2022 అక్టోబరు 25 మంగళవారం సూర్య గ్రహణం



శ్రీ శుభకృత్ నామసంవత్సరం ఆశ్వయుజ బహుళ అమావాస్య మంగళవారం అక్టోబరు 25వ తేదీ స్వాతి నక్షత్రం రెండో పాదంలో కేతుగ్రస్త సూర్యగ్రహణం సాయంత్రం దాదాపు 5.03 నిముషాలకు ప్రారంభమవుతుంది.



స్పర్శ కాలం సాయంత్రం - 5 గంటల 3 నిముషాలు



మధ్య కాలం సాయంత్రం - 5 గంటల 28 నిముషాలు



మోక్ష కాలం సాయంత్రం - 5 గంటల 35 నిముషాలు



ఆద్యంత పుణ్యకాలం 32 నిముషాలు



ఈ గ్రహం స్వాతి నక్షత్రం తులా రాశిలో పడుతుంది. అందుకే చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రాల వారు కన్య,తులా రాశివారు ఈ గ్రహం చూడరాదని చెప్పారు పండితులు.



గ్రహణ కాలం 32 నిముషాలే కాబట్టి.. నియమాలు పాటించే గర్భిణి స్త్రీలకు పెద్దగా సమస్య ఉండదు.



Images Credit: Pinterest