సెప్టెంబరు 15 రాశిఫలాలు



మేష రాశి
ఈ రోజు మీరు కొన్ని శుభ కార్యాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. కళ, సాహిత్య రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు శుభదినం. షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల లాభాలు వస్తాయి. ఈ రోజు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది.



వృషభ రాశి
ఈ రోజు మీరు తలపెట్టే పనులకు తల్లిదండ్రుల మద్దతు పొందుతారు. కొన్ని విషయాల్లో మెండిగా వ్యవహరిస్తారు. ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు ఉండొచ్చు. ఆకస్మిక ధనలాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు చదువులో విజయం సాధిస్తారు.



మిథున రాశి
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రత్యర్థులను ఓడించగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి సాధించే అవకాశాలున్నాయి. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. చర్మ సమస్యలతో ఇబ్బంది పడతారు. పెద్ద జాబ్ ఆఫర్ పొందే అవకాశం ఉంది.



కర్కాటక రాశి
ఈ రోజు కర్కాటక రాశి వారికి ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవడానికి అనుకూలమైన రోజు. కళారంగంతో అనుబంధం ఉన్న వ్యక్తులు తమ ప్రతిభను కనబర్చే అవకాశం లభిస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. వ్యాపారులు లాభపడతారు.



సింహ రాశి
ఈ రోజు మీరు ఎవరిచేతిలోనైనా మోసపోతారు..జాగ్రత్తగా ఉండండి. జీవిత భాగస్వామితో ఏదో ఒక విషయంలో వాగ్వాదం జరుగుతుంది. బ్యాంకింగ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.



కన్యా రాశి
ఈరోజంతా సరదాగా ఉంటారు. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. ఆధ్యాత్మిక కార్యాల పట్ల మొగ్గు పెరుగుతుంది. వ్యాపారంలో పురోగతికి అవకాశాలున్నాయి. మీరు స్టాక్ మార్కెట్ నుంచి లాభం పొందుతారు.



తులా రాశి
వ్యాపార ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కెరీర్‌లో హెచ్చు తగ్గులు ఉండొచ్చు. ఈ రోజు అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. ఆర్థిక పరిస్థితి లాభదాయకంగా ఉంటుంది. ఖర్చులు కూడా పెరుగుతాయి. మీ కుటుంబం ,కార్యాలయంలో సామరస్యాన్ని కాపాడుకోండి.



వృశ్చిక రాశి
ఈ రోజు మీ పనితీరుకు అందరి నుంచి ప్రశంసలు పొందుతారు. ఆరోగ్య పరంగా ఈ రోజు శుభప్రదం. ఉపాధి పెరుగుతుంది. మీరు అపరిచిత వ్యక్తి నుంచి సహాయం పొందుతారు. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది.



ధనుస్సు రాశి
ఈ రోజు మీ పనిని కార్యాలయంలోని సీనియర్ అధికారులు మెచ్చుకుంటారు. ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళన చెందుతారు. కెరీర్‌లో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. మనోబలం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.



మకర రాశి
మీరు తీర్థయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. అవివాహితుల వివాహాలు స్థిరపడతాయి. సోదర సోదరీమణులు లాభపడతారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు బయట తినకుండా ఉంటే మంచిది.



కుంభ రాశి
వ్యాపారులు ఈరోజు ప్రణాళికలను పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది. కుటుంబంలో ఒకరి అనారోగ్య కారణాల వల్ల మీరు ఇబ్బంది పడవచ్చు. మీరు మీ ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవాలి. కుటుంబం పట్ల మీ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు.



మీన రాశి
వాహన సుఖం పెరిగే సూచనలున్నాయి. ఉద్యోగులు కార్యాలయంలో రాజకీయాలకు దూరంగా ఉండండి. ఈ రోజంతా సరదాగా ఉంటారు. పనుల్లో వేగం పుంజుకుంటుంది. మీరు ఎవరినైనా ప్రత్యేకంగా కలుసుకుంటారు.