సెప్టెంబరు 21 రాశిఫలాలు



మేషం
ఈ రోజు మీకు సంతోషకరమైన రోజు అవుతుంది. చట్టపరమైన పనిలో విజయం సాధించడం వల్ల మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. ఆస్తి సంబంధిత వ్యవహారాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు.



వృషభం
వృషభ రాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. కళారంగంతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ రోజు మంచి రోజు. గతంలో తీసుకున్న అప్పులు చెల్లించేందుకు ప్రయత్నిస్తారు. తలపెట్టిన పనులు సక్సెస్ అవుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.



మిథునం
మీ విశ్వాసానికి ఫుల్ మార్కులు పడతాయి. కుటుంబంలో కొనసాగుతున్న విభేదాల కారణంగా విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టలేరు. ఈ రోజు మీ స్నేహితులని కలవడం వల్ల మీ మనస్సు సంతోషంగా ఉంటుంది.కోపం తగ్గించుకోండి .



కర్కాటకం
ఈ రోజు మీ రంగంలో మీకు కొంత గందరగోళంగా ఉంటుంది. స్నేహితుల ముసుగులో శత్రువులున్నారు అప్రమత్తం అవండి. ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే అజాగ్రత్తగా ఉండకండి. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థిక సహాయం పొందుతారు.



సింహం
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. గృహ జీవితంలో కొన్ని సమస్యలు ఉంటే, ఈ రోజు మీరు వారి కోసం చర్చిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరు మీకు ఈ రోజు అబద్ధం చెబుతారు. సోమరితనాన్ని విడిచిపెట్టాలి.



కన్య
ఈ రోజు గృహ వివాదాల నుంచి విముక్తి పొందే అవకాశం ఉంది. ఈ రోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెరుగుతున్న ఖర్చుల గురించి మీరు ఆందోళన చెందుతారు.



తులా
ఈ రోజు మీకు మిశ్రమ రోజుగా ఉంటుంది. మీ పిల్లల భవిష్యత్తును సజావుగా మార్చేందుకు కొన్ని ప్రణాళికలు వేసుకుంటారు. ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వ్యక్తులు ఈ రోజు ప్రయోజనం పొందుతారు. నూతన పెట్టుబడులకు ఇది మంచి సమయం.



వృశ్చికం
ఈ రోజు ఆరంభం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. గత కొంతకాలంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమవుతాయి. నిలిచిపోయిన పనులు ప్రారంభమవుతాయి. వ్యాపారులకు అవసరానికి డబ్బు చేతికందుతుంది.



ధనుస్సు
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలుంటాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది..రోజంతా సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు పనిలో వేగం కొనసాగించాలి..లేదంటే ప్రమోషన్ కు ఆటంకాలు తప్పవు. కుటుంబ సభ్యులు ఈరోజు టూర్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.



మకరం
ఈ రోజు మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. మనశ్శాంతిగా ఫీలవుతారు. ఆగిపోయిన పనులు సులభంగా పూర్తవుతాయి. వ్యాపారులు, ఉద్యోగులు లాభాలు పొందుతారు. నూతన పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలసమయం.



కుంభం
ఈ రోజు మీకు మిగిలిన రోజుల కంటే మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో ఎవ్వర్నీ నమ్మకండి...మీ నమ్మకాన్ని ఆ వ్యక్తి కోల్పోయే ప్రమాదం ఉంది. ఉద్యోగులు, వ్యాపారులకు గౌరవం పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి అవకాశం వస్తుంది.



మీనం
ఈ రోజు మీ కుటుంబంలో ఏదైనా శుభకార్యం నిర్వహించాలని ప్రణాళికలు వేస్తారు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఎగుమతి-దిగుమతి వ్యాపారం చేసేవారు ప్రయోజనం పొందుతారు. కార్యాలయంలో కొన్ని అడ్డంకులు ఉంటే, అవి కూడా తొలగిపోతాయి.