మేష రాశి మేషరాశి ప్రేమికుల మధ్య మనస్పర్థలు తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. మనసులో అశాంతి ఉండదు. ఉద్యోగులు, వ్యాపారులకు మంచి సమయం.
వృషభ రాశి ఈ రాశివారికి పనిభారం పెరుగుతుంది. మీ ప్రవర్తనతో అందర్నీ ఆకట్టుకుంటారు. రిలాక్స్ అయ్యేందుకు కొంత సమయాన్ని కేటాయించండి. వ్యాపారం సాధారణంగా సాగుతుంది.కొత్త ప్రయోగాలు చేయవద్దు.
మిథున రాశి ఈ రాశివారికి ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో ఉన్న వివాదాలు మీపై మరింత ఒత్తిడి పెంచుతాయి. ఆహారంపై శ్రద్ధ వహించండి. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. పనిభారం పెరుగుతుంది.
కర్కాటక రాశి ఈ రోజు కర్కాటక రాశివారు సంతోషంగా ఉంటారు. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. దీర్ఘకాలంగా ఉన్న వివాదాలను పరిష్కరించడంలో విజయం సాధిస్తారు.
సింహ రాశి సింహ రాశి వారు పెరిగిన ఖర్చులు తగ్గించే దిశగా ఆలోచన చేయండి. ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీరు మీ జీవిత భాగస్వామితో సంతోష సమయం గడుపుతారు.
కన్యా రాశి ఈ రోజు మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఏదైనా పనికి అధికంగా ఖర్చుచేయడం వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. ఖర్చులు తగ్గించకపోతే భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవు. మీకు ఇబ్బంది కలిగించే విషయాలకు దూరంగా ఉంచాలి.
తులా రాశి ఈ రోజు తులారాశి వారిపై పనిభారం ఎక్కువగా ఉండవచ్చు. పిల్లల నుంచి విన్న కొన్ని వార్తలు సంతోషాన్నిస్తాయి. ఉద్యోగులు తమ టార్గెట్లు రీచ్ అవుతారు. వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టాలి.
వృశ్చిక రాశి ఈ రాశి ఉద్యోగుల బాధ్యతలు పెరుగుతాయి. కార్యాలయంలో పనిభారం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో వివాదాలు ఉండొచ్చు. ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన డబ్బు అందుతుంది.
ధనుస్సు రాశి ఈ రోజంతా ఉత్సాహంగా ఉంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తిచేస్తారు. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని సర్ ప్రైజ్ చేస్తారు. ఆర్థిక లాభం పొందాలి అనుకుంటే అనుభవజ్ఞుల సలహాలు తీసుకుని ముందుకు సాగండి.
మకర రాశి ఈ రాశివారు తల్లిదండ్రులతో సరదాగా గడుపుతారు. రోజంతా ఓపికగా వ్యవహరిస్తారు. కుటుంబంలో అనారోగ్యంతో ఉన్నవారికి చికిత్స కోసం ఖర్చులు పెరుగుతాయి. మీకు మీ పిల్లల మద్దతు సంపూర్ణంగా ఉంటుంది.
కుంభ రాశి ఈ రాశివారికి సంపాదన కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అందుకే పొదుపు చేయడం చాలా ముఖ్యం. సామాజిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. కుటుంబం కోసం సమయం వెచ్చించండి. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి.
మీన రాశి ఈ రోజు మీ సానుకూల ప్రవర్తన మీ చుట్టూ ఉన్న వ్యక్తులను ఆకట్టుకుంటుంది. మీ వ్యక్తిగత జీవితంలో వేరేవారి ఇన్వాల్వ్ మెంట్ కారణంగా గొడవలు జరుగుతాయి. భవిష్యత్ గురించి ఆందోళన చెందుతారు.