సెప్టెంబరు 9 రాశిఫలాలు



మేష రాశి
ఈ రోజు మేష రాశి వారు ఎవరి దగ్గరా అప్పులు తీసుకోపోవడం మంచిది. మీరు తలపెట్టిన పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యలు, స్నేహితుల నుంచి పూర్తి సహకారం ఉంటుంది. ఉద్యోగులకు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి.



వృషభ రాశి
గతంలో నిలిచిపోయిన పనులు ఊపందుకుంటాయి. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ రోజంతా బిజీగా ఉంటారు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగులుకు ఉన్నతాధికారుల మద్దతు ఉంటుంది. వ్యాపారం బాగానే సాగుతుంది.



మిథున రాశి
దుబారా ఖర్చులకు దూరంగా ఉండండి. ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్లయితే ఈ రోజు ఆ ఇబ్బంది మరింత పెరుగుతుంది. మతపరమైన పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది.



కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ రోజు శుభదినం. పిల్లలపై నమ్మకం బలంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు లభిస్తాయి. మీరు మీ సౌకర్యాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉంటుంది. ఆహారం నిర్లక్ష్యం చేయకండి.



సింహ రాశి
మానసిక ఆందోళన కారణంగా ఆ ప్రభాలం మీ పనిపై పడుతుంది. కుటుంబ సభ్యుల కారణంగా కొంత ప్రశాంతతను పొందుతారు. అవసర మాటలు వద్దు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి.



కన్యా రాశి
ఈ రోజు ధైర్యంగా దూసుకుపోతారు. వ్యాపారులకు మంచి లాభాలుతెచ్చిపెట్టే రోజిది. ఉద్యోగులకు కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామిపట్ల శ్రద్ధ వహించండి. అనవసర ఖర్చులు పెరగుతాయి.



తులా రాశి
ఆస్తి ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మీ గురువుపై పూర్తి విశ్వాసం ఉంచండి. కొత్త పనుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఈరోజు అనుకూలమైన రోజు.పేదలకు సహాయం చేయండి. ఉద్యోగులు, వ్యాపారులకు బాగానే ఉంటుంది.



వృశ్చిక రాశి
ఈ రోజు మీరు ఏదో సమస్యతో బాధపడతారు. చాలా రోజులుగా వివాదంలో ఇరుక్కుని ఉంటే ఈ రోజు ఉపశమనం పొందే అవకాశం ఉంది. వ్యాపారాభివృద్ధికి, నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఈ రోజు మీకు అనుకూలం.



ధనుస్సు రాశి
ఈ రోజు ధనుస్సు రాశి వారికి అదృష్టం కలిసొస్తుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కన్నా మెరుగ్గా ఉంటుంది. ఆధ్యాత్మిక వ్యవహాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగులు తమ పనితీరుతో అందర్నీ మెప్పిస్తారు.



మకర రాశి
వ్యాపారులకు సంబంధించి ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు ఈ రోజు పూర్తిచేస్తారు. కొత్త పనిలో పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన రోజు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ ఖర్చులు తగ్గించడం మంచిది.



కుంభ రాశి
ఈ రోజు కుంభ రాశి వారు తమ తెలివితేటలు, వివేకంతో పనులు పూర్తిచేసుకుంటారు. ఆర్థికపరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అవసరం చూసుకుని ఖర్చు చేయండి. ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. స్నేహితులతో సమయం స్పెండ్ చేస్తారు.



మీన రాశి
ఈ రాశి పిల్లలకు సంబంధించి ఓ సమస్యకు పరిష్కారం దొరుకుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారులు లాభాలు పొందుతారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. రోజంతా సరదాగా ఉంటారు.