మాట్లాడలేక వెళ్లిపోతాడు...
ఇంతలో శివ వచ్చి.. మీరుచెప్పమన్నట్టే వంటలక్కకి చెప్పాను..ఆమె టెన్షన్ పడుతోందని చెబుతాడు.....
మోనిత: మంచి పని చేశావ్.. మా కారు వెనుకే వచ్చి పిచ్చెక్కిపోతుంది...

Published at : 21 Sep 2022 08:23 AM (IST) Tags: Karthika Deepam Serial karthika Deepam Serial Today Episode Karthika Deepam Serial Written Update Karthika Deepam Serial September 21st 1463 Episode

సంబంధిత కథనాలు

DJ Tillu 2: మొన్న డైరెక్టర్, ఇప్పుడు హీరోయిన్లు - 'డీజే టిల్లు'సీక్వెల్‌ను లైట్ తీసుకుంటున్నారా?

DJ Tillu 2: మొన్న డైరెక్టర్, ఇప్పుడు హీరోయిన్లు - 'డీజే టిల్లు'సీక్వెల్‌ను లైట్ తీసుకుంటున్నారా?

Daughters Day 2022: కూతురు సితారకు మహేష్ బాబు డాటర్స్ డే గ్రీటింగ్స్!

Daughters Day 2022: కూతురు సితారకు మహేష్ బాబు డాటర్స్ డే గ్రీటింగ్స్!

Chiranjeevi: మెగా నిర్మాతల నిర్ణయం - 'గాడ్ ఫాదర్'ని మలయాళంలో రిలీజ్ చేస్తారా?

Chiranjeevi: మెగా నిర్మాతల నిర్ణయం - 'గాడ్ ఫాదర్'ని మలయాళంలో రిలీజ్ చేస్తారా?

Nayanthara: నయనతార ప్రెగ్నెంట్? విఘ్నేష్ శివన్ పోస్ట్ వైరల్

Nayanthara: నయనతార ప్రెగ్నెంట్? విఘ్నేష్ శివన్ పోస్ట్ వైరల్

Ponniyin Selvan: ఐశ్వర్య కూతురు ఆరాధ్యకు అరుదైన గౌరవం, ‘పొన్నియన్ సెల్వన్-1’లో ఊహించని ఘటన

Ponniyin Selvan: ఐశ్వర్య కూతురు ఆరాధ్యకు అరుదైన గౌరవం, ‘పొన్నియన్ సెల్వన్-1’లో ఊహించని ఘటన

టాప్ స్టోరీస్

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Kishan Reddy : అప్పుల కోసం కేంద్రాన్ని కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు- కిషన్ రెడ్డి

Kishan Reddy : అప్పుల కోసం కేంద్రాన్ని కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు- కిషన్ రెడ్డి

Zaheerabad Rape: పెళ్లైన మహిళపై గ్యాంగ్ రేప్! జహీరాబాద్‌లో దారుణం

Zaheerabad Rape: పెళ్లైన మహిళపై గ్యాంగ్ రేప్! జహీరాబాద్‌లో దారుణం

North Korea: కిమ్ కవ్వింపు చర్యలు- సీరియస్‌గా స్పందించిన దక్షిణ కొరియా!

North Korea: కిమ్ కవ్వింపు చర్యలు- సీరియస్‌గా స్పందించిన దక్షిణ కొరియా!