ABP Desam


సెప్టెంబరు 12 రాశిఫలాలు


ABP Desam


మేష రాశి
మేష రాశి వారికి సోమవారం కొంత గందరగోళంగా ఉంటుంది. ఈ రోజు మద్యానికి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. కుటుంబంలో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. కాస్త ఓర్పుగా వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి.


ABP Desam


వృషభం రాశి
వృషభ రాశి వారికి ఈరోజు మంచి రోజు. విలువైన వస్తువులు జాగ్రత్త చేసుకోవాలి. ముఖ్యంగా ఉద్యోగులు తమ వస్తువుల విషయంలో అశ్రద్ధగా వ్యవహరించవద్దు. ఆరోగ్యం బావుంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది.


ABP Desam


మిథున రాశి
మిథున రాశివారికి ఈ రోజు అంత అనుకూలంగా ఉండదు. ఆర్థికంగా నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. పరిస్థితులు మీకు అంతగా అనుకూలంగా ఉండవు. టైమ్ వేస్టే చేసేవారికి దూరంగా ఉండడం చాలా మంచిది.


ABP Desam


కర్కాటక రాశి
కర్కాటక రాశు ఈ రోజు పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటారు. ఈ రోజు స్నేహితులు, సహోద్యోగుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. కుటుంబానికి సమయం కేటాయించగలుగుతారు. ఉద్యోగులకు, వ్యాపారులకు అనుకూలమైన రోజు.


ABP Desam


సింహ రాశి
ఈ రాశివారు ఎట్టి పరిస్థితుల్లోనూ సహనం కోల్పోవద్దు. ఓర్పుగా వ్యవహరించకపోతే చాలా నష్టపోవాల్సి ఉంటుంది. కొత్తగా వ్యాపారం చేసేవారికి పెట్టుబడులు పెట్టేందుకు ఈ రోజు మంచి రోజు. ఉద్యోగులు పదోన్నతి పొందుతారు.


ABP Desam


కన్యా రాశి
కన్యారాశివారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలున్నాయి. ఖర్చులు తగ్గించుకుంటే చాలా మంచిది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది..అందుకే నిర్లక్ష్యం చేయకుండా ముందుకు సాగడి.


ABP Desam


తులా రాశి
తులా రాశి వారు ఈ రోజు మానసిక సంతృప్తిని పొందుతారు. ఈ రోజు ఏ ఆస్తిలోనూ పెట్టుబడి పెట్టకపోవడం మంచిది. పార్ట్ టైమ్ ఉద్యోగం ప్రారంభించడానికి ఈరోజు మంచిది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు మిశ్రమ ఫలితాలున్నాయి.


ABP Desam


వృశ్చిక రాశి
వృశ్చిక రాశివారికి ఈ రోజు ఆరోగ్యం మెరుగుపడుతుంది. సీనియర్లు, సహోద్యోగుల నుంచి మద్దతు పొందుతారు. మీ పనితీరుకి అభినందనలు అందుకుంటారు. వ్యాపారం బాగాసాగుతుంది.


ABP Desam


ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి అనుకూలమైన సమయం. కొన్ని ముఖ్యమైన ప్రణాళికలు ముందుకు సాగుతాయి . మీకు ఆర్థిక ప్రయోజనాలుంటాయి. మీ మంచికోరి సలహాలు, సూచనలు చెప్పేవారి మాటలు వినేందుకు ప్రయత్నించండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.


ABP Desam


మకర రాశి
మకర రాశివారు ధ్యానంపై ధ్యాస పెట్టడం మంచిది. ఆర్థిక పరంగా మీకు కలిసొచ్చే రోజు. పాత అప్పుల నుంచి బయటపడతారు. కొత్త అప్పులు చేయకుండా ఉండడం చాలా మంచిది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు మిశ్రమ ఫలితాలున్నాయి.


ABP Desam


కుంభ రాశి
కుంభ రాశి వారు తమ ప్రవర్తనతో ప్రశసంలు అందుకుంటారు. సేవాభావం కలిగి ఉంటారు. అనుకోకుండా చేతికి డబ్బు అందుతుంది. పనిచేసే ప్రదేశంలో కూడా ప్రయోజనం పొందుతారు.


ABP Desam


మీన రాశి
మీన రాశివారికి ఈ రోజు ఖర్చుతో కూడుతున్న రోజు అవుతుంది. అయినప్పటికీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. త్వరలోనే ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సంతోష సమయం గడుపుతారు.