2022 నవంబరు 8 చంద్రగ్రహణం - ఈ రాశులవారు చూడకూడదు



శ్రీ శుభకృత్ నామసంవత్సరం మార్గశిర శుద్ధ పూర్ణిమ నవంబరు 8 మంగళవారం భరణి నక్షత్రం మూడో పాదంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం పడుతుంది.



స్పర్శ కాలం మధ్యాహ్నం - 2 గంటల 38 నిముషాలు



మధ్య కాలం మధ్యాహ్నం - 4 గంటల 28 నిముషాలు



మోక్ష కాలం మధ్యాహ్నం - 6 గంటల 18 నిముషాలు



ఆద్యంత పుణ్యకాలం 3 గంటల 40 నిముషాలు



ఈ గ్రహణం భరణి నక్షత్రం మేషరాశిలో పట్టడం వల్ల అశ్విని, భరణి, కృత్తిక నక్షత్ర జాతకులు... మేష రాశివారు ఈ గ్రహణం చూడరాదు.



చంద్రోదయం సాయంత్రం 5 గంటల 27 నిముషాలకు అవుతుంది. అందుకే విడుపు సమయంలో 51 నిముషాలు మాత్రమే ఈ గ్రహణం కన్పిస్తుంది.



నియమాలు పాటించే గర్భిణి స్త్రీలు కూడా సాయంత్రం 5.27 నుంచి 6.18 వరకు కదలకుండా పడుకుంటే చాలు.
Images Credit: Pinterest