మేష రాశి ఎప్పటి నుంచో ఉన్న ఇబ్బందులు తీరుతాయి. ప్రణాళికలను జాగ్రత్తగా అమలు చేయండి. వ్యక్తిగత సంబంధాలలో కొంత ఇబ్బంది ఉండవచ్చు. అందరినీ మెప్పించాలనే ఆలోచనలో ఉండొద్దు. మీకంటూ ఓ అభిప్రాయం ఏర్పరుచుకోవడం మంచిది.
వృషభ రాశి ఈ రాశివారు ఈ రోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. స్నేహితులతో కలిసి ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. మనశ్శాంతిగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. స్థిరాస్తి కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.
మిథున రాశి కాస్త ఓపికగా వ్యవహరించండి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఈరోజు ఒకరి వల్ల ఆర్థిక లాభం ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతోష సమయం గడుపుతారు.
కర్కాటక రాశి మీ జీవిత భాగస్వామితో కూర్చుని మాట్లాడేందుకు ప్రయత్నించండి..చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. పిల్లలతో స్పెండ్ చేసే టైమ్ పెంచేలా చూసుకోండి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఈ రోజు మీరు చాలా కాలం తర్వాత స్నేహితుడిని కలుసుకోవచ్చు.
సింహ రాశి ఈ రోజు రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకపోవడం మంచిది. మీ ఇంట్లో ఉన్న అవివాహితులకు సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ కోసం కూడా సమయం కేటాయించండి.
కన్యారాశి ఈ రోజంతా సరదాగా గడుపుతారు. మీరు మీ జీవిత భాగస్వామి నుంచి కొన్ని శుభవార్తలు అందుకుంటారు. మీరు రిఫ్రెష్‌గా ఉంటారు. ఏదైనా పాత పెట్టుబడి నుంచి లాభం పొందవచ్చు.
తులా రాశి ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు..మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారులకు శుభసమయం. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. ఖర్చులు అదుపుచేసుకోవడం మంచిది.
వృశ్చిక రాశి ఈ రోజు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది కానీ అజాగ్రత్తగా ఉండకండి. కుటుంబ సభ్యులతో సంభాషించేటప్పుడు స్వీయ నియంత్రణ పాటించండి. భార్యాభర్తల మధ్య అనుబంధం దృఢంగా ఉంటుంది
ధనుస్సు రాశి ఈ రోజు మీరు మీ ఖర్చులను నియంత్రించవలసి ఉంటుంది. ఉద్యోగ రీత్యా ప్రయాణం చేయాల్సి రావొచ్చు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి పొందుతారు.
మకర రాశి తల్లిదండ్రుల ఆరోగ్యంపై ఆందోళన పెరుగుతుంది. ఆదాయానికి తగిన ఖర్చుపెరగడంతో మీరు కొంత ఇబ్బంది పడతారు. ప్రేమికులు దూరమవుతారు. మీలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది.
కుంభ రాశి మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి లేదంటే మీ మాటల పట్ల కుటుంబ సభ్యులు బాధపడవచ్చు. మీ మనస్సును ఆధ్యాత్మిక వ్యవహారాలవైపు మళ్లించడం మంచిది. ఆకస్మిక ధనలాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మీన రాశి ఈ రోజు మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు కానీ ఓపిక పట్టండి. గతంలో చేసిన వృధా ఖర్చుల భారాన్ని భరించవలసి ఉంటుంది. కుటుంబ సభ్యులతో సామరస్యంగా వ్యవహరించేందుకు ప్రయత్నించండి.